మమతకు షాక్​.. మరో టీఎంసీ నేత అరెస్ట్​-cbi arrests mamata banerjee s aide anubrata mondal in cattle smuggling case ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Cbi Arrests Mamata Banerjee's Aide Anubrata Mondal In Cattle Smuggling Case

మమతకు షాక్​.. మరో టీఎంసీ నేత అరెస్ట్​

Sharath Chitturi HT Telugu
Aug 11, 2022 11:32 AM IST

Anubrata Mondal arrested : టీఎంసీ నేత, మమత బెనర్జీకి సన్నిహితుడిగా గుర్తింపు ఉన్న అనుబ్రత మోండల్​ను సీబీఐ అరెస్ట్​ చేసింది. పశువుల అక్రమ రవాణా కేసులో భాగంగా ఈ చర్యలు చేపట్టింది.

అనుబ్రత మోండల్​
అనుబ్రత మోండల్​ (Saikat Paul)

Anubrata Mondal arrested : పార్థా ఛటర్జీ వ్యవహారంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న టీఎంసీకి మరో షాక్​ తగిలింది. టీఎంసీ కీలక నేత, సీఎం మమతా బెనర్జీకి సన్నిహితుడిగా గుర్తింపు ఉన్న అనుబ్రత మోండల్​ను సీబీఐ.. గురువారం ఉదయం అరెస్ట్​ చేసింది. 2020 పశువుల అక్రమ రవాణా కేసులో భాగంగా.. కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ ఈ చర్యలు చేపట్టింది.

ట్రెండింగ్ వార్తలు

అనుబ్రత మోండల్​.. ప్రస్తుతం టీఎంసీ బీర్భూమ్​ జిల్లా అధ్యక్షుడి పదవిలో ఉన్నారు.

కాగా.. 2015-2017 మధ్యకాలంలో ఈ పశువుల అక్రమ రవాణా జరిగిందని సీబీఐ ఆరోపిస్తోంది. పశువుల తలలను అక్రమంగా బార్డర్​ని దాటిస్తుండగా.. బీఎస్​ఎఫ్​ దళాలు వాటిని అడ్డుకున్నట్టు చెబుతోంది.ఈ మేరకు 2020లో ఎఫ్​ఐఆర్​ నమోదు చేసింది. అనేక ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. అప్పుడే.. ఈ వ్యవహారంలో అనుబ్రత మోండల్​ పేరు బయటకొచ్చింది. రెండుసార్లు ఆయన్ని విచారించింది కూడా.

పశువుల అక్రమ రవాణా కేసులో మరోమారు విచారణ కోసం హాజరుకావాలని ఈ నెలలో అనుబ్రత మోండల్​కు పిలుపునిచ్చింది సీబీఐ. కానీ ఆయన మూడుసార్లూ సీబీఐ వద్దకు వెళ్లలేదు. ఈ క్రమంలోనే గురువారం ఉదయం.. బీర్భూమ్​లోని మోండల్​ నివాసానికి వెళ్లిన సీబీఐ అధికారులు.. ఆయన్ని అరెస్ట్​ చేశారు. అనంతరం అక్కడి నుంచి వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు.

అనుబ్రత మోండల్​ బాడీగార్డు.. సైగల్​ హొస్సేన్​ని కూడా సీబీఐ అరెస్ట్​ చేసినట్టు తెలుస్తోంది.

నెల రోజుల్లో ఇద్దరు..

Partha Chatterjee : ఓ టీఎంసీ నేత అరెస్ట్​ కావడం.. నెల రోజుల్లో ఇది రెండోసారి. ఉపాధ్యాయుల నియామకాలకు సంబంధించిన అవినీతుల కేసులో భాగంగా.. మాజీ మంత్రి, మమతా బెనర్జీ సన్నిహితుడు పార్థా ఛటర్జీని ఈడీ అధికారులు అరెస్ట్​ చేశారు. ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉన్న అర్పితా ముఖర్జీని సైతం అరెస్ట్​ చేశారు. అనంతరం ఈడీ నిర్వహించిన దాడుల్లో.. రూ. 50కోట్లకుపైగా నగదు, భారీగా విలువ చేసే ఆభరణాలు బయటపడిన విషయం తెలిసిందే.

WhatsApp channel

సంబంధిత కథనం