ఈ వ్యక్తి పలు దేశాల్లోని 87 మంది పిల్లలకు తండ్రి.. ఈ ఏడాది సెంచరీ చేస్తాడట!
Sperm Donor : అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన కైల్ గోర్డీ 87 మంది పిల్లలకు తండ్రి. స్పెర్మ్ డొనేషన్ ద్వారా అతను ఈ పేరును సాధించాడు. త్వరలో 100 మంది పిల్లలకు తండ్రి కాబోతున్నాడు.
అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన కైల్ గోర్డీ గురించిన విషయం వైరల్ అవుతోంది. ప్రపంచంలోనే అత్యధిక మొత్తంలో వీర్య దానం చేసిన వ్యక్తిగా తనదైన ముద్ర వేశాడు. 32 ఏళ్ల కైల్ గోర్డీ ఈ ఘనతకు అంతర్జాతీయంగా ఫేమస్ అవుతున్నాడు. ప్రస్తుతం అతను ప్రపంచంలోని వివిధ దేశాలలో 87 మంది పిల్లలకు తండ్రిగా ఉన్నాడు. ఒక అంచనా ప్రకారం ఈ సంవత్సరం చివరి నాటికి గోర్డీ 100 మంది పిల్లలకు తండ్రి అవుతాడు.

స్పెర్మ్ డొనేషన్ ద్వారా ప్రపంచంలో ఇప్పటివరకు ముగ్గురు వ్యక్తులు మాత్రమే వంద మంది పిల్లలకు తండ్రులు అనే బిరుదును సాధించారు. అయితే గోర్డీ మాత్రం 100 మందితో ఆపకూడదని అనుకుంటున్నాడు. ది స్టార్ నివేదిక ప్రకారం, గోర్డీ తన స్పెర్మ్ దానం కొనసాగించాలనుకుంటున్నాడు. ' కొందరు మహిళలకు ఆశను వదులుకోకుండా కుటుంబాన్ని ప్రారంభించడంలో నేను సహాయం చేసినందుకు నాకు సంతోషంగా ఉంది. కానీ నేను ఇప్పటికీ పెద్దగా ప్రభావం చూపలేదు. కాబట్టి దాని గురించి సంతోషంగా లేను. భవిష్యత్తులో మరింత మంది పిల్లల్ని కనేందుకు నా వంతు సాయం చేస్తాను.' ' అని కైల్ చెప్పుకొచ్చాడు.
కైల్ స్పెర్మ్ ద్వారా జన్మించిన పెద్ద బిడ్డ వయస్సు 10 సంవత్సరాలు. తనకు ఎంతమంది పిల్లలు కావాలో ఇంకా నిర్ణయించుకోలేదని ఆయన అంటున్నారు. 'నిజాయితీగా చెప్పాలంటే నేను ఏ నంబర్‌ను ఫిక్స్ చేయలేదు. ప్రజలకు నా అవసరం ఉన్నంత వరకు నేను పిల్లలను కనేందుకు నా సాయం కొనసాగిస్తానని అనుకుంటున్నాను.'అని అతను అన్నాడు.
ప్రస్తుతం కైల్‌కు ఇంగ్లాండ్, స్కాట్లాండ్, స్వీడన్, నార్వే వంటి దేశాలలో 14 మంది పిల్లలు ఉన్నారు. 2025లో జపాన్, ఐర్లాండ్, యూరప్ వంటి దేశాలను సందర్శించాలనుకుంటున్నట్లు కైల్ చెప్పాడు. 'నేను జపాన్, ఐర్లాండ్ నుండి వచ్చిన కొంతమంది మహిళలతో మాట్లాడుతున్నాను. ఈ దేశాలలో నాకు ఇంకా పిల్లలు లేరు.' అని అంటున్నాడు కైల్.
టాపిక్