Cabinet news: పైరసీని అడ్డుకునే దిశగా సినిమాటోగ్రఫీ సవరణ బిల్లు-cabinet nod to cinematograph amendment bill 2023 ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Cabinet News: పైరసీని అడ్డుకునే దిశగా సినిమాటోగ్రఫీ సవరణ బిల్లు

Cabinet news: పైరసీని అడ్డుకునే దిశగా సినిమాటోగ్రఫీ సవరణ బిల్లు

HT Telugu Desk HT Telugu

Cinematograph (Amendment) Bill: సినిమాటోగ్రఫీ సవరణ బిల్లుకు (Cinematograph (Amendment) Bill 2023) కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. పైరసీని అడ్డుకునే పలు ప్రతిపాదనలు ఇందులో ఉన్నాయి.

కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ (PTI)

Cinematograph (Amendment) Bill: సినిమాటోగ్రఫీ సవరణ బిల్లుకు (Cinematograph (Amendment) Bill 2023) కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. పైరసీని అడ్డుకునే పలు ప్రతిపాదనలు ఇందులో ఉన్నాయి.

Cinematograph (Amendment) Bill: ఇంటర్నెట్లో పైరసీ కంటెంట్

ఇంటర్నెట్లో విచ్చలవిడిగా ప్రసారం అవుతున్న పైరసీ ఫిల్మ్ కంటెంట్ ను అడ్డుకునేలా పలు ప్రతిపాదనలను ఈ సినిమాటోగ్రఫీ సవరణ బిల్లులో (Cinematograph (Amendment) Bill 2023) పొందుపర్చారు. కేంద్ర కేబినెట్ సమావేశం వివరాలను సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకు వెల్లడించారు. రానున్న సమావేశాల్లో ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడ్తామన్నారు. బిల్లులోని పూర్తి వివరాలను వెల్లడించడానికి ఠాకూర్ నిరాకరించారు. సభలో ప్రవేశపెట్టిన తరువాత ఆ వివరాలు అందరికీ లభిస్తాయన్నారు.

Cinematograph (Amendment) Bill: వయసుల వారీగా సినిమాల వర్గీకరణ

ప్రస్తుతం సినిమాల వీక్షణ అర్హతకు సంబంధించి ఉన్న 'U', 'A', ‘UA’, "S" వర్గీకరణల స్థానంలో వయస్సుల వారీ వర్గీకరణను ప్రారంభించే ప్రతిపాదనను కూడా తాజా సవరణ బిల్లులో పొందుపర్చామని అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. బిల్లులో పేర్కొన్న ప్రతిపాదనల ప్రకారం కొత్త వర్గీకరణ "UA-7 ", "UA-13 ", "UA-16 " తరహాలో ఉండనుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న వర్గీకరణ ప్రకారం ‘UA’ అంటే 12 ఏళ్ల వయస్సు లోపు పిల్లలు తల్లిదండ్రుల పర్యవేక్షణలో చూడవచ్చని అర్థం. కొత్తగా కేబినెట్ ఆమోదం పొందిన బిల్లు ప్రకారం.. "UA-7 అంటే ఏడేళ్ల లోపు పిల్లలు తల్లిదండ్రుల పర్యవేక్షణలో చూడవచ్చని, "UA-13 " అంటే " 13 ఏళ్ల లోపు పిల్లలు తల్లిదండ్రుల పర్యవేక్షణలో చూడవచ్చని, "UA-16 " అంటే 16 ఏళ్ల లోపు పిల్లలు తల్లిదండ్రుల పర్యవేక్షణలో చూడవచ్చని అర్థం. సినిమా కు సంబంధించిన అన్ని వర్గాలతో చర్చించి, వారి సలహాలు సూచనలు స్వీకరించి ఈ సవరణ బిల్లును రూపొందించామని అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. ఈ బిల్లులోని ప్రతిపాదనలు అందరికీ నచ్చుతాయని తాము భావిస్తున్నామన్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టంలోని పలు అనవసర ప్రతిపాదలను కొత్త బిల్లులో తొలగించామని వెల్లడించారు.

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.