CBSE Date Sheet 2025 : సీబీఎస్ఈ 10, 12వ తరగతి పరీక్షల టైమ్ టేబుల్‌ని ఇలా డౌన్‌లోడ్ చేసుకోవాలి
CBSE Date Sheet 2025 : సీబీఎస్ఈ పరీక్షా తేదీల షీట్ 2025 డిసెంబర్‌లో విడుదల అవుతుంది. బోర్డు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ cbse.gov.inలో టైమ్‌టేబుల్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డేట్ షీట్, తాత్కాలిక షెడ్యూల్‌ని డౌన్‌లోడ్ చేయడానికి కొన్ని స్టేప్స్ ఫాలో కావాలి.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) డిసెంబర్ 2024లో 10వ తరగతి, 12వ తరగతి బోర్డు పరీక్షల కోసం టైమ్‌టేబుల్‌ను విడుదల చేస్తుంది. గత సంవత్సరాల ట్రెండ్‌ను ప్రకారం ఫిబ్రవరి 15, 2025న పరీక్షలు ప్రారంభమవుతాయని భావిస్తున్నారు. 2023 నుండి CBSE ఈ తేదీన స్థిరంగా పరీక్షలను నిర్వహిస్తోంది. అంతకుముందు 2021, 2022లో కోవిండ్ కారణంగా వాయిదా వేశారు.
12వ తరగతి ప్రాక్టికల్స్‌ను ఎక్స్‌టర్నల్ ఎగ్జామినర్లు పర్యవేక్షిస్తారు. 10వ తరగతి ప్రాక్టికల్స్‌ను పాఠశాల ఉపాధ్యాయులు నిర్వహిస్తారు.
ఇలా డౌన్‌లోడ్ చేయాలి
విద్యార్థులు ఈ దశలను అనుసరించడం ద్వారా టైమ్‌టేబుల్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు:
CBSE అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి. cbse.gov.in ఓపెన్ చేయాలి.
CBSE 10వ తరగతి తేదీ షీట్ 2025 లేదా CBSE 12వ తరగతి తేదీ షీట్ 2025 కోసం లింక్‌పై క్లిక్ చేయండి.
టైమ్‌టేబుల్‌ను కలిగి ఉన్న PDF కనిపిస్తుంది. దీనిని డౌన్‌లోడ్ చేయండి.
తాత్కాలిక టైమ్ టేబుల్
మునుపటి ట్రెండ్‌ల ఆధారంగా 10వ తరగతి పరీక్షల తాత్కాలిక తేదీలు ఇక్కడ ఉన్నాయి. ఎప్పుడో ఓసారి చూడండి.
ఫిబ్రవరి 15, 2025 : పెయింటింగ్, గురుంగ్, రాయ్, తమాంగ్, షెర్పా
ఫిబ్రవరి 17, 2025 : సెక్యూరిటీ, ఆటోమోటివ్, ఫైనాన్షియల్ మార్కెట్‌లు, పర్యాటకం, బ్యూటీ అండ్ వెల్‌నెస్
ఫిబ్రవరి 19, 2025: హిందుస్తానీ సంగీతం, బుక్ కీపింగ్, అకౌంటెన్సీ
ఫిబ్రవరి 20, 2025: సంస్కృతం
ఫిబ్రవరి 21, 2025 : ప్రాంతీయ భాషలు (ఉర్దూ, బెంగాలీ, తమిళం మొదలైనవి)
ఫిబ్రవరి 24, 2025: హిందీ
ఫిబ్రవరి 25, 2025: వివిధ భాషా కోర్సులు
ఫిబ్రవరి 26, 2025: పంజాబీ, సింధీ, మలయాళం మొదలైనవి.
మార్చి 3, 2025: ఇంగ్లీష్ (భాష, సాహిత్యం)
మార్చి 4, 2025: వ్యాపారం, ఆరోగ్య సంరక్షణ, రిటైల్ అంశాలు
మార్చి 7, 2025: సైన్స్
మార్చి 10, 2025: హోమ్ సైన్స్, మల్టీ స్కిల్ ఫౌండేషన్
మార్చి 11, 2025: అరబిక్, రష్యన్, జర్మన్, మొదలైనవి.
మార్చి 12, 2025: సోషల్ సైన్స్
మార్చి 15, 2025: గణితం (ప్రామాణికం, ప్రాథమికం)
మార్చి 17, 2025: కంప్యూటర్ అప్లికేషన్స్, IT, AI
పరీక్ష తేదీ సమీపిస్తున్న కొద్దీ విద్యార్థులు తమ సన్నాహాలను ప్రారంభించాలి. సబ్జెక్టులపై దృష్టి పెట్టాలి. టైమ్‌టేబుల్‌కు సంబంధించిన అప్‌డేట్‌లు, ప్రకటనల కోసం CBSE వెబ్‌సైట్‌ను క్రమం తప్పకుండా చెక్ చేయాలి.