Brij Bhushan : బ్రిజ్​ భూషణ్​ కుమారుడికి బీజేపీ టికెట్​- రెజ్లర్ల స్పందన ఇది..-brij bhushan son gets bjp lok sabha ticket daughters have lost says wrestlers ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Brij Bhushan : బ్రిజ్​ భూషణ్​ కుమారుడికి బీజేపీ టికెట్​- రెజ్లర్ల స్పందన ఇది..

Brij Bhushan : బ్రిజ్​ భూషణ్​ కుమారుడికి బీజేపీ టికెట్​- రెజ్లర్ల స్పందన ఇది..

Sharath Chitturi HT Telugu
May 03, 2024 06:29 AM IST

Brij Bhushan BJP : రెజ్లర్లపై లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్​భూషణ్​కి బీజేపీ ఈసారి టికెట్​ ఇవ్వలేదు. కానీ.. ఆయన కుమారుడికి టికెట్​ ఇచ్చింది.

బ్రిజ్​ భూషణ్​, ఆయన కుమారుడు కరణ్​ భూషణ్​..
బ్రిజ్​ భూషణ్​, ఆయన కుమారుడు కరణ్​ భూషణ్​.. (ANI)

Brij Bhushan BJP : రెజ్లర్స్​ ఫెడరేషన్​ ఆఫ్​ ఇండియా మాజీ చీఫ్​, బీజేపీ బాహుబలి నేత బ్రిజ్​ భూషణ్​పై రెజర్లు లైంగిక దాడి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఇదే విషయంపై గతేడాది రెజ్లర్లు రోడ్ల మీదకు వచ్చి నిరసనలు వ్యక్తం చేశారు. ఇక తాజాగా.. 2024 లోక్​సభ ఎన్నికల్లో బ్రిజ్​ భూషణ్​కి బీజేపీ టికెట్​ ఇవ్వలేదు కానీ.. ఆయన స్థానంలో, ఆయన కుమారుడిని నిలబెట్టింది కమలదళం. ఈ విషయంపై రెజ్లర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. భారత దేశ కూతుళ్లు ఓడిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

"భారత దేశ కూతుళ్లు ఓడిపోయారు. బ్రిజ్​ భూషణ్​ గెలిచారు. మా కెరీర్లను పణంగా పెట్టి.. చాలా రోజుల పాటు ఎండనకా వాననకా రోడ్ల మీద పడుకున్నాము. కానీ ఇప్పటివరకు బ్రిజ్​ భూషణ్​ని అరెస్ట్​ చేయలేదు. ఇప్పుడు.. ఆయన కుమారుడికి టికెట్​ ఇచ్చారు. మేము ఏమీ అడగట్లేదు. న్యాయం మాత్రమే డిమాండ్​ చేస్తున్నాము," అని మాజీ రెజ్లర్​, ఒలంపిక్​ మెడలిస్ట్​ సాక్షి మాలిక్​.. ట్వీట్​ చేశారు.

బ్రిజ్​భూషణ్​ పెద్ద కుమారుడు.. ప్రతీక్​ భూషణ్​ సింగ్​.. ప్రస్తుతం యూపీ ఎమ్మెల్యే. ఉత్తర్​ ప్రదేశ్​ రెజ్లింగ్​ ఫెడరేషన్​కి చీఫ్​. ఇక ఇప్పుడు.. బ్రిజ్​ భూషణ్​ చిన్న కుమారుడు.. కరణ్​ భూషణ్​ సింగ్​కి టికెట్​ ఇచ్చింది బీజేపీ. 2024 లోక్​సభ ఎన్నికల్లో ఆయన.. కైసర్​గంజ్​ సీటు నుంచి బరిలో దిగుతున్నారు. ఎన్నికల్లో పోటీ చేయడం ఆయనకు ఇదే తెలిసారి.

Wrestlers vs Brij Bhushan : "బీజేపీ అధిష్ఠానానికి నా ధన్యవాదాలు. ప్రజలకు ధన్యవాదాలు. ప్రజలకు సేవ చేసుకునే అవకాశం నాకు ఇచ్చారు," అని కరణ్​ సింగ్​ తెలిపారు.

ఇదీ చూడండి:- Telangana Lok Sabha Polls 2024 : ఒకే పేరు... అభ్యర్థులు వేర్వురు..! ఈ నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీలకు సరికొత్త టెన్షన్

బ్రిజ్​ భూషణ్​.. 6సార్లు ఎంపీగా పనిచేశారు. కైసర్​గంజ్​ నియోజకవర్గంపై బ్రిజ్​ భూషణ్​కి బలమైన పట్టు ఉంది. ఆయనొక బాహుబలి నేత. ఆయన్ని పక్కన పెడితే పరిస్థితులు ప్రతికూలంగా ఉంటాయని బీజేపీకి తెలుసు. కానీ తాను ఎన్నికల్లో పోటీ చేస్తానని బ్రిజ్​ భూషణ్​ చెప్పినట్టు సమాచారం. ఆయన్ని బుజ్జగించి, ఆయన స్థానంలో కుమారుడికి బీజేపీ టికెట్​ ఇచ్చిందని తెలుస్తోంది.

"నేను పార్టీ కన్నా పెద్దవాడిని కాదు. పార్టీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా," అని బ్రిజ్​ భూషణ్​ తెలిపారు.

BJP Brij Bhushan Singh : బ్రిజ్​భూషణ్​పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు దేశవ్యాప్తంగా సంతలనం సృష్టించాయి. దిగ్గజ రెజ్లర్లు బజ్​రంగ్​ పునియా, వినేశ్​ ఫోగట్​, సాక్షి మాలిక్​లు రోడ్ల మీదకు వచ్చి నిరసనలు చేశారు. మహిళా రెజ్లర్లను బ్రిజ్​ భూషణ్​ లైంగికంగా హింసించాడని ఆరోపించారు. బ్రిజ్​ భూషణ్​ మాత్రం.. తాను ఎలాంటి తప్పు చేయలేదని చెబుతూ వస్తున్నారు. ఆయనపై దాఖలైన కేసు.. ప్రస్తుతం దిల్లీ కోర్టులో పెండింగ్​లో ఉంది.

2024 లోక్​సభ ఎన్నికల 5వ దశ పోలింగ్​లో భాగంగా.. మే 20న కసర్​గంజ్​లో ఓటింగ్​ జరగనుంది. ఫలితాలు జూన్​ 4న వెలువడతాయి.

IPL_Entry_Point

సంబంధిత కథనం