Bypolls 2022 results : కూలిన కంచుకోటలు- 'ఉప' సమరంలోనూ బీజేపీ జోరు!-bypolls 2022 results bjp wins huge as aap loses punjab akhilesh yadav in up ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Bypolls 2022 Results, Bjp Wins Huge As Aap Loses Punjab, Akhilesh Yadav In Up

Bypolls 2022 results : కూలిన కంచుకోటలు- 'ఉప' సమరంలోనూ బీజేపీ జోరు!

Sharath Chitturi HT Telugu
Jun 26, 2022 07:19 PM IST

Bypolls 2022 results : ఉప ఎన్నికల్లో అఖిలేష్​ యాదవ్​, భగవంత్​ మన్​ పార్టీలకు షాక్​ తగిలింది. ఉత్తర్​ప్రదేశ్​, పంజాబ్​లోని ఆయా స్థానాలు వారి చేతుల్లోంచి జారిపోయాయి. మరోవైపు 10 సీట్లకు జరిగిన ఉపఎన్నికల్లో.. ఐదింట్లో బీజేపీ గెలుపొందింది.

కూలిన కంచుకోటలు- 'ఉప' సమరంలోనూ బీజేపీ జోరు!
కూలిన కంచుకోటలు- 'ఉప' సమరంలోనూ బీజేపీ జోరు! (HT_PRINT)

Bypolls 2022 results : 2022 ఉప ఎన్నికల సమరంలో బీజేపీ జోరు కొనసాగింది. ఇప్పటికే అనేక రాష్ట్రాల అసెంబ్లీలను తన ఖాతాలో వేసుకున్న కమలదళం.. తాజాగా వెలువడిన ఉప ఎన్నికల్లో సత్తా చాటింది. మొత్తం 10 సీట్లలకు(మూడు లోక్​సభ, ఏడు అసెంబ్లీ) ఉప ఎన్నికలు జరగ్గా.. వాటిల్లో ఐదింటిని కమలదళం తన ఖాతాలో వేసుకుంది.

ట్రెండింగ్ వార్తలు

విపక్షానికి షాక్​..

ఈ దఫా ఉపఎన్నికల్లో విపక్షాలకు గట్టి షాక్​ తగిలింది! ముఖ్యంగా ఉత్తర్​ప్రదేశ్​, పంజాబ్​లో పరిస్థితులు తారుమారయ్యాయి.

అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడంతో తన అజామ్​గఢ్​ సీటుకు రాజీనామా చేశారు ఎస్పీ అధినేత అఖిలేష్​ యాదవ్​. అఖిలేష్​ కంచుకోట అయిన ప్రాంతంలో బీజేపీ జెండా రెపరెపలాడింది! ఎస్పీ అభ్యర్థి ధర్మేంద్ర యాదవ్​పై బీజేపీ అభ్యర్థి దినేష్​ లాల్​ యాదవ్​ గెలుపొందారు. మరోవైపు ఎస్పీ నేత అజామ్​ ఖాన్​ రాజీనామా చేయడంతో ఖాళీ ఏర్పడిన రామ్​పూర్​ నియోజకవర్గానికి ఎన్నికలు జరగ్గా.. అక్కడ కూడా బీజేపీకి చెందిన అభ్యర్థే(ఘనశ్యామ్​ లోధి) గెలిచారు.

Sangrur election result 2022 : ఇక పంజాబ్​లో.. అధికారంలో ఉన్న ఆమ్​అద్మీకి గెట్టి ఎదురుదెబ్బే తగిలిందని చెప్పుకోవాలి. ముఖ్యమంత్రి అభ్యర్థిగా గెలుపొందిన అనంతరం సంగ్రూర్​ ఎంపీగా రాజీనామా చేశారు భగవంత్​ మన్​. తాజాగా.. ఆ సీటుకు ఉపఎన్నిక జరగ్గా.. శిరోమణి అకాలీ దళ్​కు చెందిన సిమ్రాన్​జిత్​ సింగ్​ మన్​ గెలుపొందారు. ఆప్​కు పట్టు ఉన్న సంగ్రూర్​ చేయి జారిపోవడం ఇప్పుడు సర్వత్రా చర్చకు దారితీసింది. ఇక్కడ బీజేపీకి ముందునుంచే పెద్దగా పట్టులేదు.

ఇక ఢిల్లీలో ఆప్​ విజయాల పరంపర కొనసాగింది. రాజేందర్​ నగర్​లో జరిగిన ఉప సమరంలో బీజేపీ అభ్యర్థి రాజేష్​ భాటియాపై ఆప్​కు చెందిన దుర్గేష్​ పాఠక్​.. 11వేల మెజారిటీతో గెలుపొందారు.

త్రిపుర.. ఆంధ్రప్రదేశ్​..

త్రిపురలో బీజేపీ హవా స్పష్టంగా కనిపించింది. నాలుగు అసెంబ్లీ సీట్లకు జరిగిన ఎన్నికల్లో మూడింట్లో భారీ విజయాలను అందుకుంది. అందులో సీఎం మానిక్​ సాహు పోటీ చేసిన బర్దోవాలి నియోజకవర్గం ఒకటి. 6వేల మెజారిటీతో ఆయన గెలుపొందారు. ఒక సీటు కాంగ్రెస్​కు దక్కింది.

ఝార్ఖండ్​ మందార్​లో కాంగ్రెస్​ అభ్యర్థి శిల్పా నేహా తిర్కే గెలిచారు. ఆమె తండ్రి.. బందు తిర్కేపై అవినీతి ఆరోపణలు రావడంతో ఆయనపై అనర్హత వేటుపడింది. ఫలితంగా అక్కడ ఖాళీ ఏర్పడింది.

Atmakur Bypoll results : ఇక ఆంధ్రప్రదేశ్​లో వైసీపీకి చెందిన మేకపాటి విక్రమ్​ రెడ్డి.. ఆత్మకూర్​లో గెలిచారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం