BJP minister praises RahulGandhi: వ్హాట్..? రాహుల్ గాంధీని బీజేపీ చీఫ్ పొగిడారా?-bjp minister praises rahul gandhi s london photo says manna padega ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Bjp Minister 'Praises' Rahul Gandhi's London Photo, Says 'Manna Padega...'

BJP minister praises RahulGandhi: వ్హాట్..? రాహుల్ గాంధీని బీజేపీ చీఫ్ పొగిడారా?

HT Telugu Desk HT Telugu
Mar 09, 2023 10:35 AM IST

కాంగ్రెస్ సీనియర్ నేత, పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఊహించిన వ్యక్తి నుంచి ప్రశంసలు లభించాయి.

రాహుల్ గాంధీ
రాహుల్ గాంధీ

రాజకీయ రంగంలో ప్రధాన వైరి పక్షాలైన బీజేపీ (BJP), కాంగ్రెస్ (Congress) ల మధ్య మాటల యుద్ధాలు మామూలే. కానీ, అప్పుడప్పుడు కాస్త చేంజ్ కోసమా అన్నట్లు ప్రశంసలు, పొగడ్తలు వినిపిస్తుంటాయి. అలాంటి అరుదైన విషయమే ఇది..

ట్రెండింగ్ వార్తలు

'Manna padega...: ఒప్పుకుని తీరాల్సిందే..

కాంగ్రెస్ సీనియర్ నేత, పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) యూకే పర్యటనలో భాగంగా కేంబ్రిడ్జ్ వర్సిటీ లో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రసంగించారు. అక్కడ ఉన్న వివిధ వర్గాల భారతీయులను కలుసుకున్నారు. అవకాశం లభించిన ప్రతీ సందర్భంలో భారత్ లో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై, ప్రధాని మోదీ (PM Modi) పై విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ ఆరోపణలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. విదేశీ గడ్డపై రాహుల్ గాంధీ భారత్ ను అవమానిస్తున్నారని మండి పడింది. వీటన్నింటి మధ్య.. బీజేపీ మంత్రి ఒకరు రాహుల్ గాంధీని ప్రశంసిస్తూ ‘ఒప్పుకుని తీరాల్సిందే..('Manna padega...')’ అంటూ చేసిన ఒక వ్యాఖ్య వైరల్ గా మారింది.

Rahul Photo: రాహుల్ ఫొటోపై..

రాహుల్ గాంధీ లండన్ లోని చాటమ్ హౌజ్ లో జరిగిన ఒక కార్యక్రమానికి అటెండ్ అయిన సందర్భంగా దిగిన ఒక ఫొటోను కాంగ్రెస్ పార్టీ తన అధికారిక ట్విటర్ (twitter) హ్యాండిల్ లో షేర్ చేసింది. ఒంటరిగానైనా సరే, నమ్మినవాటి కోసం నిలబడాల్సిందే’ అన్న క్యాప్షన్ తో ట్రిమ్ చేసిన గడ్డంతో సూట్ ధరించి, జేబుల్లో చేతులు పెట్టుకుని రాహుల్ గాంధీ నిల్చున్న ఆ ఫొటోను కాంగ్రెస్ షేర్ చేసింది. ఆ ఫొటో క్షణాల్లో వైరల్ గా మారింది. ఆ ఫొటోను ప్రశంసిస్తూ, కాంగ్రెస్ నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున కామెంట్స్ చేశారు. అయితే, అనూహ్యంగా ఒక బీజేపీ సీనియర్ నేత నుంచి కూడా ఆ ఫొటోకు ప్రశంసలు రావడం అందరినీ ఆశ్చర్య పరిచింది. నాగాలాండ్ బీజేపీ మంత్రి, ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ తెమ్జెన్ ఇమ్నా అలంగ్ (Temjen Imna Along) కూడా రాహుల్ గాంధీ ఫొటోను ప్రశంసిస్తూ కామెంట్ చేశారు. ‘ఫొటో చాలా బావుంది. ఆ విషయం ఎవరైనా ఒప్పుకుని తీరాల్సిందే. ఎంతో ఆత్మ విశ్వాసంతో కనిపిస్తున్నట్లున్న ఈ ఫొటో నెక్స్ట్ లెవెల్’అని కామెంట్ చేశారు. అయితే, ఆ కామెంట్ చేసిన మర్నాడు, ఆ నాయకుడు ‘ఆ కామెంట్ రాహుల్ ను పొడుగుతూ చేసింది కాదు’ అంటూ మాట మార్చారు.

IPL_Entry_Point