Vacancies in Railway : నిరుద్యోగులకు గుడ్​ న్యూస్​.. రైల్వేలో ఇక వరుసగా జాబ్ నోటిఫికేషన్స్​!-careers news railway to bring vacancies on regular basis says east central railway gm ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Vacancies In Railway : నిరుద్యోగులకు గుడ్​ న్యూస్​.. రైల్వేలో ఇక వరుసగా జాబ్ నోటిఫికేషన్స్​!

Vacancies in Railway : నిరుద్యోగులకు గుడ్​ న్యూస్​.. రైల్వేలో ఇక వరుసగా జాబ్ నోటిఫికేషన్స్​!

Sharath Chitturi HT Telugu
Jan 28, 2024 04:30 PM IST

Railway vacancies 2024 : ఇక నుంచి ప్రతియేటా రైల్వే వేకేన్సీలను భర్తీ చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాదిలో వేకెన్సీల భర్తీ ప్రక్రియ ఇప్పటికే మొదలైందని చెబుతున్నారు.

నిరుద్యోగులకు గుడ్​ న్యూస్​.. రైల్వేలో ఇక వరుసగా జాబ్ నోటిఫికేషన్స్​!
నిరుద్యోగులకు గుడ్​ న్యూస్​.. రైల్వేలో ఇక వరుసగా జాబ్ నోటిఫికేషన్స్​!

Railway recruitment 2024 : నిరుద్యోగలకు గుడ్​ న్యూస్​ చెప్పింది ఈస్ట్​ సెంట్రల్​ రైల్వే. ఇక నుంచి ప్రతి ఏడాది.. రెగ్యులర్​గా ఉద్యోగ అవకాశాలను కల్పిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు.. ఆ విభాగ జీఎం అనిల్​ కుమార్​ ఖండేల్వాల్​ వెలిపారు. గతేడాది చేపట్టిన 1,50,000 పోస్టుల భర్తీ ప్రక్రియ విజయవంతంగా ముగిసిందని వివరించారు.

"కొత్త రిక్రూట్​మెంట్​ ప్రక్రియను రైల్వే మొదలుపెట్టింది. ఫలితంగా.. రెగ్యులర్​గా, ప్రతి ఏడాది వేకెన్సీలు పుట్టుకొస్తాయి. రైల్వేలో ఇన్​ఫ్రాస్ట్రక్చర్​, ఆపరేషన్స్​ పెరుగుతున్నాయి. అనేక కేటగిరీల్లో.. ప్రతియేటా వేకెన్సీలను భర్తీ చేస్తాము. ఈ జనవరి 20న.. 5వేలకుపైగా అసిస్టెంట్​ లోకో పైలట్​ రిక్రూట్​మెంట్​ ప్రక్రియ మొదలైంది. ఇలాంటి రైల్వే రిక్రూట్​మెంట్​ ప్రక్రియలో పాల్గొనేందుకు ప్రజలకు అవకాశాలు వస్తాయి," అని ఖండేల్వాల్​ అన్నారు.

ఒకసారి అప్లై చేసి, రిక్రూట్​మెంట్​ ప్రక్రియ ద్వారా ఎంపిక అవ్వకపోయినా బాధ పడాల్సిన అవసరం లేదని, మరుసటి ఏడాది కూడా దరఖాస్తు చేసుకుని మళ్లీ ఉద్యోగం కోసం ప్రయత్నించవచ్చని అన్నారు ఖండేల్వాల్​.

railway recruitment 2024 apply online : "గతంలో రైల్వే రిక్రూట్​మెంట్​ ప్రక్రియ 3-4ఏళ్లకు ఓసారి జరిగేది. కానీ.. ఇక నుంచి ప్రతియేటా.. వేకెన్సీలను రైల్వే భర్తీ చేస్తుంది. లోకో పైలట్స్​ నియామకానికి సంబంధించిన నోటిఫికేషన్​ ఇప్పటికే బయటకు వచ్చింది. రానున్న రోజుల్లో మరిన్ని అవకాశాలు వస్తాయి. నిరుద్యోగులకు మంచి మంచి అవకాశాలు లభిస్తాయి," అని ఖండేల్వాల్​ తెలిపారు.

భారతీయ రైల్వేలో పోస్టులు..

నార్త్ వెస్ట్రన్ రైల్వేలో 1646 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్ట్​లకు కావాల్సిన కనీస విద్యార్హత 10వ తరగతి మాత్రమే. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల కోసం అప్లికేషన్​ ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. నార్త్ వెస్ట్రన్ రైల్వే అధికారిక వెబ్ సైట్ rrcjaipur.in ద్వారా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఫిబ్రవరి 10 వ తేదీ.

Railway vacancies 2024 : అర్హత వివరాలు:- గుర్తింపు పొందిన బోర్డు నుంచి కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతి లేదా తత్సమాన (10+2 పరీక్షా విధానంలో) ఉత్తీర్ణతతో పాటు నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ (ఎన్ సీవీటీ) / స్టేట్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ (ఎస్సీవీటీ) జారీ చేసిన నోటిఫైడ్ ట్రేడ్ లో నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. అభ్యర్థుల వయసు 15 ఏళ్ల నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. గరిష్ట వయోపరిమితిలో ఎస్సీ, ఎస్టీ కేటగిరీల వారికి 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు సడలింపు ఉంటుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Whats_app_banner

సంబంధిత కథనం