CAT 2024 notification : క్యాట్ నోటిఫికేషన్ విడుదల- రిజిస్ట్రేషన్లు ఎప్పటి నుంచి అంటే..
CAT 2024 registration date : క్యాట్ 2024 నోటిఫికేషన్ విడుదలైంది. ఆగస్టు 1 నుంచి రిజిస్ట్రేషన్ త్వరలోనే iimcat.ac.in తేదీన నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.
కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్) 2024 నోటిఫికేషన్ తాజాగా విడుదలైంది. నవంబర్ 24న మూడు షిఫ్టుల్లో జరుగుతుందని, ఆగస్టు 1 నుంచి పరీక్షకు రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) కోల్కతా ప్రకటించింది.
ఈ దఫా క్యాట్ పరీక్షను ఐఐఎం కోల్కతా నిర్వహించనుంది. పూర్తిస్థాయి నోటిఫికేషన్ని త్వరలోనే iimcat.ac.in లో విడుదల చేయనున్నట్టు ఐఐఎంసీ కోల్కతా వెల్లడించింది.
ఐఐఎం క్యాట్ 2024: ముఖ్యమైన తేదీలు..
- షెడ్యూల్ ప్రకారం, క్యాట్ 2024 రిజిస్ట్రేషన్ విండో ఆగస్టు 1 (ఉదయం 10) నుంచి సెప్టెంబర్ 13 (సాయంత్రం 5 గంటలు) వరకు ఓపెన్ చేసి ఉంటుంది.
- అడ్మిట్ కార్డులను నవంబర్ 5న జారీ చేసి, నవంబర్ 24న పరీక్ష నిర్వహిస్తారు.
- క్యాట్ 2024 ఫలితాలను జనవరి రెండో వారంలో ప్రకటిస్తారు.
ఇదీ చూడండి:- RBI Officers Recruitment 2024: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్
క్యాట్ 2024 అర్హత ప్రమాణాలు..
క్యాట్ 2024 వివరణాత్మక నోటిఫికేషన్ పరీక్షకు అర్హత ప్రమాణాలను తెలియజేస్తుంది. కాగా గత ఏడాది సమాచారం ప్రకారం అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమాన సీజీపీఏ (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 45 శాతం) ఉత్తీర్ణులై ఉండాలి.
డిగ్రీ చివరి సంవత్సరానికి హాజరవుతున్న అభ్యర్థులు, డిగ్రీ అర్హతలు పూర్తి చేసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న వారు కూడా పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు.
2024 దరఖాస్తు ఫీజు..
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.1,250. మిగతా వారికి దరఖాస్తు ఫీజు రూ.2,500.
ఈ ఏడాది 170 నగరాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని, అభ్యర్థులు దరఖాస్తులో తమ ప్రాధాన్యతను బట్టి ఐదు నగరాలను ఎంచుకునే అవకాశం ఉంటుందని ఐఐఎం కోల్కతా తెలిపింది.
ఇదీ చూడండి:- LIC HFL Recruitment 2024: ఎల్ఐసీ హౌజింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ లో రిక్రూట్మెంట్; అర్హత డిగ్రీ మాత్రమే..
ఐఐఎంలు అందించే పోస్ట్ గ్రాడ్యుయేట్, ఫెలో/డాక్టరేట్ స్థాయి బిజినెస్ కోర్సుల్లో ప్రవేశం కోసం జాతీయ స్థాయిలో క్యాట్ పరీక్షను నిర్వహిస్తారు. ఈ పరీక్షను పలు నాన్- ఐఐఎం సంస్థలు సైతం తమ అడ్మిషన్ ప్రక్రియల్లో ఉపయోగిస్తాయి. అందుకే ఈ పరీక్షకు చాలా ప్రాధాన్యత ఇస్తుంటారు.
పూర్తి నోటిఫికేషన్, అర్హత ప్రమాణాలు, పరీక్ష సరళి, ఇతర వివరాలను త్వరలో క్యాట్ 2024 వెబ్సైట్లో అప్లోడ్ చేయనున్నారు.
12వ తరగతి పాసైతే ప్రభుత్వ ఉద్యోగం..
స్టెనో గ్రేడ్ సీ, డీ పరీక్ష 2024 కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) ప్రారంభించింది. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ ‘సీ’, 'డీ' ఎగ్జామినేషన్ 2024 కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ssc.gov.in ఎస్ఎస్సీ అధికారిక వెబ్సైట్ ద్వారా డైరెక్ట్ లింక్ని పొందవచ్చు. అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు లేదా విశ్వవిద్యాలయం నుంచి 12వ తరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. ఎంపిక విధానంలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం