బాలుడిని మింగేసిన మొసలి.. నదిలో స్నానం చేస్తుండగా..-boy swallowed by giant crocodile while bathing in mp s chambal river ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  బాలుడిని మింగేసిన మొసలి.. నదిలో స్నానం చేస్తుండగా..

బాలుడిని మింగేసిన మొసలి.. నదిలో స్నానం చేస్తుండగా..

Sharath Chitturi HT Telugu
Jul 12, 2022 08:26 AM IST

ఓ బాలుడు.. స్నానం చేసేందుకు నదిలోకి వెళ్లాడు. ఇంతలో మొసలి వచ్చి అతడిని మింగేసింది. ఈ ఘటన మధ్యప్రదేశ్​లో జరిగింది.

<p>బాలుడిని మింగేసిన మొసలి.. నదిలో స్నానం చేస్తుండగా..</p>
<p>బాలుడిని మింగేసిన మొసలి.. నదిలో స్నానం చేస్తుండగా..</p>

8ఏళ్ల బాలుడిని మొసలి మింగేసిన ఘటన మధ్యప్రదేశ్​ షియోపూర్​లో చోటుచేసుకుంది. చంబల్​ నదిలో ఆ బాలుడు స్నానం చేసేందుకు వెళ్లగా.. అతడిని ఆ మొసలి మింగేసినట్టు తెలుస్తోంది.

బాలుడు ఎప్పటిలాగే సోమవారం సాయంత్రం కూడా నదిలో స్నానానికి వెళ్లాడు. కాగా.. ఈసారి ఇంకొంత దూరం వెళ్లి స్నానం చేసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే అక్కడే ఉన్న ఓ మొసలి తొలుత అతడిని కరిచింది. అనంతరం బాలుడిని నదిలోపలికి తీసుకెళ్లి మింగేసింది!

ఈ దృశ్యాలు చూసిన స్థానికులు.. బాలుడి కుటుంబానికి సమాచారం అందించారు. వారందరు పరిగెత్తుకుంటూ నది వద్దకు వెళ్లారు. వల, కర్రల సహాయంతో అందరు కలిసి.. ఆ మొసలిని నదిలో నుంచి బయటకు లాగేశారు.

అదే సమయంలో.. ఈ వ్యవహారంపై సమాచారం అందుకున్న అటవీశాఖ బృందం, పోలీసుల బృందం ఘటనాస్థలానికి వెళ్లాయి. గ్రామస్థుల నుంచి మొసలిని విడిపించే ప్రయత్నం చేశాయి. కానీ బాలుడు బ్రతికే ఉంటాడన్న ఆశతో.. మొసలి మీద పడ్డారు గ్రామస్థులు. కడుపులో నుంచి ఆ మొసలి తమ బిడ్డను బయటకు విడిచిపెట్టేంత వరకు దానిని వదలమని తేల్చిచెప్పారు. ఈ క్రమంలో అక్కడి వాతావరణ వేడెక్కింది. ఈ వ్యవహారాన్ని చూసేందుకు స్థానిక ప్రజలంతా అక్కడికి వెళ్లారు.

పోలీసులు తీవ్రంగా శ్రమించి.. గ్రామస్థుల చెర నుంచి మొసలిని విడిపించారు.

సంబంధిత కథనం