Bhagwan Birsu Munda Birth Anniversary: బిర్సు ముండా జయంతిపై యూజీసీ ఆదేశాలు
Bhagwan Birsu Munda Birth Anniversary: నవంబర్ 15న భగవాన్ బిర్సు ముండా జయంతిని ఘనంగా నిర్వహించాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అన్ని ఉన్నత విద్యా సంస్థలను ఆదేశించింది.
Bhagwan Birsu Munda Birth Anniversary: కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు, భగవాన్ బిర్సు ముండా జయంతిని ‘జన జాతీయ గౌరవ దినోత్సవం’గా నవంబర్ 15న ఘనంగా నిర్వహించాలని దేశవ్యాప్తంగా ఉన్న అన్ని విద్యాసంస్థలను University Grants Commission (UGC) ఆదేశించింది.
Bhagwan Birsu Munda Birth Anniversary: కార్యక్రమాలు నిర్వహించండి
Bhagwan Birsu Munda జయంతిని ’జన్ జాతీయ గౌరవ దివస్(Janjatiya Gaurav Divas)’గా జరుపుకోవాలని, ఈ సందర్బంగా నవంబర్ 15న కాలేజీల్లో వ్యాస రచన పోటీలను, వక్తృత్వ పోటీలను, ఇతర కార్యక్రమాలను నిర్వహించాలని యూజీసీ తెలిపింది. భగవాన్ బిర్సు ముండా జీవితంపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని కోరింది. అలాగే, జనజాతి వర్గానికి చెందిన ప్రముఖుల జీవితాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని కోరింది.
Bhagwan Birsu Munda Birth Anniversary: వ్యాస రచన, వక్తృత్వ పోటీలు
భగవాన్ బిర్సు ముండా జయంతి రోజైన నవంబర్ 15న ఆయన జీవితంపై, స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న జనజాతి వర్గానికి చెందిన ప్రముఖుల జీవితాలపై విద్యార్థులకు వ్యాస రచన, వక్తృత్వ పోటీలను నిర్వహించాలని UGC దేశవ్యాప్తంగా ఉన్నఅన్ని ఉన్నత విద్యా సంస్థలను ఆదేశించింది. జన జాతియ గౌరవ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాలను సోషల్ మీడియాలో ప్రచారం చేయాలని సూచించింది. గత సంవత్సరం ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ Bhagwan Birsu Munda జయంతిని జనజాతీయ గౌరవ దినోత్సవంగా నిర్వహించాలని నిర్ణయించారు. ఇది భారత్ లోని గిరిజన జాతులను గౌరవించుకోవడమేనన్నారు.