IRCTC : డబ్బు లేకపోయినా రైలు టికెట్లు బుక్ చేసుకోవచ్చు.. ఇప్పుడే బుక్ చేసుకోండి.. తర్వాత చెల్లించండి-book indian railways train ticket without paying money know irctc book now pay later scheme details ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Irctc : డబ్బు లేకపోయినా రైలు టికెట్లు బుక్ చేసుకోవచ్చు.. ఇప్పుడే బుక్ చేసుకోండి.. తర్వాత చెల్లించండి

IRCTC : డబ్బు లేకపోయినా రైలు టికెట్లు బుక్ చేసుకోవచ్చు.. ఇప్పుడే బుక్ చేసుకోండి.. తర్వాత చెల్లించండి

Anand Sai HT Telugu Published Feb 19, 2025 09:57 AM IST
Anand Sai HT Telugu
Published Feb 19, 2025 09:57 AM IST

IRCTC Pay Later : ఖాతాలో డబ్బు లేకుండానే రైలు టిక్కెట్లు బుక్ చేసుకునే సౌకర్యం కూడా ఉంది. ఈ విషయం రెగ్యూలర్‌గా రైలు ప్రయాణం చేసేవారికి ఎంతగానో ఉపయోగపడుతుంది. మీరు కూడా బుక్ నౌ.. పే లేటర్ ద్వారా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.

రైల్వే బుక్ నౌ.. పే లేటర్
రైల్వే బుక్ నౌ.. పే లేటర్

దేశంలో ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులు రైళ్లలో వెళ్తుంటారు. రైలు ప్రయాణం అందరిక సౌకర్యవంతంగా ఉంటుంది. అంతేకాదు.. చాలా తక్కువ ధరలో మీ గమ్యస్థానాన్ని చేరుకోవచ్చు. ప్రయాణికుల సౌలభ్యం కోసం భారతీయ రైల్వే ఎప్పటికప్పుడు కొత్త రూల్స్, స్కీమ్స్ తీసుకొస్తుంది. కొన్ని రోజుల కిందట బుక్ నౌ.. పే లేటర్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. దీని కింద ప్రయాణికులు వెంటనే డబ్బులు చెల్లించకుండా రైలు టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. తరువాత డబ్బులు చెల్లించవచ్చు.

చాలా మందికి ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే కొన్నిసార్లు డబ్బులు ఉండకపోవచ్చు. దీనితో ప్రయాణం క్యాన్సిల్ అవ్వొచ్చు. అలాంటివారికి ఇకపై టెన్షన్ లేదు. ఐఆర్‌సీటీసీ అందించే.. బుక్ నౌ పే లేటర్ ద్వారా మీరు ఈజీగా రైలు టికెట్ బుక్ చేయవచ్చు. క్రెడిట్ కార్డులను ఉపయోగించకూడదనుకునే వారికి లేదా నెలాఖరులో బడ్జెట్ సమస్యలను ఎదుర్కొనే వారికి ఈ సౌకర్యం చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

భారతీయ రైల్వేల ఈ సౌకర్యం క్రెడిట్ కార్డ్ లాగా పనిచేస్తుంది. ముందుగా మీరు టికెట్ బుక్ చేసుకుని నిర్దిష్ట వ్యవధిలోపు చెల్లించాలి. ఈ పథకంలో ప్రయాణికులు టికెట్ బుక్ చేసుకున్న వెంటనే చెల్లించాల్సిన అవసరం లేదు. 14 రోజుల గ్రేస్ పీరియడ్ ఇస్తారు. ఆ సమయంలోపు చెల్లించాల్సి ఉంటుంది..

భారతీయ రైల్వే ఈ సౌకర్యం ఆన్‌లైన్‌లో టిక్కెట్లు బుక్ చేసుకునే ప్రయాణికులకు మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చింది. మీరు ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా టిక్కెట్లను బుక్ చేసుకోవడం ద్వారా ఈ ఆప్షన్ ఎంచుకోవచ్చు.

ఎలా బుక్ చేయాలి?

ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్‌లోకి లాగిన్ అవ్వండి. రైలు టికెట్ బుకింగ్ ప్రక్రియను ప్రారంభించి.. ఇప్పుడే బుక్ చేసుకోండి, తర్వాత చెల్లించండి.. ఆప్షన్ ఎంచుకోండి. ఈ సౌకర్యం కోసం www.epaylater.in ని సందర్శించడం ద్వారా నమోదు చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీకు పే లేటర్ అనే ఆప్షన్ వస్తుంది. దీని ద్వారా ముందస్తుగా చెల్లించకుండానే టికెట్స్ బుక్ చేసుకోవచ్చు.

టికెట్ బుక్ చేసుకున్న తర్వాత మీ రిజిస్టర్డ్ ఇమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్‌కు చెల్లింపు లింక్ వస్తుంది. మీరు 14 రోజుల్లోపు చెల్లిస్తే మీకు అదనపు ఛార్జీ పడదు. 14 రోజుల్లోపు చెల్లింపు చేయకపోతే 3.5 శాతం సేవా రుసుము వసూలు చేస్తారు. వెంటనే ప్రయాణించాలని ప్లాన్ చేసుకుని, ఖాతాలో డబ్బులు లేని వారికి ఈ ప్లాన్ ఉపయోగపడుతుంది.

Anand Sai

eMail
Whats_app_banner
జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.