Telugu News  /  National International  /  Bitcoin Price Crashes Today Latest Updates On 13th June 2022 In Telugu
పతనం దిశగా క్రిప్టోకరెన్సీలు
పతనం దిశగా క్రిప్టోకరెన్సీలు (REUTERS)

Bitcoin price today : 18 నెలల కనిష్టానికి బిట్‌కాయిన్.. 25,366 డాలర్లకు పతనం

13 June 2022, 8:48 ISTHT Telugu Desk
13 June 2022, 8:48 IST

బిట్‌కాయిన్ వరుస పతనం మదుపరులను బెంబేలెత్తిస్తోంది. ఏడు నెలల క్రితం 69 వేల డాలర్లు ఉన్న బిట్‌కాయిన్ ఇప్పుడు 25,366 డాలర్లకు పతనమైంది.

క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్ విలువ సుమారు 4.6 శాతం పడిపోయి 18 నెలల కనిష్టానికి పతనమైంది. బిట్ కాయిన్ విలువ సోమవారం 25,366 డాలర్లకు పడిపోయింది. అలాగే మరో ప్రముఖ క్రిప్టోకరెన్సీ కూడా 6.5 శాతం పడిపోయింది. ఇది 15 నెలల కనిష్టానికి పడిపోయి 1340 డాలర్ల వద్ద స్థిరపడింది.

ట్రెండింగ్ వార్తలు

యూఎస్ ద్రవ్యోల్బణ రేటు భారీగా పెరగడం సెంటిమెంట్‌ను ప్రేరేపించిన నేపథ్యంలో క్రిప్టోకరెన్సీలు బాగా పతనమవడం ప్రారంభించాయి. బిట్‌కాయిన్ మే 12 నుంచి వరుసగా ఏడో రోజూ నష్టాలు చవిచూసింది. 

అత్యంత జనాదరణ పొందిన ఈ క్రిప్టో కరెన్సీ ఈ సంవత్సరం ఇప్పటివరకు 43% కంటే ఎక్కువగా పడిపోయింది. గత ఏడాది నవంబర్‌లో దాని రికార్డు గరిష్ట స్థాయి 69,000 డాలర్లుగా ఉండేది. 

అంతర్జాతీయంగా ద్రవ్యోల్భణ పరిస్థితులు ఇప్పటికే ఈక్విటీ మార్కెట్లను అతలాకుతలం చేయగా.. ఇప్పుడు క్రిప్టోకరెన్సీ మార్కెట్లను కూడా అనిశ్చితిలోకి నెట్టివేశాయి. క్రిప్టోకరెన్సీలో పెట్టుబడిన పెట్టినవారు భారీగా నష్టపోతున్నారు.

ఈరోజు ప్రపంచ క్రిప్టోకరెన్సీ మార్కెట్ క్యాప్ 1.08 ట్రిలియన్ డాలర్ల మేర తగ్గింది. గత 24 గంటల్లో 8% కంటే ఎక్కువ తగ్గింది.

స్టెల్లార్, యూనిస్వాప్, ఎక్స్‌ఆర్‌పి, ట్రోన్, టెథర్, సోలానా, పోల్‌కాడోట్, అవలాంచ్, పాలిగాన్, చైన్‌లింక్, టెర్రా లూనా క్లాసిక్, కార్డానో, లిట్‌కాయిన్ ధరలు గతంలో  కంటే 15% తగ్గింపుతో ట్రేడ్ అవుతున్నందున ఇతర క్రిప్టో కరెన్సీల విలువ కూడా పతనమవుతూ వస్తోంది.

అమెరికా ద్రవ్యోల్బణం తాజాగా 40 ఏళ్ల గరిష్ట స్థాయికి చేరుకుందని శుక్రవారం గణాంకాలు వెల్లడైన తర్వాత ఫెడరల్ రిజర్వ్ మరింత దూకుడుగా వ్యవహరిస్తుందని ట్రేడర్లు అంచనా వేస్తున్నారు. ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడానికి ఫెడరల్ రిజర్వ్ ఉద్దీపనలను ఉపసంహరించుకోవడం, రేట్లు పెంచడంతో ఈ సంవత్సరం క్రిప్టోకరెన్సీ ధరలు పతనమవుతూ వస్తున్నాయి.

అయితే బ్లాక్‌చెయిన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, బిట్‌కాయిన్ మైనింగ్ కంపెనీ అయిన బ్లాక్‌వేర్ సొల్యూషన్స్ ఒక నివేదిక విడుదల చేసింది. భవిష్యత్తులో బిట్‌కాయిన్‌ను మరింత విస్తృతంగా వినియోగిస్తారని, ప్రపంచ జనాభాలో 0.36% మంది ప్రస్తుతం బిట్‌కాయిన్ నెట్‌వర్క్‌ను ఉపయోగిస్తున్నారని నివేదిక అంచనా వేసింది.