Rahul | తోటి ఎంపీ షర్ట్ చింపేసిన రాహుల్ గాంధీ!; ఇదేం డ్రామా అంటూ బీజేపీ ఎద్దేవా
Rahul protests | ధరల పెరుగుదల, నిరుద్యోగం, జీఎస్టీ పెంపు తదితరాలపై కాంగ్రెస్ పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించింది. పార్లమెంటు సభ్యులు, కాంగ్రెస్ కార్యకర్తలు నలుపు రంగు దుస్తులు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ కి సంబంధించి ఒక ఆసక్తికర ఘటన జరిగింది.
Rahul Gandhi tears fellow MP shirt | రోడ్డుపై నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకుని, అదుపులోకి తీసుకుంటున్న సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలతో ఇప్పుడు బీజేపీ సోషల్ మీడియాలో ట్రోలింగ్ ప్రారంభించింది.
Rahul Gandhi tears fellow MP shirt | షర్ట్ చింపేశారు..
ధరల పెరుగుదల, నిరుద్యోగం, జీఎస్టీ పెంపు మొదలైన విషయాల్లో ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ కాంగ్రెస్ పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా శుక్రవారం ఢిల్లీలోని విజయ్ చౌక్ వద్ద పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ ఎంపీలు ధర్నా జరిపారు. ఆ సమయంలో వారిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఆ సమయంలో రాహుల్ గాంధీ పక్కన మరో ఎంపీ దీపేందర్ హూడా ఉన్నారు. దీపేందర్‌ను పోలీసులు లాక్కెళ్లడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఆయన చొక్కాను రాహుల్ గట్టిగా పట్టుకున్నారు. ఆ పెనుగులాటలో దీపేందర్ చొక్కా చినిగిపోయింది. ఆ తరువాత పోలీసులు రాహుల్ సహా అక్కడి వారందరినీ అదుపులోకి తీసుకున్నారు.
Rahul Gandhi tears fellow MP shirt | బీజేపీ ఎద్దేవా
సహ ఎంపీ దీపేందర్ హూడా చొక్కాను రాహుల్ గట్టిగా పట్టుకున్న ఫొటోను, ఆ ఘటనకు సంబంధించిన వీడియోను బీజేపీ వైరల్ చేసింది. రాహుల్ గాంధీ కావాలనే సహ, డ్రామా క్రియేట్ చేయడం కోసం ఎంపీ దీపేందర్ చొక్కాను చింపేశారని, ఇది రాహుల్ గాంధీ డ్రామా అని విమర్శలు చేసింది. అలాగే, మరో చోట ప్రియాంక గాంధీ మహిళా పోలీసులపై దురుసుగా ప్రవర్తించిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. గాంధీ కుటుంబంలోనే ఈ డ్రామా బాజీ ఉందని బీజేపీ ఐటీ వింగ్ ఇన్చార్జ్ అమిత్ మాలవీయ ట్వీట్ చేశారు. తమాషా పాలిటిక్స్‌కు వారు కేరాఫ్ అడ్రెస్‌గా మారారని విమర్శించారు.
Rahul Gandhi tears fellow MP shirt | రామ్ మందిరానికి లింక్..
కాంగ్రెస్ శుక్రవారం నిర్వహించిన నిరసనలపై బీజేపీ అగ్ర నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా వినూత్నంగా స్పందించారు. ఆగస్ట్ 5న వారు నల్ల దుస్తులతో నిరసన తెలపడం అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని వ్యతిరేకించడమేనని అమిత్ షా కొత్త వాదన తెరపైకి తెచ్చారు. విషయమేంటంటే.. 2020 ఆగస్ట్ 5న ప్రధాని మోదీ అయోధ్యలో రామమందిర నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఆ అంశంతో ప్రస్తుత కాంగ్రెస్ నిరసనలను లింక్ చేస్తూ అమిత్ షా విమర్శలు చేయడం విశేషం. దీనిపై కాంగ్రెస్ స్పందిస్తూ.. బీజేపీ చిల్లర రాజకీయాలకు ఈ విమర్శ పరాకాష్ట అని మండిపడింది.