CBSE Compartment Admit Card 2024 : సీబీఎస్​ఈ సప్లిమెంటరీ పరీక్ష అడ్మిట్​ కార్డు విడుదల..-cbse compartment admit card 2024 out heres how to download ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Cbse Compartment Admit Card 2024 : సీబీఎస్​ఈ సప్లిమెంటరీ పరీక్ష అడ్మిట్​ కార్డు విడుదల..

CBSE Compartment Admit Card 2024 : సీబీఎస్​ఈ సప్లిమెంటరీ పరీక్ష అడ్మిట్​ కార్డు విడుదల..

Sharath Chitturi HT Telugu
Published Jul 06, 2024 09:38 AM IST

CBSE suplimentary Admit Card 2024 : సీబీఎస్​ఈ సప్లిమెంటరీ పరీక్ష అడ్మిట్​ కార్డు విడుదలైంది. ఇలా డౌన్​లోడ్​ చేసుకోండి..

సీబీఎస్​ఈ సప్లిమెంటరీ పరీక్ష అడ్మిట్​ కార్డును ఇలా డౌన్​లోడ్​ చేసుకోండి..
సీబీఎస్​ఈ సప్లిమెంటరీ పరీక్ష అడ్మిట్​ కార్డును ఇలా డౌన్​లోడ్​ చేసుకోండి..

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 10, 12 తరగతులకు సంబంధించిన సీబీఎస్ఈ కంపార్ట్మెంట్ అడ్మిట్ కార్డు 2024ను తాజాగా విడుదల చేసింది. సప్లిమెంటరీ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులందరూ cbse.gov.in సీబీఎస్ఈ అధికారిక వెబ్సైట్ ద్వారా అడ్మిట్ కార్డును చెక్ చేసి డౌన్​లోడ్​ చేసుకోవచ్చు.

సీబీఎస్ఈ 10, 12వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు 2024 జూలైలో జరగనున్నాయి. షెడ్యూల్ ప్రకారం 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్ష జూలై 15 నుంచి 22 వరకు, 12వ తరగతి సప్లిమెంటరీ పరీక్ష జూలై 15, 2024న జరుగుతాయి. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు రెండు తరగతులకు ఒకే షిఫ్టులో సీబీఎస్ఈ పరీక్షను నిర్వహిస్తుంది. ప్రశ్నాపత్రం చదవడానికి విద్యార్థులకు 15 నిమిషాల సమయం ఇస్తారు.

సీబీఎస్ఈ కంపార్ట్​మెంట్ అడ్మిట్ కార్డ్ 2024 డౌన్​లోడ్​ చేసుకోవడానికి డైరెక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ఇలా డౌన్​లోడ్​ చేసుకోండి..

సీబీఎస్​ఈ సప్లిమెంటరీ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులందరూ అధికారిక వెబ్సైట్ నుంచి అడ్మిట్ కార్డును డౌన్​లోడ్​ చేసుకోవడానికి ఈ క్రింది ప్రాసెస్​ని అనుసరించవచ్చు.

  • స్టెప్​ 1 :- cbse.gov.in సీబీఎస్ఈ అధికారిక వెబ్సై'ట్​ని సందర్శించండి.
  • స్టెప్​ 2:- హోమ్ పేజీలో ఉన్న లింక్​పై క్లిక్ చేయండి.
  • స్టెప్​ 3 :- కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ అభ్యర్థులకు కంటిన్యూ లింక్ వస్తుంది.
  • స్టెప్​ 4 :- దానిపై క్లిక్ చేస్తే కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
  • స్టెప్​ 5 :- ఇప్పుడు పాఠశాలలపై క్లిక్ చేయండి. తరువాత ఎగ్జామ్​ యాక్టివిటీస్​పై క్లిక్ చేయండి.
  • స్టెప్​ 6 :- సీబీఎస్ఈ కంపార్ట్​మెంట్ అడ్మిట్ కార్డు 2024 లింక్ అందుబాటులో ఉంటుంది.
  • స్టెప్​ 7 :- లింక్​పై క్లిక్ చేసి లాగిన్ వివరాలు ఎంటర్ చేయాలి.
  • స్టెప్​ 8:- మీ అడ్మిట్ కార్డు స్క్రీన్​పై కనిపిస్తుంది.
  • స్టెప్​ 9 :- అడ్మిట్ కార్డు చెక్ చేసుకుని పేజీని డౌన్​లోడ్ చేసుకోవాలి.
  • స్టెప్​ 10 :- తదుపరి అవసరాల కోసం దాని హార్డ్ కాపీని ఉంచండి.

ఈ ఏడాది 10, 12వ తరగతి ఫలితాలు 2024 మే 13న విడుదలయ్యాయి. పదో తరగతిలో 93.06 శాతం, 12వ తరగతిలో 87.98 శాతం ఉత్తీర్ణత నమోదైంది.

12వ తరగతిలో మొత్తం 1,62,1224 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 1,42,6420 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. పదో తరగతిలో మొత్తం 2251812 మంది విద్యార్థులు పరీక్షకు రిజిస్టర్ చేసుకోగా 2238827 హాజరయ్యారు. వీరిలో 2095467 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. మరిన్ని వివరాలకు అభ్యర్థులు సీబీఎస్ఈ అధికారిక వెబ్సైట్​ని చూడవచ్చు.

Whats_app_banner

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.