Mahila Samman Savings Certificate : మహిళలకు అండగా.. పొదుపు పథకాన్ని ప్రకటించిన ప్రభుత్వం-budget 2023 govt unveils one time mahila samman savings certificate see details here ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
Telugu News  /  National International  /  Budget 2023 Govt Unveils One-time Mahila Samman Savings Certificate See Details Here

Mahila Samman Savings Certificate : మహిళలకు అండగా.. పొదుపు పథకాన్ని ప్రకటించిన ప్రభుత్వం

మహిళలకు అండగా.. పొదుపు పథకాన్ని ప్రకటించిన ప్రభుత్వం
మహిళలకు అండగా.. పొదుపు పథకాన్ని ప్రకటించిన ప్రభుత్వం

Mahila Samman Savings Certificate : మహిళా సమ్మాన్​ సేవింగ్స్​ సర్టిఫికేట్​ను ప్రకటించింది కేంద్రం. ఇందులో భాగంగా 7.5శాతం వడ్డీని ఇస్తుంది.

Mahila Samman Savings Certificate : బడ్జెట్​ 2023లో భాగంగా.. మహిళలకు చిన్న పొదుపు పథకాన్ని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. పార్లమెంట్​లో బుధవారం బడ్జెట్​ను ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​.. ఈ "మహిళా సమ్మాన్​ సేవింగ్స్​ సర్టిఫికేట్​"పై వివరణ ఇచ్చారు.

ట్రెండింగ్ వార్తలు

మహిళలకు అండగా..

మహిళా సమ్మాన్​ సేవింగ్స్​ సర్టిఫికేట్ అనేది వన్​ టైమ్​ ఇన్​వెస్ట్​మెంట్​ స్కీమ్​. రెండేళ్ల కాల వ్యవధి ఉంటుంది. ఫలితంగా మార్చ్​ 2025తో ఈ పథకం ముగుస్తుంది. ఈ పొదుపు పథకంలో భాగంగా ఖాతాదారులకు 7.5శాతం వడ్డీని ఇస్తుంది ప్రభుత్వం. అవసరమైతే.. నగదును పాక్షికంగా ఉపసంహరించుకునే వెసులుబాటు కూడా ఉంటుంది.

Budget 2023 live updates : “ఆజాదీ కా అమృత్​ మహోత్సవాన్ని స్మరించుకుంటూ.. మహిళలకు ప్రత్యేక పొదుపు పథకాన్ని తీసుకొస్తున్నాము. దీని పేరు మహిళా సమ్మాన్​ సేవింగ్స్​ సర్టిఫికేట్​. మార్చ్​ 2025 వరకు.. అంటే రెండేళ్ల టర్మ్​తో ఇది అందుబాటులో ఉంటుంది. మహిళా సాధికారత కోసం.. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని మా ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. అందుకు ఇదే నిదర్శనం," అని లోక్​సభలో ప్రకటించారు నిర్మలా సీతారామన్​.

'బడ్జెట్​'తో ఏ వస్తువుల ధరలు పెరుగుతాయి? ఏవి తగ్గుతాయి? అన్న వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

కేంద్ర ఆర్థికమంత్రి ప్రకటన ప్రకారం.. మహిళలు, బాలికలు.. రూ. 2లక్షల వరకు ఇందులో డిపాజిట్​ చేసుకోవచ్చు. ఫిక్స్​డ్​ ఇంట్రెస్ట్​ రేటు కింద 7.5శాతం ఇస్తుంది ప్రభుత్వం. రానున్న రోజుల్లో ఈ పథకంపై మరింత సమాచారాన్ని ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది.

సీనియర్​ సిటిజెన్​ కోసం..

సీనియర్​ సిటిజెన్​ సేవింగ్స్​ స్కీమ్ (ఎస్​సీఎస్​ఎస్​) ​లో డిపాజిట్​ లిమిట్​ని పెంచుతున్నట్టు నిర్మలా సీతారామన్​ ప్రకటించారు. ఈ మేరకు బడ్జెట్​ 2023 ప్రసంగంలో వివరించారు.

"సీనియర్​ సిటిజెన్​ సేవింగ్స్​ స్కీమ్​లో రూ. 15లక్షలుగా ఉన్న డిపాజిట్​ లిమిట్​ను రూ. 30లక్షలకు పెంచుతున్నాము," అని నిర్మల అన్నారు. అంతేకాకుండా.. నెలవారీ ఆదాయపు ఖాత పథకం లిమిట్​ని కూడా రూ. 4.5లక్షల నుంచి రూ. 9లక్షలకు పెంచుతున్నట్టు వివరించారు. జాయింట్​ అకౌంట్​ల మ్యాగ్జిమం లిమిట్​ను రూ. 9లక్షల నుంచి రూ. 15లక్షలకు పెంచినట్టు స్పష్టం చేశారు.

ఎస్​సీఎస్​ఎస్​ వడ్డీ రేటును 7.4శాతం నుంచి 7.6శాతానికి ప్రభుత్వం పెంచిన విషయం తెలిసిందే.

మరోవైపు మధ్యతరగతి ప్రజలు, వేతన జీవులకు భారీగా ఊరటనిచ్చింది కేంద్రం. రూ. 7లక్షల వేతనం వరకు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని ప్రకటించింది. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

WhatsApp channel

సంబంధిత కథనం