ఆకాశంలో అరుదైన దృశ్యం బ్లాక్ మూన్.. భారత్‌లో ఎప్పుడు చూడాలి? చంద్రుడు నిజంగానే నల్లగా కనిపిస్తాడా?
Black Moon : ఆకాశంలో అరుదైన చంద్రుడు కనిపించబోతున్నాడు. బ్లాక్ మూన్ దర్శనమివ్వనుంది. దీనికి గల కారణాలు ఏంటి? ఎందుకు బ్లాక్ మూన్ అని పిలుస్తారో తెలుసుకుందాం..
2024 సంవత్సరం ముగియడానికి దగ్గరలో ఉన్నాం.. డిసెంబర్ 30వ తేదీ రాత్రి ఆకాశంలో అరుదైన దృశ్యం కనిపించనుంది. అవును ఈ రాత్రి అంతరిక్ష ప్రపంచంలో అపూర్వమైన ఖగోళ ఘట్టం జరగనుంది. చాలా మంది దీని గురించి ఎప్పుడూ విని ఉండరు. బ్లూ మూన్, సూపర్ మూన్‌లాంటి పదాలు విని ఉంటారు. కానీ డిసెంబర్ 30న సోమవతి అమావాస్య రాత్రి ప్రజలు బ్లాక్ మూన్ చూస్తారు .
ఇది ఈ నెలలో రెండో అమావాస్య అవుతుంది. ఈ రాత్రి బ్లాక్ మూన్ వచ్చినప్పుడు ఆకాశంలో నల్లటి రంగు కనిపిస్తుంది. అటువంటి పరిస్థితిలో ఈ రాత్రి నక్షత్రాలు, గ్రహాలను చూడటానికి చాలా ప్రత్యేకమైన రాత్రి అవుతుంది. శాస్త్రవేత్తలతో పాటు నక్షత్రాలు, గ్రహాలను చూడడానికి ఇష్టపడే వారికి గొప్ప రాత్రిగా ఉంటుంది.
నివేదికల ప్రకారం.. బ్లాక్ మూన్ అంటే చంద్రుని రంగు నల్లగా మారుతుందని కాదు. ఈ రాత్రి చంద్రునిలో కొంత భాగాన్ని కనిపించేలా చేస్తుంది. దీంతో చంద్రుడు నల్లగా ఉన్నట్టుగా కనిపిస్తాడు. చీకటి ఎక్కువగా కనిపించడం కారణంగా తక్కువ కాంతితో మనం నక్షత్రాలు, గ్రహాలను చూడగలం. చంద్రుడు, సూర్యుడు ఒక దిశలో సమాంతరంగా ఉన్నప్పుడు మూన్ భూమికి ప్రకాశవంతంగా కనిపించదు. సూర్యుడికి ఎదురుగా ఉండటం వల్ల దానిపై కాంతి పడదు. దీంతో ఆ రాత్రి బ్లాక్ మూన్ ఏర్పడుతుందని చెబుతారు. ఇది అధికారిక పదం కాదు.. కానీ చాలా మంది దీనిని వాడుతారు. ఈ రాత్రి ఆకాశంలో చీకటి స్పష్టంగా కనిపిస్తుంది.
నెలలో మొదటి రోజున అమావాస్య వస్తే ఆ నెలాఖరులోపు మరో చంద్రుడు దర్శనమిచ్చే అవకాశం ఉంది. దానిని బ్లాక్ మూన్ అంటారు. ఖగోళ శాస్త్రంలో బ్లాక్ మూన్ అధికారిక పదం కానప్పటికీ, ఖగోళ శాస్త్రవేత్తలు దీనిని ప్రత్యేకంగా భావిస్తారు. చంద్రుడు, సూర్యుడు ఒకే దిశలో ఆకాశంలో ఒకే స్థితిలో ఉన్నప్పుడు అమావాస్య ఏర్పడుతుంది. పౌర్ణమిలో వచ్చే బ్లూ మూన్‌లాగే ఇది కూడా అన్నమాట.
US నావల్ అబ్జర్వేటరీ ప్రకారం, డిసెంబర్ నెలలో ఈ రెండో అమావాస్య డిసెంబర్ 30, 2024న సాయంత్రం 5:27 pm ET (2227 GMT)కి ఉదయిస్తుంది. భారతదేశంలో బ్లాక్ మూన్ డిసెంబర్ 31 తెల్లవారుజామున 3:57 గంటలకు గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. ఈ సమయంలో మనం చూడవచ్చు. డిసెంబర్ 30న అమెరికాలో బ్లాక్ మూన్ కనిపించనుంది. డిసెంబరు 31న యూరప్, ఆఫ్రికా, ఆసియాలో బ్లాక్ మూన్ కనిపిస్తుంది.
టాపిక్