Case against Rahul Gandhi over use of KGF-2 songs: రాహుల్ గాంధీపై కాపీ రైట్ కేసు-case against rahul gandhi others over use of kgf 2 songs in bharat jodo yatra video ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Case Against Rahul Gandhi, Others Over Use Of Kgf-2 Songs In Bharat Jodo Yatra Video

Case against Rahul Gandhi over use of KGF-2 songs: రాహుల్ గాంధీపై కాపీ రైట్ కేసు

HT Telugu Desk HT Telugu
Nov 04, 2022 10:55 PM IST

Case against Rahul Gandhi over use of KGF-2 songs: కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రస్తుతం దేశవ్యాప్తంగా ‘భారత్ జోడో యాత్ర’ చేస్తున్న రాహుల్ గాంధీపై కాపీ రైట్ చట్టం కింద కేసు నమోదైంది.

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో ఒక దృశ్యం
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో ఒక దృశ్యం (Congress Twitter)

Case against Rahul Gandhi over use of KGF-2 songs: భారత్ జోడో యాత్ర సందర్భంగా రూపొందించిన వీడియోలో తమ సంస్థకు హక్కులున్న KGF 2 సినిమా పాటలను వాడుకున్నారని ఆరోపిస్తూ బెంగళూరుకు చెందిన ఒక సంస్థ రాహుల్ గాంధీపై కేసు పెట్టింది. రాహుల్ తో పాటు కాంగ్రెస్ నేతలు జైరాం రమేశ్, సుప్రియ శ్రీనాటెలపై కూడా కేసు పెట్టింది.

ట్రెండింగ్ వార్తలు

Case against Rahul Gandhi over use of KGF-2 songs: ‘భారత్ జోడో యాత్ర’

రాహుల్ గాంధీ చేపట్టిన దేశవ్యాప్త పాదయాత్ర ‘భారత్ జోడో యాత్ర’కు విశేష స్పందన లభిస్తోంది. రోజుకు దాదాపు 25 కిమీల చొప్పున ఇప్పటికే ఆయన 1500 కిమీలు పాదయాత్ర చేశారు. తమిళనాడు, కేరళ, కర్నాటక, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణల్లో ఆయన యాత్ర కొనసాగింది.

Case against Rahul Gandhi over use of KGF-2 songs: KGF 2 పాటలు..

అయితే, ఆ యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ పాదయాత్ర దృశ్యాలకు బ్యాక్ గ్రౌండ్ గా KGF 2 హిందీ సినిమా పాటలు, సంగీతాన్ని వాడుకున్నారు. దీనిపై ఆ సినిమ మ్యూజిక్ హక్కులను సొంతం చేసుకున్న MRT Music అనే సంస్థ రాహుల్ గాంధీ తదితరులపై కాపీ రైట్ ఉల్లంఘన ఆరోపణలపై కేసు పెట్టింది. KGF 2 హక్కుల కోసం పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేశామని MRT Music తెలిపింది. భారత్ జోడో యాత్ర కోసం తమ అనుమతి లేకుండానే KGF 2 పాటలను కాంగ్రెస్ పార్టీ వాడుకుందని సంస్థ ఆరోపించింది. Bharat Jodo Yatra ప్రచారం కోసం రూపొందించిన వీడియోలకు తమ అనుమతి లేకుండా KGF 2 Hindi పాటలను వాడుకోవడం కాపీరైట్ ఉల్లంఘనేనని స్పష్టం చేసింది.

Case against Rahul Gandhi over use of KGF-2 songs: ఈ సెక్షన్ల కింద కేసు

ఈ ఫిర్యాదుతో కాంగ్రెస్ పార్టీతో పాటు రాహుల్ గాంధీ, జైరాం రమేశ్, సుప్రియలపై ఐపీసీ(IPC)లోని 403, 465, 120,34 సెక్షన్లు, ఐటీ యాక్ట్(Information Technology Act, 2000)లోని సెక్షన్ 66, కాపీరైట్ యాక్ట్(Copyrights Act, 1957)లోని 63 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

IPL_Entry_Point