CBSE Date Sheet 2025 : సీబీఎస్ఈ 10, 12వ తరగతి ఎగ్జామ్ టైమ్ టేబుల్ వచ్చేసింది.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి-cbse exam time table for class 10th 12th released check cbse date sheet 2025 here know how to download ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Cbse Date Sheet 2025 : సీబీఎస్ఈ 10, 12వ తరగతి ఎగ్జామ్ టైమ్ టేబుల్ వచ్చేసింది.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

CBSE Date Sheet 2025 : సీబీఎస్ఈ 10, 12వ తరగతి ఎగ్జామ్ టైమ్ టేబుల్ వచ్చేసింది.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

Anand Sai HT Telugu
Nov 21, 2024 06:05 AM IST

CBSE Date sheet 2025 : సీబీఎస్ఈ ఎగ్జామ్ టైమ్ టేబుల్ వచ్చేసింది. 10వ తరగతి, 12వ తరగతి పరీక్షల కోసం సీబీఎస్ఈ డేట్‌షీట్ 2025 విడుదల అయింది. టైమ్‌టేబుల్‌ని చెక్ చేయడానికి డైరెక్ట్ లింక్ కింద ఉంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సీబీఎస్ఈ డేట్‌షీట్ 2025ని విడుదల చేసింది. 10వ, 12వ తరగతి బోర్డ్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు cbse.govలో పూర్తి డేట్‌షీట్‌ను చెక్ చేయవచ్చు. అధికారిక డేటాషీట్ ప్రకారం, 10వ తరగతి బోర్డు పరీక్ష ఫిబ్రవరి 15న ప్రారంభమై మార్చి 18, 2025న ముగుస్తుంది. 12వ తరగతి బోర్డు పరీక్ష ఫిబ్రవరి 15న ప్రారంభమై ఏప్రిల్ 4, 2025న ముగుస్తుంది.

సీబీఎస్ఈ బోర్డ్ ఎగ్జామ్ డేట్‌షీట్‌ ప్రకారం రెండు తరగతుల్లోని విద్యార్థులకు సాధారణంగా అందించే సబ్జెక్టుల మధ్య తగినంత గ్యాప్ ఇచ్చారు. ఒకే విద్యార్థికి రెండు సబ్జెక్ట్ పరీక్షలు ఒకే తేదీన రాకుండా చూసేలా డేట్ షీట్ తయారు చేశారు. ఈ పరీక్షలు ఆయా తేదీల్లో ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 1.30 వరకు జరుగుతాయి. అయితే పరీక్షల వ్యవధి సబ్జెక్టుల ఆధారంగా మారుతాయి. సబ్జెక్ట్ అవసరాలకు తగ్గట్టుగా 2 లేదా 3 గంటలు ఉంటుంది. ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ, బిజినెస్ స్టడీస్ వంటివాటికి మూడు గంటలు ఉంటుంది. టూరిజం, డ్యాన్స్ వంటి ప్రత్యేక వృత్తిపరమైన సబ్జెక్టులకు రెండు గంటలు ఇస్తారు.

10, 12వ తరగతికి సంబంధించిన సీబీఎస్ఈ డేట్‌షీట్ 2025ని డౌన్‌లోడ్ చేసుకోవాలనుకునే అభ్యర్థులు దిగువ ఇచ్చిన దశలను అనుసరించవచ్చు.

cbse.gov.inలో CBSE అధికారిక వెబ్‌సైట్‌ను వెళ్లాలి.

హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న 10, 12వ తరగతి కోసం సీబీఎస్ఈ డేట్‌షీట్ 2025పై క్లిక్ చేయండి.

తేదీలను చెక్ చేసే కొత్త PDF ఫైల్ ఓపెన్ అవుతుంది.

పేజీని డౌన్‌లోడ్ చేయండి. తర్వాత అవసరాల కోసం దాని హార్డ్ కాపీని తీసుకోండి.

భారతదేశం, విదేశాల్లోని 8,000 పాఠశాలల నుండి సుమారు 44 లక్షల మంది విద్యార్థులు ఈ సంవత్సరం 10, 12 తరగతుల బోర్డు పరీక్షలకు హాజరయ్యేందుకు అర్హులు. మెుదటిసారిగా దాదాపు పరీక్షలకు 86 రోజుల ముందు సీబీఎస్‌ఈ డేట్‌షీట్‌లు విడుదల చేసింది. సీబీఎస్ఈ ప్రతీ విద్యార్థికి అడ్మిట్ కార్డు నిర్ణీత సమయంలో విడుదల చేస్తుంది. విద్యార్థికి సంబంధించిన నిర్దిష్ట సబ్జెక్టుల పరీక్ష తేదీ అందులో పేర్కొంటారు. మరిన్ని సంబంధిత వివరాల కోసం అభ్యర్థులు CBSE అధికారిక వెబ్‌సైట్‌ను చెక్ చేయవచ్చు.

సీబీఎస్ఈ ఎగ్జామ్ టైమ్ టేబుల్ పీడీఎఫ్ ఇదే

Whats_app_banner