Condoms in Students Bags: షాకింగ్.. పాఠశాల విద్యార్థుల బ్యాగ్‍ల్లో కండోమ్స్, గర్భనిరోధక మాత్రలు!-bengaluru schools find condoms contractive pills cigarettes in students bags ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Bengaluru Schools Find Condoms Contractive Pills Cigarettes In Students Bags

Condoms in Students Bags: షాకింగ్.. పాఠశాల విద్యార్థుల బ్యాగ్‍ల్లో కండోమ్స్, గర్భనిరోధక మాత్రలు!

HT Telugu Desk HT Telugu
Dec 01, 2022 11:29 AM IST

Condoms in Students Bags: మొబైళ్ల విషయంలో కంప్లయింట్లు రావడంతో పాఠశాలల యాజమాన్యాలు ఆకస్మిక తనిఖీలు చేయగా.. కొందరు విద్యార్థుల బ్యాగ్‍ల్లో కండోమ్స్, గర్భనిరోధక మాత్రలు, సిగరెట్లు దొరికాయని ఓ రిపోర్ట్ వెల్లడించింది.

ప్రతీకాత్మక చిత్రం (Shutterstock)
ప్రతీకాత్మక చిత్రం (Shutterstock)

Condoms in Students Bags: విద్యార్థులు మొబైల్స్ తీసుకొస్తున్నారని వారి బ్యాగ్‍లను చెక్ చేసిన కొన్ని పాఠశాలల యాజమాన్యాలకు ఊహించని విషయాలు తెలిశాయట. బెంగళూరు (Bengaluru) లోని కొన్ని స్కూళ్లలో యాజమాన్యాలు ఆకస్మిక తనిఖీ చేయించాయని, ఆ సమయంలో కొందరు విద్యార్థుల బ్యాగ్‍ల్లో కండోమ్స్, గర్భనిరోధక మాత్రలు, సిగరెట్లు దొరికాయని డెక్కన్ హెరాల్డ్ రిపోర్ట్ చేసింది. విద్యార్థులు ఫోన్లు తీసుకొస్తున్నారని ఫిర్యాదులు రావటంతో యాజమాన్యాలు తనిఖీలు చేయగా ఈ షాకింగ్ విషయాలు బయటపడ్డాయని వెల్లడించింది.

ట్రెండింగ్ వార్తలు

Condoms in Students Bags: ఆ రిపోర్ట్ ప్రకారం, 8,9,10వ తరగతి చదువుతున్న కొందరు విద్యార్థుల బ్యాగ్‍ల్లో సెల్ ఫోన్లతో పాటు ఎక్కువ మొత్తంలో డబ్బు కూడా దొరికింది. కొందరి బ్యాగ్‍ల్లో కండోమ్స్, గర్భనిరోధక మాత్రలు, సిగరెట్లు కూడా బయటపడ్డాయి. ఈ నిర్ఘాంతపరిచే విషయం బయటికి రావటంతో, విద్యార్థుల బ్యాగ్‍లను తరచూ తనిఖీ చేస్తుండాలని అసోసియేటెడ్ మేనేజ్‍మెంట్ ఆఫ్ స్కూల్స్ (KAMS) పాఠశాలల యాజమాన్యాలకు సూచనలు చేసింది.

ఈ ఘటన తర్వాత కొన్ని స్కూళ్లు.. విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాలు కూడా ఏర్పాటు చేశాయని ఆ రిపోర్టు వెల్లడించింది. “ఇలాంటి విషయం జరిగిందని తెలిసి మేం మాత్రమే కాదు.. వారి తల్లిదండ్రులు కూడా షాకయ్యారు. పిల్లల్లో మార్పును తాము కూడా గమనించామని కొందరు పేరెంట్స్ చెప్పారు” అని ఓ పాఠశాల ప్రిన్సిపాల్ చెప్పినట్టు ఆ రిపోర్టులో ఉంది.

అయితే, విద్యార్థులను ఆయా పాఠశాలలు సస్పెండ్ చేయలేదు. దాని బదులు, వారి ప్రవర్తనలో మార్పులు తీసుకొచ్చేందుకు వారికి కౌన్సిలింగ్ ఇప్పించేందుకు సిద్ధమయ్యాయి.

“కొన్ని పాఠశాల్లలో గర్భనిరోధక మాత్రలు, నీళ్ల బాటిళ్లలో మద్యం గుర్తించాం. కొందరు 5వ తరగతి పిల్లలు కూడా అసభ్యకరమైన మాటలు మాట్లాడున్నారు. కొందరి ప్రవర్తన కూడా సరిగాలేదు” అని కేఏఎంఎస్ జనరల్ సెక్రటరీ డి.శశికుమార్ చెప్పారు.

IPL_Entry_Point

టాపిక్