Major Reforms in CBSE exam system | సీబీఎస్సీ పరీక్షా విధానంలో భారీ మార్పులు
Major Reforms in CBSE exam system: 2024 నుంచి సీబీఎస్సీ పరీక్షా విధానంలో భారీ గుణాత్మక మార్పులకు సీబీఎస్సీ శ్రీకారం చుడుతోంది. పోటీ ప్రపంచంలో విద్యార్థులను సమర్ధవంతమైన పోటీదారులుగా, విజ్ఞానదాయకులుగా నిలిపే లక్ష్యంతో ఈ మార్పులు చేపట్టినట్లు CBSE కార్యదర్శి అనురాగ్ త్రిపాఠీ వివరించారు.
Major Reforms in CBSE exam system: ఇప్పటికే కొన్ని పాఠశాలల్లో ఈ మార్పుల్లో కొన్నింటిని స్వచ్చంధంగా అమలు చేస్తున్నారని, 2024 నుంచి అన్ని సీబీఎస్సీ పాఠశాలల్లో ఈ మార్పులు అమల్లోకి వస్తాయని CBSE Secretary Anurag Tripathy వివరించారు. వాటిలో ముఖ్యమైన ఐదు మార్పులను ఆయన ఇలా వివరించారు.
Major Reforms in CBSE exam system
1) 20% మార్క్స్ టు ఇంటర్నల్ అసెస్‌మెంట్
సంవత్సరం చివరలో పెట్టే మూడు గంటల పరీక్ష ద్వారా విద్యార్థి సామర్ధ్యాన్ని పూర్తిగా నిర్ధారించలేం. అదువల్ల విద్యార్థి సామర్ద్యాన్ని పరీక్షించే ప్రక్రియ సంవత్సరం అంతా కొనసాగాలి. అందుకు గానూ ఇంటర్నల్ ఎసెస్‌మెంట్ కు 20% మార్క్స్ ఉంటాయి. ప్రాక్టికల్ పరీక్షలు లేని సబ్జెక్టులకు కూడా ఇది వర్తిస్తుంది. ఈ అసెస్‌మెంట్‌ను టీచర్చ్, పేరెంట్స్, పీర్ గ్రూప్స్ చేస్తాయి. నూతన విద్యా విధానంలో ఈ సిఫారసు కూడా ఉంది. ఇందులో ప్రాజెక్ట్ వర్క్స్, ఇండస్ట్రీ విజిట్స్, స్పోర్ట్స్, సోషల్ వర్క్, ఆర్ట్స్ కూడా భాగంగా ఉంటాయి.
2) ప్రశ్నాపత్రంలో 33% ఎక్కువ ప్రశ్నలు ఉంటాయి.
ప్రశ్నాపత్రంలో ఇకపై 33% ఎక్కువ ప్రశ్నలుంటాయి. అంటే, విద్యార్థికి ఏ ప్రశ్నకు సమాధానం రాయాలన్న చాయిస్ ఎక్కువగా ఉంటుంది.
3) అనలిటికల్ స్కిల్స్, క్రిటికల్ థింకింగ్‌ను పరీక్షించే ప్రశ్నలు
ప్రశ్నాపత్రంలో విద్యార్థుల అనలిటికల్ స్కిల్స్, క్రిటికల్ థింకింగ్‌ను పరీక్షించేలా ప్రశ్నలు ఎక్కువగా ఉంటాయి. విద్యార్థిలోని నైపుణ్యాలను పరీక్షించే స్కిల్ బేస్డ్ ప్రశ్నలకు ప్రాధాన్యత ఇస్తారు. బట్టీ పట్టి జవాబు రాసే విధానం కాకుండా, హేతుబద్ధంగా, తర్కబద్ధంగా, సృజనాత్మకంగా ఆలోచించి జవాబు రాసేలా ప్రశ్నలుంటాయి. ఈ ప్రశ్నలకు జవాబులు ఏ పుస్తకంలోనూ ఉండవు. విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి విపరీతంగా ప్రాక్టీస్ చేస్తే తప్ప ఈ విధమైన ప్రశ్నలకు సమాధానాలు రాయలేరు.
4) 3, 5, 8వ తరగతుల విద్యార్థులకు అసెస్‌మెంట్ సర్వే
3వ తరగతి, 5వ తరగతి, 8వ తరగతి విద్యార్థులపై అసెస్‌మెంట్ సర్వే ఉంటుంది. విద్యార్థి నైపుణ్యాలను, నిర్మాణాత్మక తెలివితేటలను పరిశీలిస్తారు. వారిలో అభ్యసన లోపాలేవైనా ఉంటే.. గుర్తించి తదనుగుణంగా వారికి శిక్షణ ఇస్తారు. ఏ తరగతి విద్యార్థికి ఏ స్థాయి లో అభ్యసన సామర్ధ్యం ఉండాలనే విషయంలో కచ్చితమైన గణన విధానం లేదు. అసెస్‌మెంట్ సర్వే ద్వారా ఆ లోటు తీరుతుంది. ఈ విధానంలో 3, 5, 8 తరగతుల విద్యార్థులకు పరీక్షలు సాధారణ ప్రశ్న, జవాబు తరహాలో ఉండవు. ఈ అసెస్‌మెంట్ ఫలితాలను టీచర్లు విద్యార్థి తల్లిదండ్రులతో పంచుకుంటారు. తద్వారా విద్యార్థి ఓవరాల్ డెవలప్‌మెంట్‌లో తల్లిదండ్రులను కూడా భాగస్వామ్యులను చేస్తారు.
5) కొత్త తరహాలో ప్రొగ్రెస్ కార్డ్‌లు
విద్యార్థులకు ఇచ్చే ప్రోగ్రెస్ కార్డ్‌లు వినూత్నంగా ఉంటాయి. గతంలోలా సబ్జెక్ట్, పరీక్ష, వచ్చిన మార్క్స్ విధానంలో ఉండదు. విద్యార్థి సమగ్ర అభివృద్ధిని వివరించేలా 360 డిగ్రీ అసెస్‌మెంట్ కార్డ్‌లను ఇస్తారు. ఇప్పటికే ఈ విధానాన్ని పైలట్ ప్రాజెక్ట్‌గా కొన్ని స్కూల్‌లలో ప్రారంభించారు. ఈ విధానంలో విద్యార్థి లో చోటుచేసుకున్న అభివృద్ధిని టీచర్లు, పేరెంట్లు గుర్తించగలుగుతారు.