కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) బుధవారం ఛత్తీస్‌గఢ్‌లోని అనేక ప్రాంతాలలో, ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ నివాసంలో సోదాలు నిర్వహించిందని అధికారులు తెలిపారు.
సీబీఐ బృందాలు రాయ్‌పూర్, భిలాయిలోని భూపేష్ బఘేల్ నివాసానికి, ఆయన సన్నిహితుని నివాసానికి, అలాగే ఒక ఉన్నతాధికారి నివాసానికి చేరుకున్నాయని పీటీఐ వార్తా సంస్థ తెలిపింది. అయితే ఈ సోదాలు ఏ కేసులో జరుగుతున్నాయో సీబీఐ ఇంకా వెల్లడించలేదు.
కాగా మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఏప్రిల్ 8, 9 తేదీల్లో జరగనున్న ఏఐసీసీ సమావేశం కోసం ఏర్పాటు చేసిన “డ్రాఫ్టింగ్ కమిటీ” సమావేశానికి ఈ రోజు ఢిల్లీ వెళ్లనున్నారు.
అంతకు ముందుగానే సీబీఐ రాయ్‌పూర్ మరియు భిలాయి నివాసాలకు చేరుకుంది. ఇటీవలే మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టోరేట్ భూపేష్ బఘేల్ నివాసంలో సోదాలు నిర్వహించింది.
(మరిన్ని వివరాలు రావాల్సి ఉంది.)
టాపిక్