Van falls into dam : డ్యామ్​లోకి దూసుకెళ్లిన వ్యాన్​.. ఏడుగురు దుర్మరణం-bihar seven pilgrims feared drowned after van falls into dam 19 injured ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Bihar Seven Pilgrims Feared Drowned After Van Falls Into Dam 19 Injured

Van falls into dam : డ్యామ్​లోకి దూసుకెళ్లిన వ్యాన్​.. ఏడుగురు దుర్మరణం

Sharath Chitturi HT Telugu
Feb 17, 2023 01:14 PM IST

Van falls into dam in Bihar : బీహార్​లో జరిగిన ఘోర ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. శివరాత్రి నేపథ్యంలో ఆలయానికి వెళుతుండగా.. ఓ వ్యాన్​, డ్యామ్​లో పడింది. గాయపడిన 19మందిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు.

డ్యామ్​లోకి దూసుకెళ్లిన వ్యాన్​.. ఏడుగురు దుర్మరణం
డ్యామ్​లోకి దూసుకెళ్లిన వ్యాన్​.. ఏడుగురు దుర్మరణం

Van falls into dam in Bihar : బిహార్​లో ఘోర ప్రమాదం సంభవించింది. రోహ్తాస్​ జిల్లాలోని డీఆర్​పీ (దుర్గావతి రిజర్వాయర్​ ప్రాజెక్ట్​) డ్యామ్​లోకి ఓ వ్యాన్​ పడిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 19మంది గాయపడ్డారు. వీరిలో 8మంది మహిళలు కూడా ఉన్నారు.

ట్రెండింగ్ వార్తలు

ఇదీ జరిగింది..

శనివారం మహాశివరాత్రి నేపథ్యంలో.. కైముర్​ హిల్స్​లోని గుప్తేశ్వర్ మహాదేవ్​ ఆలయానికి వెళ్లేందుకు 26మంది భక్తులు వ్యాన్​లో బయలుదేరారు. వీరందరు కరాకట్​ ప్రాంతానికి చెందినవారు. కాగా.. శుక్రవారం తెల్లవారుజామున ఆ వ్యాన్​.. గైఘాట్​ కొండలు ఎక్కుతుండగా ఒక్కసారిగా బ్రేక్స్​ ఫెయిల్​ అయ్యాయి. ఈ నేపథ్యంలో.. సంబంధిత వ్యాన్​ పక్కనే ఉన్న 70 అడుగుల లోతు గల డ్యామ్​లో పడింది.

Bihar accident death toll : ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలానికి పరుగులు తీశారు. ఘటనాస్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే మూడు మృతదేహాలు బయటకు వచ్చాయి. వ్యాన్​ వరకు వెళ్లేందుకు స్థానిక ఈతగాళ్లు శ్రమిస్తున్నారు. మరోవైపు 19మంది క్షతగాత్రులను ససరమ్​లోని సదర్​ హాస్పిటల్​లో చేర్పించారు.

ఘటన జరిగిన సమయంలో డ్యామ్​లో 40 అడుగల లోతు మేర నీరు ఉందని, వ్యాన్​ అందులో మునిగిపోయిందని డ్యామ్​ ఎగ్జిక్యూటివ్​ ఇంజినీర్​ అఫ్జల్​ అలామ్​ తెలిపారు.

Bihar latest news : మృతదేహాలను అధికారులు ఇంకా గుర్తించలేదు. కాగా.. మృతిచెందిన, గాయపడిన వారు బిహార్​ రేడియా, ముహ్వారి, టెలారీ, లఖనౌల్​, గేరా, టుర్కి, సకలాబజరాతో పాటు సమీప గ్రామానికి చెందిన ప్రజలను సమాచారం.

IPL_Entry_Point