Live News Today: మరో వందే భారత్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ-breaking news latest updates live news today 25th may narendra modi new parliament building row latest news
Telugu News  /  National International  /  Breaking News Latest Updates Live News Today 25th May Narendra Modi New Parliament Building Row Latest News

లేటెస్ట్ న్యూస్ (ANI Photo)

Live News Today: మరో వందే భారత్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ

Live News, Latest Updates Today: నేటి జాతీయ, అంతర్జాతీయ, వ్యాపార, టెక్, ఆటో సహా అనేక అంశాలపై తాజా వార్తలను ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి. లేటెస్ట్ అప్‍డేట్ల కోసం ఈ పేజీని ఫాలో అవండి.

Thu, 25 May 202315:33 IST

చైనాలో మళ్లీ కొరోనా కల్లోలం; జూన్ చివరినాటికి వారానికి 6.5 కోట్ల కేసులు

Covid wave in China: పుట్టినిల్లు చైనాలో కొరోనా మరోసారి విజృంభిస్తోంది. ఒమిక్రాన్ కొత్త వేరియంట్ ఎక్స్ బీబీ (omicron XBB) తో దేశంలో కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. జూన్ చివరి నాటికి వారానికి 6.5 కోట్ల కొరోనా కేసులు నమోదయ్యే ప్రమాదముందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Thu, 25 May 202315:02 IST

52 వారాల గరిష్టానికి హెరిటేజ్ ఫుడ్స్ షేర్లు; Q4 లో భారీ లాభాలు; డివిడెండ్

2022 -23 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (Q4FY23) లో హెరిటేజ్ ఫుడ్స్ మంచి ఫలితాలను సాధించింది. దాంతో, గురువారం హెరిటేజ్ ఫుడ్స్ షేర్స్ విలువ 9% పెరిగి 52 వారాల గరిష్టానికి చేరింది. Q4FY23లో సంస్థ నికర ఆదాయం రూ. 820.96 కోట్లకు చేరింది. Q4FY22 లో హెరిటేజ్ ఫుడ్స్ సాధించిన నికర ఆదాయం రూ. 698.35 కోట్లతో పోలిస్తే Q4FY23 లో సంస్థ 17.93% అధికంగా ఆదాయం సముపార్జించింది.

Thu, 25 May 202314:13 IST

Denying sex is cruelty: ‘జీవిత భాగస్వామితో సెక్స్ కు నిరాకరించడం క్రూరత్వమే’: అలహాబాద్ హైకోర్టు

Denying sex is cruelty: సరైన కారణం చూపకుండా, దీర్ఘకాలం పాటు జీవిత భాగస్వామితో లైంగిక చర్యకు నిరాకరించడం మానసికంగా హింసించడంగా, క్రూరత్వంగా పరిగణించవచ్చని అలహాబాద్ హై కోర్టు స్పష్టం చేసింది. ఆ ప్రాతిపదికన విడాకులు మంజూరు చేయవచ్చని సూచించింది.

Thu, 25 May 202313:39 IST

Mutual Funds: లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్.. ఎందులో పెట్టుబడి బెటర్

మ్యుచ్యువల్ ఫండ్స్ లో ప్రధానంగా మూడు కేటగిరీలు ఉంటాయి. అవి లార్జ్ క్యాప్ (large-cap mutual funds), మిడ్ క్యాప్ (mid-cap mutual funds), స్మాల్ క్యాప్ (small-cap mutual funds). ఇన్వెస్టర్.. తన పెట్టుబడుల విషయంలో సంప్రదాయ విధానాన్ని (conservative) ఇష్టపడే వాడా? లేక బ్యాలెన్స్డ్ (balanced) గా ఉండేవాడా? లేక దూకుడుగా (aggressive) ఉండేవాడా? అనే అంశంపై కూడా ఏ ఫండ్ లో పెట్టుబడి పెట్టాలనే విషయం ఆధారపడి ఉంటుంది.

