Nitish Kumar: అందుకే జనాాభా నియంత్రణ కావడం లేదు: సీఎం నితీశ్ కామెంట్లు వివాదాస్పదం-bihar cm nitish kumar statement on population control sparked controversy ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Bihar Cm Nitish Kumar Statement On Population Control Sparked Controversy

Nitish Kumar: అందుకే జనాాభా నియంత్రణ కావడం లేదు: సీఎం నితీశ్ కామెంట్లు వివాదాస్పదం

Chatakonda Krishna Prakash HT Telugu
Jan 08, 2023 04:46 PM IST

Bihar CM Nitish Kumar comment on Population control: జనాభా నియంత్రణ అంశంలో బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. బీజేపీ ఆయన కామెంట్లపై విమర్శలు చేసింది.

బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ (HT Photo)
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ (HT Photo)

Bihar CM Nitish Kumar comment on Population control: బిహార్‌లో జనాభా నియంత్రణలోకి రాకపోవడానికి కారణాలు అంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని రాజేశాయి. పురుషులు బాధ్యత తీసుకోవడం లేదనటంతో పాటు మహిళలపై ఆయన చేసిన వ్యాఖ్యలు అగ్గిరాజేశాయి. నితీశ్ కుమార్ అభ్యంతరకర రీతితో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రతిష్ఠను దిగజారుస్తున్నారంటూ బీజేపీ విమర్శించింది. అసలు నితీశ్ ఏమన్నారంటే..

ట్రెండింగ్ వార్తలు

సమాధాన్ యాత్రలో భాగంగా వైశాలీ ప్రాంతంలో జరిగిన ఓ సభలో బిహార్ సీఎం నితీశ్ కుమార్ మాట్లాడారు. కులాల ఆధారంగా జనాభా గణనను ప్రభుత్వం మొదలుపెట్టిన రోజే ఈ వ్యాఖ్యలు చేశారు.

“మహిళలు అక్షరాస్యులుగా ఉన్నప్పుడే జనాభా పెరుగుదల రేటు అదుపులో ఉంటుంది. జనాభా రేటు ఇంకా తగ్గలేదు. అలాగే ఉంది. మహిళలు బాగా చదువుకుంటే.. గర్భం దాల్చకుండా ఉండేందుకు తమను తాము ఎలా రక్షించుకోవాలో తెలుస్తుంది. వారు చేసే పనుల ఫలితం ఎలా ఉంటుందో పరిగణనలోకి తీసుకునేందుకు పురుషుల సిద్ధంగా ఉండరు. సరైన విద్య లేని కారణంగా జనాభా పెరుగుదలను మహిళలు కట్టడి చేయలేకున్నారు” అని నితీశ్ కుమార్ అన్నారు.

రాజకీయ దుమారం

సీఎం నితీశ్ కుమార్ వ్యాఖ్యల పట్ల బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బిహార్ ప్రతిష్ఠను దిగజార్చేలా ఆయన మాట్లాడుతున్నారని ఆ పార్టీ నేత సామ్రాట్ చౌదరి విమర్శించారు. “ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వాడిన అసభ్యకరమైన పదాలు కించపరిచే విధంగా ఉన్నాయి. అలాంటి పదాలను ఉపయోగించి, ముఖ్యమంత్రి పదవి పదవికి ఉన్న గౌరవాన్ని ఆయన దిగజారుస్తున్నారు” అని సామ్రాట్ చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Bihar Caste based census: కాగా, బిహార్‌లో కుల ఆధారిత జనగణన మొదలైంది. ఈ ప్రక్రియ ద్వారా కులాల వారీగా జనాభాను ఆ రాష్ట్ర ప్రభుత్వం లెక్కించనుంది. 38 జిల్లాలో రెండు దశల్లో దీన్ని నిర్వహించనుంది. ఇందులో భాగంగా తొలి దశ కుల ఆధారిత జనాభా లెక్కింపు ఈనెల 7వ తేదీన ప్రారంభమైంది. పేదలకు సంక్షేమ ఫలాలను అందించేందుకు ఈ ప్రక్రియ చేస్తున్నట్టు ప్రభుత్వం చెబుతోంది.

IPL_Entry_Point