CDAC Recruitment 2024: సీ డ్యాక్ లో ప్రాజెక్ట్ ఇంజనీర్ జాబ్స్; రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం
CDAC Recruitment 2024: సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్ సహా పలు ఇతర పోస్టుల భర్తీకి సెంటర్ ఫర్ డెవలప్ మెంట్ ఆఫ్ అడ్వాన్స్ డ్ కంప్యూటింగ్ (CDAC) అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్, ఇతర పోస్టుల భర్తీకి సెంటర్ ఫర్ డెవలప్ మెంట్ ఆఫ్ అడ్వాన్స్ డ్ కంప్యూటింగ్ (CDAC) నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు సీడ్యాక్ అధికారిక వెబ్సైట్ cdac.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్ మెంట్ డ్రైవ్ ద్వారా సంస్థలో 325 పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఫిబ్రవరి 20 లాస్ట్ డేట్
ఫిబ్రవరి 1న ప్రారంభమైన రిజిస్ట్రేషన్ ప్రక్రియ 2024 ఫిబ్రవరి 20న ముగియనుంది. అర్హత, ఎంపిక విధానం, తదితర వివరాల కోసం కింద చదవండి.
ఖాళీల వివరాలు
ప్రాజెక్ట్ అసోసియేట్ / జూనియర్ ఫీల్డ్ అప్లికేషన్ ఇంజినీర్ : 45 పోస్టులు
ప్రాజెక్ట్ ఇంజినీర్ (ఎక్స్ పీరియన్స్డ్) / ఫీల్డ్ అప్లికేషన్ ఇంజినీర్ : 150 పోస్టులు
ప్రాజెక్ట్ మేనేజర్ / ప్రోగ్రామ్ మేనేజర్ / ప్రోగ్రామ్ డెలివరీ మేనేజర్ / నాలెడ్జ్ పార్ట్ నర్ / ప్రొడ్ సర్వీస్ అండ్ ఔట్ రీచ్ (PS&O) మేనేజర్ : 15 పోస్టులు
ప్రాజెక్ట్ ఆఫీసర్ : 5 పోస్టులు
ప్రాజెక్ట్ సపోర్ట్ స్టాఫ్ : 9 పోస్టులు
ప్రాజెక్ట్ టెక్నీషియన్ : 1 పోస్టు
సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్ / మాడ్యూల్ లీడ్ / ప్రాజెక్ట్ లీడ్ / ప్రొడ్ సర్వీస్ అండ్ ఔట్ రీచ్ (పీఎస్ అండ్ ఓ) ఆఫీసర్ : 100 పోస్టులు
అర్హతలు
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు విద్యార్హత, అనుభవం, వయోపరిమితి తదితర వివరాల కోసం సీడ్యాక్ వెబ్ సైట్ cdac.in లో ఉన్న సవివరమైన నోటిఫికేషన్ ను పరిశీలించండి.
ఎంపిక విధానం
అభ్యర్థులు తమ అప్లికేషన్ లో వివరించిన అకడమిక్ రికార్డులు, ఇతర పారామీటర్ల ఆధారంగా ప్రాథమిక స్క్రీనింగ్ ఉంటుంది. స్క్రీనింగ్ చేసిన అభ్యర్థులను మాత్రమే తదుపరి ఎంపిక ప్రక్రియకు పరిగణనలోకి తీసుకుంటారని తెలిపారు. రాతపరీక్ష/ స్కిల్ టెస్ట్/ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
అప్లికేషన్ ఫీజు
ఈ ప్రకటనకు దరఖాస్తు చేయడానికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. మరిన్ని వివరాలకు అభ్యర్థులు సీడీఏసీ అధికారిక వెబ్సైట్ cdac.in ను చూడవచ్చు.
టాపిక్