Thu, 25 May 202311:11 IST

Samsung Galaxy S21 FE: అత్యంత తక్కువ ధరకు సామ్సంగ్ ప్రీమియం స్మార్ట్ ఫోన్

లాంచ్ అయిన నాటి నుంచి సామ్సంగ్ గెలాక్సీ ఎస్ 21 ఎఫ్ఈ కు మంచి రివ్యూస్ వచ్చాయి. సామ్సంగ్ గెలాక్సీ సిరీస్ లో వచ్చిన సక్సెస్ ఫుల్ మోడల్స్ లో సామ్సంగ్ గెలాక్సీ ఎస్ 21 ఎఫ్ఈ కూడా ఒకటి. ఇప్పుడు ఈ ఫోన్ ఆమెజాన్ బ్లాక్ బస్టర్ వ్యాల్యూ డేస్ సేల్ లో 56% డిస్కౌంట్ తో లభిస్తోంది. సామ్సంగ్ గెలాక్సీ ఎస్ 21 ఎఫ్ఈ 5జీ నెట్ వర్క్ ను సపోర్ట్ చేస్తుంది. ఇందులో 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ఇప్పుడు ఆమెజాన్ బ్లాక్ బస్టర్ వ్యాల్యూ డేస్ సేల్ లో 56% డిస్కౌంట్ తో లభిస్తోంది.

Thu, 25 May 202310:47 IST

Student suicide in Kota: కోటలో మరో విద్యార్థి ఆత్మహత్య; ఈ నెలలో 3 బలవన్మరణాలు

బిహార్ లోని నలంద పట్టణం నుంచి నీట్ యూజీ కోచింగ్ కోసం కోట కు వచ్చిన 16 ఏళ్ల విద్యార్థి బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. అతడు ఉంటున్న హాస్టల్ గదిలోని ఫ్యాన్ కు ఉరివేసుకున్నాడు. వైద్య విద్యను అభ్యసించి, డాక్టర్ కావాలని కలలు కన్న ఆ విద్యార్థి కోచింగ్ సెంటర్లలోని ఒత్తిడికి తట్టుకోలేక అర్ధాంతరంగా ప్రాణం తీసుకున్నాడు. ఈ బిహార్ విద్యార్థి నెల క్రితమే నీట్ కోచింగ్ కోసం కోట కు వచ్చాడని పోలీసులు తెలిపారు.

Thu, 25 May 202310:31 IST

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

నేటి సెషన్‍ను నష్టాలతో ఆరంభించిన స్టాక్ మార్కెట్లు చివరికి లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 98.84 పాయింట్లు పెరిగి 61,872.62 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 35.75 పాయింట్లు అధికమై 18,321.15 వద్ద ముగిసింది. 

Thu, 25 May 202310:15 IST

JEE Main 2023 Paper 2 result: జేఈఈ మెయిన్ పేపర్ 2 ఫలితాల వెల్లడి

JEE Main 2023 Paper 2 result: జేఈఈ మెయిన్ 2023 పేపర్ 2 (JEE Main 2023 Paper 2) ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) గురువారం విడుదల చేసింది. అధికారిక వెబ్ సైట్ jeemain.nta.nic.in. ద్వారా ఈ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. జేఈఈ మెయిన్ 2023 పేపర్ 2 బీ ఆర్క్(BArch), బీ ప్లానింగ్ (BPlanning) కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన పరీక్ష.

Thu, 25 May 20239:36 IST

Maruti Suzuki Jimny launch: మారుతి జిమ్నీ లాంచ్ డేట్ వచ్చేసింది.. మహింద్ర థార్ కు గట్టి పోటీ

మారుతి జిమ్నీ కారును మొదట ఆటో ఎక్స్ పో 2023 లో ఆవిష్కరించారు. ధర ఎంతో తెలియకముందే, భారత్ లో 30 వేలకు పైగా వినియోగదారులు ఈ కార్ ను బుక్ చేసుకున్నారు. తాజాగా, ఈ కార్ లాంచ్ డేట్ పై స్పష్టత వచ్చింది. జూన్ 7వ తేదీన ఈ మారుతి జిమ్నీని లాంచ్ చేయనున్నారు. భారత్ లో 5 డోర్ పెట్రోల్ ఇంజన్ మోడల్ అందుబాటులో ఉంటుంది. ఈ కార్ జెటా, ఆల్ఫా వేరియంట్లలో లభిస్తుంది. మారుతి సుజుకీ నెక్సా డీలర్ షిప్ ల వద్ద మాత్రమే ఈ కారు లభిస్తుంది.

