Arvind Kejriwal: “సీబీఐ అధికారులు నాతో అలా చెప్పారు!”: సిసోడియా అరెస్టుపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్-cbi officers were against manish sisodia arrest delhi cm arvind kejriwal claims ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Arvind Kejriwal: “సీబీఐ అధికారులు నాతో అలా చెప్పారు!”: సిసోడియా అరెస్టుపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్

Arvind Kejriwal: “సీబీఐ అధికారులు నాతో అలా చెప్పారు!”: సిసోడియా అరెస్టుపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్

Chatakonda Krishna Prakash HT Telugu
Feb 27, 2023 02:43 PM IST

Arvind Kejriwal on Manish Sisodia Arrest: మనీశ్ సిసోడియాను ఎందుకు అరెస్టు చేయాల్సి వచ్చిందో సీబీఐ అధికారులు తనకు చెప్పారని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ఇష్టం లేకున్నా సీబీఐ అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారని అన్నారు.

Arvind Kejriwal: “సీబీఐ అధికారులు నాతో అలా చెప్పారు!”: సిసోడియా అరెస్టుపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్
Arvind Kejriwal: “సీబీఐ అధికారులు నాతో అలా చెప్పారు!”: సిసోడియా అరెస్టుపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ (HT_PRINT)

Arvind Kejriwal on Manish Sisodia Arrest: ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసు (Delhi Liquor Policy scam case )లో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్ఆద్మీ నేత మనీశ్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేయడం రాజకీయ దుమారాన్ని రేపుతోంది. ఢిల్లీలో ప్రభుత్వంలో ఉన్న ఆమ్ఆద్మీ పార్టీ (Aam Aadmi Party - AAP), కేంద్ర అధికార పార్టీ బీజేపీ (BJP) మధ్య ఈ విషయంలో యుద్ధమే జరుగుతోంది. బీజేపీపై విమర్శలు చేస్తున్నారు ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్. ఆదివారం సిసోడియా అరెస్ట్ అయ్యాక కూడా డర్టీ పాలిటిక్స్‌లో భాగమే ఈ చర్య అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే నేడు (ఫిబ్రవరి 27) కేజ్రీవాల్ చేసిన ఓ ట్వీట్ ఆసక్తికరంగా మారింది. సీబీఐ అధికారులు తనతో చెప్పారంటూ ఓ ట్వీట్‍ను కేజ్రీవాల్ పోస్ట్ చేశారు. సిసోడియాను ఎందుకు అరెస్ట్ చేశారో తనకు సీబీఐ అధికారులు చెప్పారని అందులో ఆయన పేర్కొన్నారు. వివరాలివే..

సిసోడియాపై సీబీఐ అధికారులకు గౌరవం

Arvind Kejriwal on Manish Sisodia Arrest: రాజకీయ ఒత్తిళ్ల వల్లే మనీశ్ సిసోడియాను అరెస్ట్ చేయాల్సి వచ్చిందని సీబీఐ అధికారులు తనతో అన్నారని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. “సిసోడియా అరెస్టుకు తాము వ్యతిరేకం అని ఎక్కువ మంది సీబీఐ అధికారులు నాకు చెప్పారు. సిసోడియాపై వారికి చాలా గౌరవం ఉంది. ఆయనకు వ్యతిరేకంగా ఏ ఆధారాలు లేవు. అయితే సిసోడియాను అరెస్ట్ చేయాలనే రాజకీయ ఒత్తిళ్లు అధికంగా ఉన్నాయి. వారు (సీబీఐ అధికారులు) రాజకీయ మాస్టర్స్ ఒత్తిళ్లకు తలొగ్గాల్సి వచ్చింది” అని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. సిసోడియా తప్పు చేసినట్టు ఎలాంటి ఆధారాలు లేకపోయినా.. రాజకీయ ఒత్తిళ్ల వల్లే ఆయనను అరెస్ట్ చేశామని కొందరు సీబీఐ అధికారులు తనతో చెప్పారని కేజ్రీవాల్ పేర్కొన్నారు.

Manish Sisodia Arrest: ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పన, అమలులో జరిగిన అవినీతిలో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియాకు సంబంధం ఉందనే ఆరోపణలతో సీబీఐ ఆయనను అరెస్ట్ చేసింది. ఆదివారం 8 గంటల పాటు ఆయనను విచారించిన సీబీఐ అధికారులు.. ఆ తర్వాత అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే ఈ కేసులో ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్ సహా మరికొన్ని అరెస్టులు జరిగాయి.

Manish Sisodia Arrest: కాగా, ఆదివారం సీబీఐ కార్యాలయానికి ఆమ్ఆద్మీ పార్టీ నేతలు, కార్యకర్తలతో రోడ్‍షోగా వెళ్లారు మనీశ్ సిసోడియా. తాను అరెస్టు అవుతానంటూ కార్యాలయానికి వెళ్లక ముందు ఆయన చెప్పారు. ట్వీట్ కూడా చేశారు. తాను కొన్ని నెలలు జైలు ఉండాల్సి వస్తుందని, తాను అందుకు భయపడబోనని స్పష్టం చేశారు.

Whats_app_banner

సంబంధిత కథనం