Bihar tragedy: కప్లింగ్ లను విడదీస్తూ బోగీల మధ్య ఇరుక్కుని పోర్టర్ దుర్మరణం
Bihar tragedy: బిహార్ లో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. సోన్ పూర్ రైల్వే డివిజన్ పరిధిలోని రైల్వే స్టేషన్ లో పోర్టర్ గా పనిచేస్తున్న అమర్ కుమార్ రావు అనే వ్యక్తి షంటింగ్ ఆపరేషన్ రైలు రెండు బోగీల మధ్య ఇరుకున్ని మృతి చెందాడు.
Bihar train tragedy: బీహార్ లో బెగుసరాయ్ లోని బరౌనీ రైల్వే జంక్షన్ వద్ద హృదయ విదారక ఘటన జరిగింది. బీహార్ లోని బెగుసరాయ్ లోని బరౌనీ జంక్షన్ వద్ద శనివారం జరిగిన షంటింగ్ ఆపరేషన్ లో రైల్వే పోర్టర్ మృతి చెందాడని రైల్వే వర్గాలు తెలిపాయి. మృతుడిని సోన్ పూర్ రైల్వే డివిజన్ పరిధిలోని స్టేషన్ లో పోర్టర్ గా పనిచేస్తున్న అమర్ కుమార్ రావుగా పోలీసులు గుర్తించారు.
లక్నో-బరౌనీ ఎక్స్ ప్రెస్
వివరాల్లోకి వెళితే.. లక్నో జంక్షన్ నుంచి 15204 నంబర్ తో లక్నో-బరౌనీ ఎక్స్ ప్రెస్ బరౌనీ కి వచ్చింది. వెంటనే జంక్షన్ లోని 5వ ప్లాట్ ఫాంపై ఆ ట్రైన్ కు షంటింగ్ ఆపరేషన్ ప్రారంభించారు. ఆ సమయంలో రెండు బోగీల మధ్య కప్లింగ్ లను విడదీయడానికి పోర్టర్ అమర్ కుమార్ వెళ్లాడు. అదే సమయంలో అందులోని ఒక బోగీ వెనక్కు రావడంతో రెండు బోగీల మధ్య ఇరుకున్ని అతడు మృతి చెందాడు. అక్కడే ఉన్నప్రయాణికులు గట్టిగా అరవడంతో.. విషయం అర్థమైన ఆ ట్రైన్ డ్రైవర్.. మళ్లీ రైలు ను ముందుకు తీసుకువెళ్లడానికి ప్రయత్నించకుండా, భయపడి రైలు దిగి పారిపోయాడు. దాంతో రెండు బోగీల కప్లింగ్ ల మధ్య ఇరుక్కుని విలవిలలాడుతూ ఆ పోర్టర్ ప్రాణాలు కోల్పోయాడు. అతడు రెండు బోగీల మధ్య ఇరుక్కుపోయిన ఘటనను అక్కడున్న వారు తమ మొబైల్ ఫోన్లలో ఫోటోలు తీశారు.
గత ఘటనలు..
ఈ విషాద ఘటనపై రైల్వే అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. హౌరాలోని ఆగ్నేయ రైల్వే డివిజన్లోని నల్పూర్ స్టేషన్ సమీపంలో పార్శిల్ వ్యాన్, రెండు ప్యాసింజర్ బోగీలతో సహా 22850 సికింద్రాబాద్-షాలిమార్ ఎస్ఎఫ్ ఎక్స్ ప్రెస్ కు చెందిన మూడు బోగీలు పట్టాలు తప్పాయని ఆగ్నేయ రైల్వే సీపీఆర్వో తెలిపారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ఆగ్నేయ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ తెలిపారు. తాజా నివేదిక ప్రకారం, నల్పూర్ స్టేషన్ సమీపంలోని యుపి మెయిన్ లైన్లో రైలు సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. డౌన్ లైన్ లో మరమ్మతు పనులు ఇంకా కొనసాగుతున్నాయి.
సికింద్రాబాద్ - షాలిమార్ వీక్లీ ఎక్స్ ప్రెస్
సికింద్రాబాద్ - షాలిమార్ వీక్లీ ఎక్స్ ప్రెస్ (22850) ఖరగ్ పూర్ డివిజన్ లోని నల్ పూర్ స్టేషన్ మీదుగా వెళ్తుండగా బోగీలు పట్టాలు తప్పాయి. అక్టోబర్ 31న బీహార్ లోని ముజఫర్ పూర్ జిల్లాలో సరుకు రవాణా రైలుకు చెందిన నాలుగు ఖాళీ బోగీలు పట్టాలు తప్పాయి. ఈస్ట్ సెంట్రల్ రైల్వే సోన్ పూర్ డివిజన్ లోని నారాయణపూర్ అనంత్ స్టేషన్ లో మధ్యాహ్నం 3.45 గంటల సమయంలో షంటింగ్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.