PM Modi Video: ప్రధాని మోదీపై యానిమేటెడ్ వీడియో: 2007 నుంచి ఇప్పటి వరకు: ఇంట్రెస్టింగ్‍గా.. -bjp posts animated video on prime minister narendra modi journey ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Bjp Posts Animated Video On Prime Minister Narendra Modi Journey

PM Modi Video: ప్రధాని మోదీపై యానిమేటెడ్ వీడియో: 2007 నుంచి ఇప్పటి వరకు: ఇంట్రెస్టింగ్‍గా..

Chatakonda Krishna Prakash HT Telugu
Mar 16, 2023 08:05 AM IST

Prime Minister Narendra Modi Video: ప్రధాని నరేంద్ర మోదీ పొలిటికల్ జర్నీపై ఓ యానిమేటెడ్ వీడియోను బీజేపీ రూపొందించింది. ఈ నాలుగున్నర నిమిషాల వీడియోలో చాలా విషయాలను ప్రస్తావించింది.

PM Modi Video: ప్రధాని మోదీపై యానిమేటెడ్ వీడియో (Photo: BJP Twitter)
PM Modi Video: ప్రధాని మోదీపై యానిమేటెడ్ వీడియో (Photo: BJP Twitter)

Prime Minister Narendra Modi Video: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై ఓ యానిమేటెడ్ వీడియో(Animated Video)ను భారతీయ జనతా పార్టీ (Bharatiya Janata Party - BJP) విడుదల చేసింది. దేశంలోని వివిధ వర్గాలకు, రంగాలకు మేలు చూస్తూ మోదీ తన ప్రయాణాన్ని ఎలా కొనసాగిస్తున్నారో తెలిపేలా ఈ వీడియో ఉంది. మోదీ తీసుకొచ్చిన వివిధ పథకాలు, విధానాలను ఈ వీడియోలో బీజేపీ ప్రస్తావించింది. ప్రతిపక్షాల నుంచి వస్తున్న విమర్శలను, దూషణలను పక్కకు నెట్టి, దేశ ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్ డాలర్లకు చేర్చడమే లక్ష్యంగా మోదీ ముందుకు సాగుతున్నారనేలా ఈ యానిమేటెడ్ వీడియో రూపొందింది. 2007 నుంచి ఇప్పటి వరకు మోదీ జర్నీని ఈ వీడియో కళ్లకు కడుతోంది.

ట్రెండింగ్ వార్తలు

సీఎం టూ పీఎం

Prime Minister Narendra Modi Video: నేను ముందుకు సాగుతూనే ఉండాలి (Mujhe Chalte Jaana Hai) అనే పేరుతో ప్రధాని మోదీపై ఈ యానిమేటెడ్ వీడియోను బీజేపీ రూపొందించింది. మొత్తంగా ఈ వీడియో నాలుగు నిమిషాల 30 సెకన్ల నిడివి ఉంది. 2007లో గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ ఉండడం నుంచి నుంచి ప్రధాని కావడం, ఆ తర్వాత ఆయన పాలనను ఈ వీడియోలో బీజేపీ వివరించింది. కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మణిశంకర్ అయ్యర్, దిగ్విజయ్ సింగ్ దూషణలను ఎదుర్కొని ప్రధానిగా మోదీ ఎదిగారని వీడియోలో ఉంది.

Prime Minister Narendra Modi Video: ప్రధాని మోదీ తీసుకొచ్చిన పథకాలను, పేదలతో పాటు వివిధ వర్గాలకు, రంగాలకు చేసిన లబ్ధిని ఈ వీడియోలో బీజేపీ పేర్కొంది. రానున్న 2024 లోక్‍సభ ఎన్నికల గురించి వీడియోలో లేదు. అయితే, 2014, 2019 లోక్‍సభ ఎన్నికలను గెలిచిన ప్రస్తావన ఉంది. ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్‍ను తీర్చిదిద్దేందుకు మోదీ.. ముందుకుసాగుతున్నారని వీడియో చివర్లో ఉంది.

Prime Minister Narendra Modi Video: ప్రధాని కాకముందు వీసా నిరాకరించిన అమెరికా.. ఆ తర్వాత మోదీకి స్వాగతం పలికిందనేలా వీడియోలో ఉంది. అలాగే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు బరాక్, ఒబామా, బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ మోదీని ప్రశంసించిన విషయం ప్రస్తావన కూడా వీడియోలో ఉంది.

కరోనా గురించి..

Prime Minister Narendra Modi Video: కరోనా వైరస్‍‍ను దేశీయంగా తయారు చేసిన వ్యాక్సిన్‍తో ప్రధాని మోదీ ఎదుర్కొన్నారని తెలిపేలా వీడియోలో ఉంది. దేశీయంగా తయారు చేసిన వ్యాక్సిన్‍ సిరంజ్‍ను పట్టుకొని లోయపై తాడుపై మోదీ నడుస్తున్నట్టుగా యానిమేషన్‍ను సృష్టించింది బీజేపీ. విదేశీ వ్యాక్సిన్లను నిరాకరించి.. దేశీయ వ్యాక్సిన్‍తోనే కరోనా నుంచి దేశాన్ని మోదీ కాపాడారనేలా ఈ వీడియోలో ఉంది. తాజాగా బీసీసీ డాక్యుమెంటరీ వివాదాన్ని కూడా ఈ వీడియోలో ఉంచింది బీజేపీ.

ఈ వీడియోను అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా బీజేపీ పోస్ట్ చేసింది. పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ ప్రధాన నేతలు కూడా ఈ వీడియోను ట్వీట్ చేశారు.

WhatsApp channel

సంబంధిత కథనం