CBSE warns Schools: పాఠశాలలకు సీబీఎస్ఈ హెచ్చరిక-cbse asks schools not to start academic session before april ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Cbse Asks Schools Not To Start Academic Session Before April

CBSE warns Schools: పాఠశాలలకు సీబీఎస్ఈ హెచ్చరిక

HT Telugu Desk HT Telugu
Mar 18, 2023 10:39 AM IST

CBSE warns Schools: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (Central Board of Secondary Education CBSE) తన పరిధిలోకి వచ్చే పాఠశాలలకు స్పష్టమైన హెచ్చరిక జారీ చేసింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

CBSE warns Schools: ఈ విద్యా సంవత్సరంలో ముందే తరగతులను ప్రారంభిస్తున్న పాఠశాలలకు సీబీఎస్ఈ (CBSE) హెచ్చరికలు జారీ చేసింది. తాము జారీ చేసిన అకడమిక్ క్యాలండర్ ను కచ్చితంగా పాటించాలని, తరగతులను ఏప్రిల్ 1వ తేదీ కన్నా ముందు ప్రారంభించకూడదని స్పష్టం చేసింది. కొన్ని పాఠశాలలు పరీక్షలు పూర్తి కాగానే, వెంటనే పై తరుగతుల క్లాస్ లను ప్రారంభించినట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపింది. అకడమిక్ క్యాలండర్ ను ఫాలో కాకుండా, ముందే స్కూల్స్ ను ప్రారంభించడం వల్ల విద్యార్థులపై అనవసరంగా అదనపు ఒత్తిడి పడుతుందని CBSE తెలిపింది.

ట్రెండింగ్ వార్తలు

CBSE warns Schools: ఇతర యాక్టివిటీస్ కోసం..

ముందే తరగతులను ప్రారంభించడం వల్ల విద్యార్థులు ఇతర లైఫ్ స్కిల్స్ ను నేర్చుకునే అవకాశం లభించదని సీబీఎస్సీ (CBSE) పేర్కొంది. అకడమిక్స్ తో పాటు ఆరోగ్యం, ఫిజికల్ ఎడ్యుకేషన్, వర్క్ ఎడ్యుకేషన్, కమ్యూనిటీ సర్వీస్ వంటివి కూడా విద్యార్థి సర్వతోముఖ అభివృద్ధికి అత్యంత అవసరమని సీబీఎస్ఈ స్పష్టం చేసింది. సీబీఎస్ఈ (CBSE) గుర్తింపు పొందిన అన్ని పాఠశాలలు కచ్చితంగా సీబీఎస్ఈ (CBSE) నిబంధనావళిని పాటించాని, ఈ విషయాన్ని ఆయా పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు గుర్తించాలని స్పష్టం చేసింది.

IPL_Entry_Point

టాపిక్