Space Tourism : వ్యోమనౌకలో 106 కిలోమీటర్లు ఎత్తుకు ఆరుగురు మహిళలు.. మళ్లీ స్పేస్ టూరిజంపై చర్చ!-blue origin completes space trip featuring all female crew again discussion on space tourism ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Space Tourism : వ్యోమనౌకలో 106 కిలోమీటర్లు ఎత్తుకు ఆరుగురు మహిళలు.. మళ్లీ స్పేస్ టూరిజంపై చర్చ!

Space Tourism : వ్యోమనౌకలో 106 కిలోమీటర్లు ఎత్తుకు ఆరుగురు మహిళలు.. మళ్లీ స్పేస్ టూరిజంపై చర్చ!

Anand Sai HT Telugu

Space Tourism : స్పేస్ టూరిజం గురించి ఎప్పటి నుంచో చర్చ ఉంది. ఈ కలను సామాన్యులకు చేరువ చేసేందుకు బ్లూ ఆరిజిన్ అంతరిక్షంలో ప్రత్యేక మిషన్‌ను ప్రవేశపెట్టే ఆలోచనలో ఉందని తెలుస్తోంది.

ఆరుగురు మహిళల యాత్ర (REUTERS)

అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌కు చెందిన బ్లూ ఆరిజన్ సంస్థ మరో అంతరిక్ష ప్రయోగాన్ని చేపట్టింది. బెజో‌స్‌కు కాబోయే సతీమణి లారెన్ శాంచెజ్, ప్రపంచవ్యాప్తంగా తన పాప్ షోల ద్వారా ప్రజలను ఊర్రూతలుగించిన కేటీ పెర్రీ, జర్నలిస్ట్ గేల్ కింగ్.. ఇలా మెుత్తం ఆరుగురు మహిళలు అంతరిక్ష యాత్రను పూర్తి చేశారు.

10 నిమిషాలు

బ్లూ ఆరిజిన్‌కు చెందిన న్యూ షెపర్డ్ రాకెట్ ద్వారా ఆరుగురు మహిళలు పైకి వెళ్లారు. ఈ మిషన్ కేవలం 10 నిమిషాలు మాత్రమే జరిగింది. వ్యోమనౌకలో భూ ఉపరితలానికి సుమారు 106 కిలోమీటర్లు ఎత్తుకు వెళ్లారు. ఈ సమయంలో జీరో గ్రావిటీని అనుభవించిన తరువాత భూమికి తిరిగి వచ్చారు. ఈ మిషన్ వెలుగులోకి రాగానే మరోసారి స్పేస్ టూరిజంపై చర్చలు మొదలయ్యాయి.

స్పేస్ టూరిజానికి సంబంధించి కొన్నేళ్లుగా చర్చ నడుస్తోంది. బ్లూ ఆరిజిన్, స్పేస్ ఎక్స్, వర్జిన్ గెలాక్టిక్ వంటి కంపెనీలు ఈ జాబితాలో ముందున్నాయి. అయితే స్పేస్ టూరిజం గురించి ఇప్పటికీ ప్రజల మదిలో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇది సురక్షితమేనా? ఎవరైనా స్పేస్ వాక్‌కు వెళ్లవచ్చా? మరీ ముఖ్యంగా దీని కోసం ఎంత డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది?

స్పేస్ టూరిజాన్ని సులభతరం చేసే కంపెనీలు ఎఫ్ఏఏ నిర్దేశించిన కఠినమైన భద్రతా ప్రమాణాలను పాటించాలి. అదే సమయంలో ప్రయాణికులు ప్రమాదాలను అంగీకరిస్తూ పలు ఒప్పందాలపై సంతకాలు చేయాల్సి ఉంటుంది. మొత్తమ్మీద ఇందులో ప్రమాదం పొంచి ఉన్నా ఇది కాస్త సాహస క్రీడలా ఉంటుంది.

శిక్షణ అవసరమా?

అంతరిక్ష యాత్రకు వెళ్లడానికి అనేక రకాల శిక్షణ అవసరం. ఇది కంపెనీపై కూడా ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు, వర్జిన్ గెలాక్టిక్‌తో పర్యటనకు వెళ్ళడానికి మూడు రోజుల శిక్షణ ఉంది. అదే సమయంలో వరల్డ్ వ్యూ ఎంటర్‌ప్రైజెస్‌కు బెలూన్ ట్రిప్పులకు యాంటీ గ్రావిటీ ట్రైనింగ్ అవసరం లేదు. మార్స్ వన్‌లో రిజిస్టర్ చేసుకున్న వారికి ఎనిమిదేళ్ల పాటు శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది.

స్పేస్ టూరిజం

అంతరిక్ష యాత్రకు వెళ్లడం ప్రస్తుతం చాలా ఖరీదైనది. ఇది కంపెనీ, మీ అనుభవాన్ని మెరుగుపరచడానికి అందించే ఫీచర్లపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు జీరో-జీ వెయిట్లెస్ ఎక్స్పీరియన్స్‌కు 4,950 డాలర్లు ఖర్చు అవుతుంది. అయితే వర్జిన్ గెలాక్టిక్‌తో ప్రయాణానికి 250,000 డాలర్ల వరకు ఖర్చు అవుతుంది. అదే సమయంలో స్పేస్ఎక్స్ డ్రాగన్ స్పేస్ ట్రిప్‌కు ఒక వ్యక్తికి 20 మిలియన్ డాలర్లు ఖర్చవుతుంది.

Anand Sai

eMail

సంబంధిత కథనం

టాపిక్

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.