BMW X4 M Sport 50 jahre M edition : బీఎండబ్ల్యూ నుంచి మరో స్పెషల్​ ఎడిషన్- ధర ఎంతంటే..-bmw x4 m sport 50 jahre m edition launched in india price and more ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Bmw X4 M Sport 50 Jahre M Edition Launched In India: Price And More

BMW X4 M Sport 50 jahre M edition : బీఎండబ్ల్యూ నుంచి మరో స్పెషల్​ ఎడిషన్- ధర ఎంతంటే..

Sharath Chitturi HT Telugu
Sep 09, 2022 01:12 PM IST

BMW X4 M Sport 50 jahre M edition : బీఎండబ్ల్యూ నుంచి మరో స్పెషల్​ ఎడిషన్​ కారు ఇండియాలో లాంచ్​ అయ్యింది. ఆ వివరాల మీ కోసం..

బీఎండబ్ల్యూ నుంచి మరో స్పెషల్​ ఎడిషన్​.. ధర ఎంతంటే..
బీఎండబ్ల్యూ నుంచి మరో స్పెషల్​ ఎడిషన్​.. ధర ఎంతంటే.. (BMW)

BMW X4 M Sport 50 jahre M edition : బీఎండబ్ల్యూ ఎక్స్​4 ఎం స్పోర్ట్​ 50 జహ్రే ఎం ఎడిషన్​.. ఇండియాలో లాంచ్​ అయ్యింది. ఈ వాహనం ఎక్స్​షోరూం ధర.. పెట్రోల్​ వేరియంట్​కి రూ. 72.90లక్షలుగా ఉంది. ఇక డీజిల్​ వేరియంట్​కి ఈ కారు ధర రూ. 74.90లక్షలు.

ట్రెండింగ్ వార్తలు

M340i, 530i M Sport, 630i M Sport, M4 Competition, X7 40i M Sport.x తర్వాత.. బీఎండబ్ల్యూ నుంచి వస్తున్న స్పెషల్​ ఎడిషనే ఈ BMW X4 M Sport 50 jahre M edition.

ఎం డివిజన్​ 50వ వార్షికోత్సవానికి చిహ్నంగా.. మరో నాలుగు BMW 50 jahre M editions ను ఇండియాలో ఆవిష్కరించనుంది ఈ జర్మనీ ఆటోమేకర్​ సంస్థ.

BMW X4 M Sport 50 jahre M edition ఫీచర్స్​..

ఈ BMW X4 M Sport 50 jahre M editionలో 256హెచ్​పీ, 620ఎన్​ఎం పవర్​ జెనరేట్​ అవుతుంది. 6 సిలిండర్​ టర్బో డీజిల్​ ఇంజిన్​ ఇందులో ఉంటుంది.

డీజిల్​ వేరియంట్​లో.. 0-100కేపీహెచ్​ని కేవలం 5.8సెకన్లలో అందుకోవడం విశేషం. పెట్రోల్​ వేరియంట్​కి అది 6.6 సెకన్లుగా ఉంది.

BMW X4 M Sport 50 jahre M edition లో ఎయిరోడైనమిక్​ ప్యాకేజీలు ఉన్నాయి. అంటే.. ఈ కారు ఫ్రంట్​, రేర్​, స్కిడ్​ ప్లేట్స్​తో సైడ్​ సిల్స్​ ఉంటాయి. ఈ ఎస్​యూవీ.. బ్లాక్​ సఫైర్​, ఎం బ్రొక్లిన్​ గ్రే మెటాలిక్​ రంగుల్లో అందుబాటులో ఉండనుంది.

ఈ కారులో ఎం బ్యాడ్జీ ఫ్రంట్​, రేర్​, హబ్​ క్యాప్స్​పై ఉంటుంది. బ్లూ, వైలెట్​, రెడ్​ రంగుల్లో చాలా ప్రత్యేకంగా డిజైన్​ చేశారు దీనిని.

ఇక ఇంటీరియర్స్​ విషయానికొస్తే.. ఈ బీఎండబ్ల్యూ ఎక్స్​4లో వెరెస్కా అప్​హోలస్ట్రీ స్పోర్ట్​ సీట్స్​ ఉంటాయి. 12.3 ఇంచ్​ డిస్​ప్లే, ఇంఫోటైన్​మెంట్​, పానోరామిక్​ సన్​రూఫ్​, 16 స్పీకర్​ హర్మన్​ కర్దాన్​ సౌండ్​ సిస్టమ్​, వైరలెస్​ యాపిల్​ కార్​ప్లే/ ఆండ్రాయిడ్​ ఆటో ఫీచర్స్​ ఇందులో ఉంటాయి.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్