`కేన్సర్ ట్యూమర్ మటుమాయం` - మ్యాజిక్ డ్రగ్ మహత్యం
కేన్సర్ రోగులకు అద్భుతమైన శుభవార్త ఇది. ఒక అద్భుతమైన ఔషధాన్ని వైద్య పరిశోధకులు కనుగొన్నారు. ఈ డ్రగ్‌తో కేన్సర్ ట్యూమర్ మటుమాయమవుతోంది. ప్రస్తుతం ఇది ట్రయల్స్ స్థాయిలో ఉంది.
చరిత్రలోనే తొలిసారి ఇది జరిగింది. ట్రయల్స్ పాల్గొన్న కేన్సర్ పేషెంట్ల అందరి ట్యూమర్లు నయమైపోయాయి. సాధారణంగా డ్రగ్ ట్రయల్స్‌లో 50% నుంచి 60% సక్సెస్ రేట్‌నే గొప్ప విజయంగా భావిస్తుంటారు. కానీ ఈ కేన్సర్ డ్రగ్ సక్సెస్ రేటు 100 శాతం ఉండడం విశేషం.
18 మందిపై ప్రయోగం
రెక్టల్ లేదా కొలొన్(మలద్వార) కేన్సర్ తో బాధపడుతున్న 18 మందిపై ఈ డ్రగ్‌ను ప్రయోగించారు. డొస్టార్లిమాబ్ (dostarlimab) అనే ఈ ఔషధాన్ని ప్రయోగాత్మకంగా ఈ 18 మంది కేన్సర్ పేషెంట్లపై వాడారు. ప్రతీ మూడు వారాలకు ఒకసారి ,ఆరు నెలల పాటు క్రమం తప్పకుండా ఈ ఔషధాన్ని ఇస్తూ, ఫలితాలను సమీక్షించారు. ఆశ్చర్యకరంగా, ఆరు నెలల తరువాత మొత్తం ఆ 18 మంది పేషెంట్లలోనూ కేన్సర్ ట్యూమర్ మటుమాయమైంది. కేన్సర్ పూర్తిగా నయమైంది. దాంతో, ప్రతీ పేషెంట్‌పై ఇలాంటి సానుకూల ఫలితం రావడం చరిత్రలో ఇదే తొలిసారి అని పరిశోధకులు చెబుతున్నారు. అయితే, ఈ ఔషధం పనితీరును ఇంకా పరీక్షించాల్సి ఉంది. అలాగే, ఎక్కువ మందిపై ప్రయోగించాల్సి ఉంది. 18 మంది పేషెంట్లపై సానుకూల ఫలితం రాబట్టడం అద్బుతమే కానీ, అది చాలా చిన్న శాంపిల్ అని వైద్య నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.
డొస్టార్లిమాబ్(dostarlimab)..
డొస్టార్లిమాబ్(dostarlimab) ఔషధం మానవ శరీరంలోని యాంటీబాడీల తరహాలో పనిచేస్తుంది. ఈ ఔషధం తీసుకున్న 18మంది పేషెంట్లలో కేన్సర్ ట్యూమర్ పూర్తిగా, ఎలాంటి ఆనవాళ్లు లేకుండా, కనిపించకుండా పోయింది. సాధారణ ఫిజికల్ పరీక్షలోనే కాకుండా, ఎండోస్కోపీ, పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ(పీఈటీ) స్కాన్, ఎంఆర్ఐ స్కాన్‌ల్లో కూడా ఎలాంటి కేన్సర్ ఆనవాళ్లు లభించలేదు. కేన్సర్ చికిత్స చరిత్రలోనే ఇలా జరగడం తొలి సారి అని అమెరికాలోని న్యూయార్క్‌లో ఉన్న స్లొవన్ కెటెరింగ్ కేన్సర్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ లూయీస్ ఏ డియాజ్ వ్యాఖ్యానించారు.
అంతకుముందు కీమోథెరపీ..
ఆ ఔషధం తీసుకున్న ఆ 18 మంది పేషెంట్లు కూడా అంతకుముందు, రెగ్యులర్ కేన్సర్ థెరపీ తీసుకున్నారు. కీమోథెరపీ, రేడియేషన్, సర్జరీ తదితర చికిత్సలు పొందారు. చివరకు, అనుకోకుండా, ఈ ప్రయోగాత్మక ఔషధం దయతో కేన్సర్ నుంచి పూర్తిగా విముక్తి పొందడంతో ఆ 18మంది సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.
టాపిక్