భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సంస్థాగతంగా భారీ మార్పులకు సిద్ధమవుతోంది! ఆరు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో స్థానిక యూనిట్ల అధ్యక్షుల నియామకం పూర్తయిన తర్వాత, ఇప్పుడు పార్టీకి చెందిన జాతీయ అధ్యక్షుడి నియామకంపై బీజేపీ దృష్టి సారించింది.
2020 నుంచి జేపీ నడ్డా బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన పదవీకాలం 2023లో ముగిసినప్పటికీ, లోక్‌సభ ఎన్నికల్లో పార్టీని నడిపించేందుకు దానిని 2024 వరకు పొడిగించారు. ఈ కీలక పదవిని ఎవరు చేపడతారనే సస్పెన్స్ ప్రస్తుతం కొనసాగుతున్నప్పటికీ, పార్టీకి తొలిసారిగా మహిళా అధ్యక్షురాలు ఎంపికయ్యే అవకాశం ఉందని లైవ్ హిందుస్థాన్‌కు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అంతేకాదు, అధ్యక్ష రేసులో ఏపీ కీలక నేత పురంధేశ్వరి సహా పలువురు ప్రముఖుల పేర్లు వినిపిస్తున్నాయి.
బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత, 2019 నుంచి నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పార్టీలో అత్యంత ప్రభావవంతమైన మహిళా నాయకురాళ్లలో ఒకరిగా ఉన్న ఆమె, బీజేపీ అధ్యక్ష పదవికి ప్రధాన పోటీదారుల్లో ఒకరిగా కనిపిస్తున్నారు. దక్షిణాదిలో పార్టీ విస్తరణకు బీజేపీ ప్రయత్నిస్తున్న నేపథ్యంలో, తమిళనాడుకు చెందిన నిర్మలకు ఇది ఒక సానుకూల అంశం కావచ్చు. ఇటీవల ఆమె పార్టీ ప్రధాన కార్యాలయంలో జేపీ నడ్డా, బీజేపీ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌తో సమావేశమయ్యారు.
2. డీ. పురందేశ్వరి
గతంలో బీజేపీ ఆంధ్రప్రదేశ్ యూనిట్ అధ్యక్షురాలిగా పనిచేసిన డీ. పురందేశ్వరి కూడా జాతీయ అధ్యక్ష పదవి రేసులో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. యునైటెడ్ కింగ్‌డమ్, ఫ్రాన్స్, జర్మనీ, ఈయూ, ఇటలీ, డెన్మార్క్‌లో దేశ ఉగ్రవాద వ్యతిరేక వైఖరిని తెలియజేసిన 'ఆపరేషన్ సింధూర్' ప్రభుత్వ ప్రతినిధి బృందంలో పురంధేశ్వరి సభ్యురాలిగా ఉన్న విషయం తెలిసిందే.
3. వనతి శ్రీనివాసన్
వనతి శ్రీనివాసన్ బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలిగా పనిచేశారు. 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో.. నటుడు- మక్కల్ నీది మైయం (ఎంఎన్ఎం) వ్యవస్థాపకుడు కమల్ హాసన్‌ను ఓడించి, తమిళనాడులోని కోయంబత్తూర్ (దక్షిణ) స్థానం నుంచి వనతి గెలుపొందారు. ఆమె 1993 నుంచి బీజేపీతో అనుబంధం కలిగి ఉన్నారు. 2022లో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీలో సభ్యురాలిగా చేరారు.
మహిళా ఓటర్లను ప్రభావితం చేయడంలో ఇటీవలి కాలంలో బీజేపీ విజయం సాధించింది. ఇదే పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి ఒక మహిళను నియమించడానికి గల కారణాల్లో ఒకటి కావచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి.
దీంతో పాటు 2023లో బీజేపీ మహిళా రిజర్వేషన్ బిల్లును ముందుకు తెచ్చింది. ఇది పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం పొందింది. ఈ బిల్లు ప్రకారం లోక్‌సభ- రాష్ట్ర శాసనసభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలి. పార్టీకి ఒక మహిళా అధ్యక్షురాలిని నియమించడం ద్వారా బీజేపీ ఈ బిల్లుకు కట్టుబడి ఉందనే సందేశాన్ని ప్రజల్లోకి పంపవచ్చు. రానున్న వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఈ ఇమేజ్ ఉపయోగపడుతుంది.
సంబంధిత కథనం