Delhi mayor election : బీజేపీ- అప్ 'కొట్లాట'.. ఢిల్లీ మేయర్ ఎన్నిక వాయిదా!
Delhi mayor election : శుక్రవారం జరగాల్సిన ఢిల్లీ మేయర్ ఎన్నిక వాయిదా పడింది. కొత్తగా ఎంపికైన కౌన్సిలర్ల మధ్య గొడవ జరగడం ఇందుకు కారణం.
Delhi Mayor elections 2023 : ఢిల్లీ మేయర్ ఎన్నికల నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణ నెలకొంది. ఆమ్ ఆద్మీ- బీజేపీ పార్టీకి చెందిన కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్లు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు! ఫలితంగా ఢిల్లీ మేయర్ ఎన్నిక ప్రక్రియ వాయిదా పడింది.
ఇదీ జరిగింది..
డిసెంబర్లో జరిగిన ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ చారిత్రక విజయం సాధించింది. దశాబ్ద కాలంలో తొలిసారిగా ఇక్కడ బీజేపీ ఓడిపోయింది!
ఎన్నికల ఫలితాలు వెలువడిన కొన్ని రోజులకు.. నామినేటెడ్ సభ్యుల జాబితాను ప్రకటించారు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా. ఆయన చర్యలను ఆప్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఢిల్లీ ప్రభుత్వంతో సంప్రదించకుండానే.. నామినేటెడ్ సభ్యులను ఎలా ప్రకటిస్తారని మండిపడింది. లెఫ్టినెంట్ గవర్నర్ ఎంపిక చేసిన మొత్తం 10మందికి బీజేపీతో సంబంధం ఉందని ఆరోపించింది.
Delhi Mayor election live updates : మరోవైపు.. తాత్కాలిక స్పీకర్‌గా బీజేపీకి చెందిన సత్య శర్మను ఎంపిక చేశారు లెఫ్టినెంటర్ గవర్నర్. ఆప్ సూచించిన అత్యంత సీనియర్ ముకేశ్ గోయల్‌ను పక్కనపెట్టడం తీవ్ర చర్చకు దారితీసింది. బీజేపీకి మేయర్ పదవిని అక్రమంగా కట్టబెట్టేందుకు లెఫ్టినెంట్ గవర్నర్ ప్రయత్నిస్తున్నట్టు ఆరోపించింది ఆప్.
కాగా.. ఢిల్లీ మేయర్‌ను ఎన్నుకునేందుకు.. సివిక్ సెంటర్లో కొత్తగా ఎంపికైన కౌన్సిలర్లు శుక్రవారం సమావేశమయ్యారు. ఆప్ అభ్యర్థి షెల్లి ఒబేరాయ్, బీజేపీ అభ్యర్థి రేఖ గుప్తల్లో ఒకరిని ఎన్నుకోవాల్సి ఉంది. అయితే.. తాత్కాలిక స్పీకర్‌గా ప్రమాణం చేసిన సత్య శర్మ.. నామినేటెడ్ సభ్యులను ప్రమాణస్వీకారం కోసం పిలిపించారు. ఇక్కడే సభలో గందరగోళం నెలకొంది. నామినేటెడ్ సభ్యులను ఆప్ కౌన్సిలర్లు అడ్డుకున్నారు. ముందుగా.. ఎన్నికైన కౌన్సిలర్లతో ప్రమాణ స్వీకారం చేయించాలని డిమాండ్ చేశారు. అదే ఆనవాయతీ అని గుర్తుచేశారు. ఈ క్రమంలో బీజేపీ- ఆప్ మధ్య ఘర్షణపూరిత వాతావరణ నెలకొంది.
BJP vs AAP Delhi Mayor election : ప్రధాని మోదీ- ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా ఇరు వర్గాలు భారీ ఎత్తున నినాదాలు చేసుకున్నారు. ఓ సందర్భాల్లో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. కొందరు నేల మీద పడిపోయరు. ఈ నేపథ్యంలో మేయర్ ఎన్నిక ప్రక్రియ నిలిచిపోయింది. సభ వాయిదా పడింది.
ఎంసీడీ సభలో 250 మంది ఎలక్టెడ్ కౌన్సిలర్లు ఉంటారు. ఢిల్లీ తరఫున ఎన్నికైన ఏడుగురు లోక్‌సభ ఎంపీలు, ఆప్ తరఫున రాజ్యసభలో ఉన్న ముగ్గురు ఎంపీలు, ఢిల్లీ స్పీకర్ నామినేట్ చేసే 14మంది ఎమ్మెల్యేలు.. ఈ మేయర్ ఎన్నికలో పాల్గొంటారు.
Delhi Mayor election : 250 వార్డుల్లో 134 చోట గెలుపొందింది ఆప్. బీజేపీకి 104 సీట్లు దక్కాయి. కాంగ్రెస్ నుంచి 9మందే గెలిచారు. ఫలితంగా మేయర్ పదవికి పోటీ చేయకూడదని కాంగ్రెస్ నిర్ణయించుకుంది. బీజేపీ కూడా.. పోటీ చేయకూడదని పక్కకు తప్పుకుని.. చివరి నిమిషంలో బరిలో దిగింది.
సంబంధిత కథనం