Bihar rape case : 5ఏళ్ల చిన్నారిపై వృద్ధుడి కన్ను.. తోటలోకి తీసుకెళ్లి రేప్​ చేసి!-bihar rape case five year old girl raped in bihar s bettiah accused on the run ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Bihar Rape Case, Five-year-old Girl Raped In Bihar's Bettiah Accused On The Run

Bihar rape case : 5ఏళ్ల చిన్నారిపై వృద్ధుడి కన్ను.. తోటలోకి తీసుకెళ్లి రేప్​ చేసి!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Jan 30, 2023 08:10 AM IST

Bihar rape case : దేశంలో బాలికలు, మహిళలపై అత్యాచారాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. 5ఏళ్ల చిన్నారి బీహార్​లో అత్యాచారానికి గురైంది. మరో ఘటనలో.. అత్యాచారం కారణంగా 12ఏళ్ల బాలిక గర్భం దాల్చింది.

5ఏళ్ల చిన్నారిపై వృద్ధుడి కన్ను
5ఏళ్ల చిన్నారిపై వృద్ధుడి కన్ను

Assam crime news : అసోంలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ 12ఏళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు గర్భం దాల్చింది.

ట్రెండింగ్ వార్తలు

ఇదీ జరిగింది..

అసోం గోల్​పారా జిల్లాలో ఐదు నెలల క్రితం బాలికపై అత్యాచారం జరిగింది. నిందితుడు తజీదుల్​ షేక్​.. బాలికను రేప్​ చేశాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. అతనికి బయటపడిన బాలిక.. ఆ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు.

12 year old girl raped in Assam : 5 నెలలు గడిచాయి. బాలిక శరీరంలో వస్తున్న మార్పులను ఆమె కుటుంబసభ్యులు గమనించారు. ఆమెను ఆసుపత్రికి తరలించగా.. బాలిక 5 నెలల గర్భవతి అని తేలింది. అప్పుడే.. తనకు జరిగిన అన్యాయాన్ని కుటుంబసభ్యులకు వివరించింది బాధితురాలు. ఆమె కుటుంబసభ్యులు ఈనెల 27న పోలీసులను ఆశ్రయించారు.

ఘటనపై దర్యాప్తు చేపట్టిన గోల్​పారా సదర్​ పోలీస్​ స్టేషన్​ అధికారులు.. నిందితుడు తజీదుల్​ షేక్​ను వెంటనే పట్టుకున్నారు. అతడిని అరెస్ట్​ చేసి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్నారు.

మరోవైపు బాలికకు వైద్య సహాయం అందిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.

బీహార్​లో 5ఏళ్ల చిన్నారిపై..

Old man rapes child : ఐదేళ్ల చిన్నారిపై 60ఏళ్ల వృద్ధుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన బీహార్​లోని బేట్టియాలో చోటుచేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు నగర్​ పోలీస్​ స్టేషన్​ అధికారులు.

పోలీసుల సమాచారం ప్రకారం శనివారం సాయంత్రం జరిగింది ఈ ఘటన. బాధితారులు, వృద్ధుడు పక్కపక్క ఇళ్లల్లో ఉంటారు. కాగా.. శనివారం సాయంత్రం 5ఏళ్ల చిన్నారిని సమీపంలోని చెరకు తోటకు తీసుకెళ్లాడు. అక్కడే ఆమెను రేప్​ చేశాడు. ఆ తర్వాత బాలిక ఇంటికి వెళ్లిపోయింది. దస్తులకు రక్తం అంటుకుని ఉండటాన్ని గమనించిన తల్లిదండ్రులు.. ఏం జరిగిందని ఆమెను ప్రశ్నించారు. జరిగినది ఆమె వివరించారు.

Bihar crime news : ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు చిన్నారి కుటుంబసభ్యులు. దర్యాప్తులో భాగంగా.. నిందితుడి ఇంటికి వెళ్లారు పోలీసులు. కానీ అతను అప్పటికే తప్పించుకుని పారిపోయాడు. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు.. పోలీసు బృందాలు ప్రయత్నిస్తున్నాయి.

IPL_Entry_Point

సంబంధిత కథనం