Bengaluru murder case : అమ్మాయితో చాట్​ చేస్తున్నాడని.. కొట్టి చంపేశారు!-bengaluru youth murdered for chatting with girl four arrested
Telugu News  /  National International  /  Bengaluru Youth Murdered For Chatting With Girl, Four Arrested
అమ్మాయితో చాట్​ చేస్తున్నాడని.. కొట్టి చంపేశారు!
అమ్మాయితో చాట్​ చేస్తున్నాడని.. కొట్టి చంపేశారు!

Bengaluru murder case : అమ్మాయితో చాట్​ చేస్తున్నాడని.. కొట్టి చంపేశారు!

03 February 2023, 7:38 ISTSharath Chitturi
03 February 2023, 7:38 IST

Youth murdered for chatting with girl : అమ్మాయితో చాట్​ చేస్తున్నాడన్న కారణంతో.. ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. అతనిపై నలుగురు దాడి చేసి.. కొట్టి చంపేశారు. ఈ ఘటన బెంగళూరులో జరిగింది.

Youth murdered for chatting with girl : కర్ణాటకలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ అమ్మాయితో చాట్​ చేస్తున్నాడన్న కారణంతో.. ఓ యువకుడిని నలుగురు దారుణంగా కొట్టి చంపేశారు!

అసలేం జరిగిందంటే..

కర్ణాటక రాజధాని బెంగళూరులో.. గత ఆదివారం జరిగింది ఈ ఘటన. బాధితుడి పేరు గోవిందరాజు. అతని వయస్సు 20ఏళ్ల. కాగా.. ఆదివారం ఉదయం అతని ఇంటికి.. అనిల్​ అనే వ్యక్తి వెళ్లాడు. గోవిందరాజును బయటకు పిలిచాడు. అనంతరం.. అతడిని బైక్​ మీద ఎక్కించుకుని అంద్రల్లీ ప్రాంతానికి తీసుకెళ్లాడు.

Bengaluru crime news : అక్కడికి.. అనిల్​తో సంబంధం ఉన్న మరో ముగ్గురు వచ్చారు. వారి పేర్లు లోహిత్​, భరత్​, కిశోర్​. అక్కడే.. నలుగురు కలిసి గోవిందరాజును దారుణంగా కొట్టారు. కర్రలతో చితకబాదారు. ఆ దెబ్బలకు గోవిందరాజు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు!

గోవిందరాజు మృతదేహాన్ని లోహిత్​ కారులో పెట్టిన నిందితులు.. చార్​ముదిఘాట్​ ప్రాంతంలో పడేసి పారిపోయారు. వారి సెల్​ఫోన్స్​ను స్విచ్ఛాప్​ చేసేశారు.

Bengaluru youth murdered : గోవిందరాజు ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు.. పోలీసులను ఆశ్రయించారు. గోవిందరాజు కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. ఘటనపై మిస్సింగ్​ కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. స్థానిక సీసీటీవీ కెమెరాలను పరిశీలించి.. కొన్ని రోజుల్లోనే కేసును ఛేదించారు. నిందితులపై అనుమానం వచ్చి వెంటనే పట్టుకున్నారు.

విచారణలో భాగంగా.. నిందితులు అనిల్​, లోహిత్​, భరత్​, కిశోర్​లు నిజాన్ని అంగీకరించారు. ఓ అమ్మాయితో చాట్​ చేస్తున్నందుకే.. గోవిందరాజును కొట్టినట్టు, చివరికి అతను ప్రాణాలు కోల్పోయినట్టు పోలీసులకు వెల్లడించారు. ఘటనపై మర్డర్​ కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులు ఇచ్చిన సమాచారంతో మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.

ఘటనపై దర్యాప్తు జరుగుతోందని, త్వరలోనే నిందితులను కఠినంగా శిక్షిస్తామని.. బాధితుడి కుటుంబానికి పోలీసులు హామీనిచ్చారు.

బంగారం కోసం వృద్ధురాలి హత్య..!

Old Woman Murdered For Gold Ornaments : దేశంలో నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా హత్య ఘటనలు నిత్యం వార్తల్లో నిలుస్తున్నాయి. బంగారు నగల కోసం ఓ వృద్ధురాలిని కిరాతకంగా హత్య చేసిన ఘటన తెలంగాణలోని మెదక్ జిల్లాలో ఇటీవలే కలకలం సృష్టించింది.

ఆ వృద్ధురాలి వయస్సు 80 ఏళ్లు..! ఆమె మెడలో ఉన్న బంగారు నగలు, కాళ్లకు ఉన్న కడియాలపై కన్నేశాడు అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి. ఇందుకోసం పక్కాగా ప్లాన్ వేశాడు. ఎవరూలేని సమయంలో వృద్ధురాలి ఇంటికెళ్లిన అతగాడు.. మాటల్లో పెట్టాడు. ఇదే సమయంలో ఒక్కసారిగా ఆమె మెడలోని బంగారు నగలను అపహరించేందుకు యత్నించాడు. అప్రమత్తమైన వృద్ధురాలు.. అడ్డుకునే ప్రయత్నం చేయగా.. ఇనుప రాడుతో తలపై గట్టిగా కొట్టడంతో వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.