Crocodiles kill man : వృద్ధుడిపై 40 మొసళ్లు అటాక్​.. చెయ్యి కొరికి మింగేసి!-cambodian killed by 40 crocodiles after falling in enclosure
Telugu News  /  National International  /  Cambodian Killed By 40 Crocodiles After Falling In Enclosure
వృద్ధుడిపై 40 మొసళ్లు అటాక్​.. చెయ్యి కొరికి మింగేసి!
వృద్ధుడిపై 40 మొసళ్లు అటాక్​.. చెయ్యి కొరికి మింగేసి! (AFP)

Crocodiles kill man : వృద్ధుడిపై 40 మొసళ్లు అటాక్​.. చెయ్యి కొరికి మింగేసి!

26 May 2023, 17:10 ISTSharath Chitturi
26 May 2023, 17:10 IST

Crocodiles kill man : కంబోడియాలో ఓ వృద్ధుడిపై 40 మొసళ్లు దాడి చేశాయి! ఈ ఘటనలో ఆయన మరణించాడు.

Crocodiles kill man : కంబోడియాలో ఒళ్లుగగుర్పొడిచే ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ 72ఏళ్ల వ్యక్తిపై 40మొసళ్లు ఏకకాలంలో దాడి చేశాయి! ఆయన చెయ్యి కొరికి, మింగేశాయి. ఈ ఘటనలో ఆ వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు.

ఇదీ జరిగింది..

కంబోడియా రాజధాని నమ్​ పెన్​కు సమీపంలోని ఓ గ్రామంలో.. ఓ కుటుంబం వద్ద రెప్టైల్​ ఫామ్​ ఉంది. అందులో అనేక మొసళ్లు ఉన్నాయి. కాగా.. శుక్రవారం ఓ 72ఏళ్ల వ్యక్తి ఆ ఇంటికి వెళ్లాడు. ఒక కేజ్​లో మొసలి గుడ్లు ఉండటాన్ని గమించాడు. అదే సమయంలో కేజ్​లోకి మరో మొసలి వెళుతుండటాన్ని చూశాడు. కర్రతో దానిని తరిమేయాలని భావించాడు. కానీ ఆ మొసలి ఆ కర్ర పట్టుకుని లాగేయడంతో ఆయన కిందకి పడిపోయాడు. అది గమనించిన మొసళ్లు.. ఆయనపై దాడి చేశాయి. దాదాపు 40 మొసళ్ల దాడిలో ఆయన ప్రాణాలు కోల్పోయాడు.

Crocodiles kill man in Cambodia : ముందుగా.. మొసళ్లు ఆయనపై కూర్చున్నాయి. అనంతరం ఆయన శరీరాన్ని ముక్కలుముక్కలుగా చేశాయి. ఫలితంగా ఆ ప్రాంతమంతా రక్తంతో నిండిపోయింది. చివరికి.. ఆయన చెయ్యిని కొరికి మింగేశాయి.

ఇదీ చూడండి:- బాలుడిని మింగేసిన మొసలి.. నదిలో స్నానం చేస్తుండగా..

ఈ ఘటనతో స్థానిక కుటుంబం షాక్​కు గురైంది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలానికి చేరుకున్నారు. 72ఏళ్ల వృద్ధుడి మృతదేహాన్ని బయటకు తీశారు.

5ఏళ్ల చిన్నారి..!

Cambodia man killed by crocodiles : ఈ గ్రామంలోని ప్రజలకు మొసళ్లను పెంచుకునే అలవాటు ఉన్నట్టు కనిపిస్తోంది. ఈ గ్రామంలో అనేక మొసళ్ల ఫామ్​లు ఉన్నాయి. వాటి గుడ్లు, చర్మంతో పాటు చిన్న మొసళ్లను ట్రేడ్​ చేసేందుకు ఈ ఫామ్​లు ఏర్పాటు చేసుకున్నట్టు తెలుస్తోంది.

కాగా.. 2019లో ఈ రెండేళ్ల చిన్నారిని మొసళ్లు చంపి, తినేశాయి. తన కుటుంబానికి సంబంధించిన మొసళ్ల ఫామ్​లో నడుస్తుండగా ఈ దుర్గటన చోటుచేసుకుంది.

సంబంధిత కథనం