Budget Memes : బడ్జెట్‌పై క్రేజీగా మీమ్స్.. ఆంధ్రా, బీహార్‌కేనా.. మరి మాకో అంటూ పోస్టులు-budget memes viral in social media after andhra pradesh and bihar get bumper offer budget memes trending ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Budget Memes : బడ్జెట్‌పై క్రేజీగా మీమ్స్.. ఆంధ్రా, బీహార్‌కేనా.. మరి మాకో అంటూ పోస్టులు

Budget Memes : బడ్జెట్‌పై క్రేజీగా మీమ్స్.. ఆంధ్రా, బీహార్‌కేనా.. మరి మాకో అంటూ పోస్టులు

Anand Sai HT Telugu Published Jul 23, 2024 04:39 PM IST
Anand Sai HT Telugu
Published Jul 23, 2024 04:39 PM IST

Budget Memes Viral : కేంద్ర బడ్జెట్ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. అయితే బడ్జెట్ ప్రసంగం నడుస్తుండగానే మీమర్స్ సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్ చేశారు.

బడ్జెట్‌పై మీమ్స్
బడ్జెట్‌పై మీమ్స్ (HT Telugu)

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై సోషల్ మీడియాలో మీమ్స్ తెగ వైరల్ అవుతున్నాయి. మధ్యతరగతివారికి ఇచ్చినట్టే.. ఇచ్చినా ఏమీ కనిపించడం లేదని మీమ్స్ తయారు చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్, బీహార్‌ కేటాయింపులపై క్రేజీ మీమ్స్ తయారు చేశారు. ఇవి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆంధ్రప్రదేశ్, బీహార్‌లకు భారీ ఆర్థిక సహాయం ప్రకటించిన తర్వాత, బడ్జెట్ మీమ్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. అదేవిధంగా మధ్యతరగతి ప్రజలను నిర్లక్ష్యం చేస్తున్నారనే మీమ్స్ కూడా చక్కర్లు కొడుతున్నాయి.

బడ్జెట్‌లో బీహార్‌లో కొత్త విమానాశ్రయాలు, మెడికల్ కాలేజీలు, హైవేలు, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని ప్రకటించడంతో ఇతర రాష్ట్రాల భావాలను వర్ణించే విధంగా మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ బడ్జెట్ అర్థం కాక వినడానికి బాగానే ఉంది అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

లోక్‌సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024 బడ్జెట్‌ను ప్రవేశపెడుతుండగానే మీమర్స్ మీమ్స్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వదిలారు. సోషల్ మీడియా బడ్జెట్ మీమ్స్, జోకులతో నిండిపోయింది.

ఇక ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధికి రూ.15,000 కోట్ల సాయం అందజేస్తామని నిర్మలా సీతారామన్ తెలిపారు. ఆంధ్రాకు రాజధాని ఆవశ్యకతను గుర్తించి, ఏజెన్సీల ద్వారా ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని అందిస్తామన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.15,000 కోట్లు ఇస్తామని నిర్మలా సీతారామన్ చెప్పారు.

బీహార్ విషయానికి వస్తే వివిధ రహదారుల ప్రాజెక్టుల కోసం కేంద్ర ప్రభుత్వం రూ.26,000 కోట్లు కేటాయించింది. ఈ నేప‌థ్యంలో నిర్మలా సీతారామ‌న్ ప్రకటన సోష‌ల్ మీడియాలో చర్చకు దారితీసింది. మిగిలిన రాష్ట్రాలకు మెుండిచేయి చూపించారని మీమ్స్ వైరల్ అయ్యాయి.

బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌లలో సమగ్ర అభివృద్ధిని ప్రోత్సహించడానికి పూర్వోదయ పేరుతో ఒక సమగ్ర పథకాన్ని అభివృద్ధి చేయనున్నట్లు మోదీ ప్రభుత్వం ప్రకటించింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఏడోసారి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టి చరిత్ర సృష్టించారు. ఆమె బడ్జెట్ సమర్పించిన నిమిషాల వ్యవధిలోనే మీమ్స్ వైరల్ అయ్యాయి.

Whats_app_banner
జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.