Bharat Jodo Yatra: కర్ణాటకలోకి ప్రవేశించిన భారత్ జోడో యాత్ర-bharat jodo yatra enters karnataka state ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Bharat Jodo Yatra Enters Karnataka State

Bharat Jodo Yatra: కర్ణాటకలోకి ప్రవేశించిన భారత్ జోడో యాత్ర

HT Telugu Desk HT Telugu
Sep 30, 2022 11:52 AM IST

Bharat Jodo Yatra: రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్ర కర్ణాటక రాష్ట్రంలోకి ప్రవేశించింది.

భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ
భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ

Bharat Jodo Yatra: రాహుల్ గాంధీ నేతృత్వంలో భారత్ జోడో యాత్ర శుక్రవారం కర్ణాటకలో ప్రవేశించింది, వచ్చే ఏడాది రాష్ట్రంలో అసెంబ్లీ జరగనున్న నేపథ్యంలో ఈ యాత్ర తన అవకాశాలను పెంచుతుందని కాంగ్రెస్ భావిస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

బందీపూర్‌లో రాహుల్ గాంధీకి మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్వాగతం పలికారు. ‘ఈ యాత్ర భారతదేశపు సామాజిక-ఆర్థిక, రాజకీయ వాతావరణాన్ని రక్షించడానికి వీలుగా ప్రతి భారతీయుడు ఏకతాటిపైకి రావడానికి, ఒకే స్వరంలో మాట్లాడటానికి వీలు కల్పిస్తుంది’ అని ఆయన ట్వీట్ చేశారు. దాదాపు 40000-45000 మంది ప్రజలు ఈ మార్చ్‌లో పాల్గొంటారని ఆశిస్తున్నట్లు సిద్ధరామయ్య చెప్పారు.

తాము సమైక్య ప్రతిజ్ఞను పునరుద్ధరిస్తున్నామని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ అన్నారు. ‘మీరు మార్పును చూడాలనుకుంటే, మార్పు కోసం ఉద్యమంలో చేరండి. 1947లో స్వాతంత్య్రం తీసుకురావడానికి కాంగ్రెస్ భారతదేశాన్ని ఏకం చేసింది. నేడు, 75 సంవత్సరాల తరువాత, మేం మార్పు కోసం ఐక్యతా ప్రతిజ్ఞను పునరుద్ధరిస్తున్నాం..’ అని ఆయన గురువారం అన్నారు.

రాష్ట్రంలో ఎన్నికలకు ముందు అవినీతి, అభివృద్ధి లేమిపై కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది. అవినీతితో బతకాల్సిన అవసరం లేదని ప్రజలు విశ్వసించేలా యాత్ర దోహదపడుతుందని శివకుమార్ అన్నారు. ‘మనం ఎప్పటికీ నిరుద్యోగాన్ని అనుభవించాల్సిన అవసరం లేదు. ఈ ప్రియమైన భూమి ప్రతి ఒక్కరికీ ఉద్యోగాలను సృష్టించగలదని మీరు నమ్మడం ప్రారంభిస్తారు..’ అని అన్నారు.

గుండ్లుపేట సమీపంలో రాహుల్ గాంధీకి స్వాగతం పలుకుతూ వెలసిన బ్యానర్లు చినిపోగా, వాతావరణం ఎలా ఉన్నా రోజుకు కనీసం 20 కిలోమీటర్లు నడిచి వెళ్లే యాత్ర అని, ఇది పిక్నిక్ కాదు అని ఆయన అన్నారు.

<p>కేరళ మలప్పురంలో భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ&nbsp;</p>
కేరళ మలప్పురంలో భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ&nbsp; (PTI)
IPL_Entry_Point