Thu, 25 May 20238:53 IST

BMW Z4 Roadster: ఇండియన్ మార్కెట్లో అడుగుపెట్టిన బీఎండబ్ల్యూ జీ4 రోడ్ స్టర్

ఇండియాలోని బీఎండబ్ల్యూ డీలర్స్ వద్ద ఈ ఓపెన్ టాప్ 2 సీటర్ బీఎండబ్ల్యూ జీ4 రోడ్ స్టర్ ఈ జూన్ నుంచి లభించనుంది. ఈ లగ్జరీ కారు ఎక్స్ షోరూమ్ ధర రూ. 89.30 లక్షలు. ఈ కారుకు రెండు సంవత్సరాల అన్ లిమిటెడ్ కిలోమీటర్ల వారంటీ ఉంది. ఈ జీ4 రోడ్ స్టర్ లో 3.0 లీటర్, 6 సిలిండర్, ట్విన్ టర్బో చార్జ్ డ్ వీ 6 ఇంజన్ ను అమర్చారు. ఇది 8 స్పీడ్ ఆటోమేటెడ్ ట్రాన్స్ మిషన్ తో వస్తోంది. బీఎండబ్ల్యూ జీ4 రోడ్ స్టర్ 4.5 సెకన్లలో జీరో నుంచి 100 కిమీల వేగాన్ని అందుకోగలదని కంపెనీ చెబుతోంది.

Thu, 25 May 20238:43 IST

నష్టాల్లోనే స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం సమయానికి నిఫ్టీ 52.20 నష్టంతో 18,232.20 వద్ద, సెన్సెక్స్ 199.76 పాయింట్లు పడిపోయి 61,574.02 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. 

Thu, 25 May 20238:15 IST

Satyendar Jain: ఆక్సీజన్ సపోర్ట్ పై ఢిల్లీ మాజీ మంత్రి సత్యేంద్ర జైన్; తిహార్ జైలు బాత్రూమ్ లో పడిపోయిన ఆప్ నేత

Satyendar Jain: మనీ లాండరింగ్ కేసులో తిహార్ జైళ్లో ఉన్న ఆప్ నేత, ఢిల్లీ మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం ఆయన లోక్ నాయక్ ఆసుపత్రిలో ఆక్సిజన్ సపోర్ట్ పై ఉన్నారు.

Thu, 25 May 20238:04 IST

ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం కేసులో దోషికి జీవిత ఖైదు

ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసి, హత్య చేసిన కేసులో నిందితుడు రవీందర్ కుమార్‌కు ఢిల్లీలోని రోహిణి హైకోర్టు జీవిత ఖైదు విధించింది. 2008 నుంచి 2015 మధ్య 30 మంది పిల్లలను కిడ్నాప్‍లో అతడికి ప్రమేయం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. మూడు కేసుల విచారణ మాత్రమే ఇప్పటి వరకు జరిగింది. 

Thu, 25 May 20237:33 IST

అస్సాంకు అమిత్ షా

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. అస్సాంకు చేరుకున్నారు. గువహటిలో ఆయనకు సీఎం హిమంత బిశ్వ శర్మ స్వాగతం పలికారు. 

Thu, 25 May 20236:58 IST

పార్లమెంటు భవనం ప్రారంభంపై సుప్రీంలో పిటిషన్

పార్లమెంటు నూతన భవనాన్ని రాష్ట్రపతి ప్రారంభించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL) దాఖలైంది. ఈనెల 28న ఢిల్లీలో పార్లమెంటు నూతన భవనాన్ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. 

Thu, 25 May 20235:55 IST

మరో వందే భారత్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ

డెహ్రాడూన్ - ఢిల్లీ మధ్య నడిచే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేడు ప్రారంభించారు. ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ రైలును ప్రారంభించారు. ఉత్తరాఖండ్‍లో పరుగులు పెట్టనున్న తొలి వందే భారత్ ఇదే. 

