Odisha train crash: ఒడిశా రైలు ప్రమాదంలో కుట్ర కోణం నిజమేనా?.. బాలాసోర్ జేఈ ఇంటిని సీల్ చేసిన సీబీఐ-cbi seals home of missing station engineer in odisha train crash probe ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
Telugu News  /  National International  /  Cbi Seals Home Of 'Missing' Station Engineer In Odisha Train Crash Probe

Odisha train crash: ఒడిశా రైలు ప్రమాదంలో కుట్ర కోణం నిజమేనా?.. బాలాసోర్ జేఈ ఇంటిని సీల్ చేసిన సీబీఐ

HT Telugu Desk HT Telugu
Jun 20, 2023 08:17 PM IST

Odisha train crash: సుమారు 280 మంది ప్రాణాలు పోవడానికి కారణమైన ఒడిశా రైలు ప్రమాదంపై సీబీఐ దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. రైలు ప్రమాదం జరిగిన సమయంలో బాలాసోర్ స్టేషన్ ఇంజినీర్ గా ఉన్న వ్యక్తి ఇంటిని సీబీఐ అధికారులు సీల్ చేశారు.

రైలు ప్రమాద దృశ్యం
రైలు ప్రమాద దృశ్యం

Odisha train crash: సుమారు 280 మంది ప్రాణాలు పోవడానికి కారణమైన ఒడిశా రైలు ప్రమాదంపై సీబీఐ దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. రైలు ప్రమాదం జరిగిన సమయంలో బాలాసోర్ స్టేషన్ ఇంజినీర్ గా ఉన్న వ్యక్తి ఇంటిని సీబీఐ అధికారులు సీల్ చేశారు.

ట్రెండింగ్ వార్తలు

ఆ ఇంజినీర్ కనిపించడం లేదు..

సిగ్నలింగ్ వ్యవస్థలో కావాలనే మార్పులు చేశారని, రైలు ప్రమాదం వెనుక కుట్ర కోణం ఉందని వస్తున్న వార్తలకు బలం చేకూరుస్తూ.. రైలు ప్రమాద ఘటన జరిగిన ప్రాంత సిగ్నలింగ్ వ్యవస్థ కు బాధ్యుడిగా ఉన్న జూనియర్ ఇంజినీర్ ఉంటున్న బాలాసోర్ లోని ఇంటిని సీబీఐ సీల్ చేసింది. అయితే, ప్రమాదం జరిగిన నాటి నుంచి, ఆ ఇంజినీర్ అతడి కుటుంబ సభ్యులు కనిపించడం లేదు. మరోవైపు, ‘‘రైలు ప్రమాదంపై దర్యాప్తులో భాగం గా ఉన్న ఏ రైల్వే ఉద్యోగి కూడా పరారీలో లేరు’’ అని రైల్వే శాఖ అధికార ప్రతినిధి ఒక ప్రకటన చేశారు.

ఇల్లు సీల్

దర్యాప్తు ప్రాథమిక దశలో ఉన్న సమయంలో ఆ జూనియర్ ఇంజినీర్ ను సీబీఐ ప్రశ్నించింది. అనంతరం, ఈ జూన్ 16న అతడి ఇంటికి వెళ్లింది. ఆ సమయంలో అతడు కానీ, అతడి కుటుంబ సభ్యులు కానీ ఆ ఇంటిలో లేరు. సీబీఐ అధికారులు ఆ ఇంటిని సీల్ చేశారు. రైళ్ల రాకపోకల విషయంలో, అవి సురక్షితంగా ప్రయాణించడానికి రైల్వేలో సిగ్నల్ జూనియర్ ఇంజినీర్ పాత్ర చాలా కీలకం. సిగ్నల్స్, ట్రాక్ సర్క్యూట్స్, పాయింట్ మెషీన్స్, ఇంటర్ లాకింగ్ సిస్టమ్స్.. ఇవన్నీ సిగ్నల్ జూనియర్ ఇంజినీర్ పరిధిలోనే ఉంటాయి.

292 మంది మృతి

ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జూన్ 2న జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 292 మంది ప్రాణాలు కోల్పోయారు. బహనాగ రైల్వే స్టేషన్ సమీపంలో ఆగి ఉన్న గూడ్స్ రైలు ను కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ఢీ కొని పట్టాలు తప్పడం, అదే సమయంలో ఎదురుగా వస్తున్న యశ్వంతపూర్ ఎక్స్ ప్రెస్ బోగీలు ఈ కోరమాండల్ బోగీలను ఢీ కొని.. అవి కూడా పట్టాలు తప్పడంతో.. ప్రమాద తీవ్రత బాగా పెరిగింది.

WhatsApp channel