Thu, 25 May 20235:45 IST

ఆ పార్టీల నిర్ణయం తప్పు: గుజరాత్ సీఎం

పార్లమెంటు నూతన భవనం ప్రారంభోత్సవానికి హాజరుకాకూడదని 19 విపక్ష పార్టీలు తీసుకున్న నిర్ణయం సరైనదని కాదని గుజరాత్ సీఎం భూపేందర్ పటేల్ అన్నారు. ప్రజాస్వామ్య విలువలపై దాడి చేసేలా ఈ నిర్ణయం ఉందని ఆయన విమర్శించారు. 

Thu, 25 May 20235:06 IST

ఆసుపత్రిలో చేరిన సత్యేంద్ర జైన్

ఢిల్లీ లిక్కర్ రాలసీ కేసుకు సంబంధించిన మనీ ల్యాండరింగ్ కేసులో జైలులో ఉన్న ఢిల్లీ మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ ఓ ఆసుపత్రిలో చేరారు. తిహార్ జైలులోని బాత్‍రూమ్‍లో ఆయన కిందపడ్డారు. దీంతో అక్కడి అధికారులు ఆయనను ఢిల్లీలోని ఆసుపత్రిలో చేర్చారు.  

Thu, 25 May 20234:25 IST

ఢిల్లీ-డెహ్రాడూన్ వందేభారత్ రైలు ప్రారంభం నేడే

ఢిల్లీ, డెహ్రాడూన్ మధ్య నడిచే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేడు వర్చువల్‍గా ప్రారంభించనున్నారు. 

Thu, 25 May 20234:02 IST

ఫ్లాట్‍గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్లు సూచీలు నేడు ఫ్లాట్‍గా మొదలయ్యాయి. సెషన్ ఓపెనింగ్‍లో జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 15.50 పాయింట్లు పడి 18,269.90 వద్ద, బీఎస్ఈ సెన్సెక్స్ 46.62 పాయింట్లు నష్టపోయి 61,727.16 వద్ద ట్రేడవుతున్నాయి.

Thu, 25 May 20233:33 IST

ముగిసిన మోదీ విదేశీ పర్యటన

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మూడు దేశాల పర్యటన ముగిసింది. నేడు ఆయన ఢిల్లీకి చేరుకున్నారు. జపాన్, పపువా న్యూ గినియా, ఆస్ట్రేలియాల్లో ఆయన పర్యటించారు. మొత్తంగా ఆరు రోజుల పాటు ఈ పర్యటన జరిగింది. 

Thu, 25 May 20233:13 IST

పార్లమెంటు నూతన భవన ప్రారంభోత్సవానికి వైసీపీ, బీజేడీ

ఈనెల 28వ తేదీన జరిగే పార్లమెంటు నూతన భవన ప్రారంభ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఒడిశా‍లో అధికారంలో ఉన్న బిజూ జనతా దళ్ (BJD) హాజరు కానున్నాయి. పార్లమెంటు నూతన భవవాన్ని ప్రధాని మోదీ ప్రారంభించడాన్ని వ్యతిరేకిస్తూ 19 విపక్షాలు ప్రారంభ కార్యక్రమాన్ని బహిష్కరించాయి. అయితే వైసీపీ, బీజేడీ  కార్యక్రమానికి హాజరుకానున్నట్టు స్పష్టం చేశాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈనెల 28న పార్లమెంటు నూతన భవనాన్ని ప్రారంభించనున్నారు. 

Thu, 25 May 20233:13 IST

నష్టాలతో స్టాక్ మార్కెట్లు మొదలయ్యే ఛాన్స్

భారత స్టాక్ మార్కెట్లు నేడు స్వల్ప నష్టాలతో మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఎస్‍జీఎక్స్ నిఫ్టీ 52 పాయింట్ల నష్టంతో ఉంది.

Thu, 25 May 20233:13 IST

మళ్లీ పెరిగిన బంగారం ధరలు

దేశంలో బంగారం ధర మళ్లీ పెరిగింది.  22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.250 పెరిగి రూ.56,250కు, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు రూ.260 పెరిగి రూ.61,360కు చేరింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

ఆర్టికల్ షేర్ చేయండి