Rain alert : ఇంకొన్ని రోజుల పాటు ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు- ఐఎండీ అలర్ట్!
Bengaluru rains today : కర్ణాటకలోని బెంగళూరుతో సహా పలు దక్షిణ భారతంలోని పలు రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
బెంగళూరు ప్రజలకు అలర్ట్! నగరంలో కొన్ని రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. రోజంతా ఆకాశం మేఘావృతమై ఉండటంతో గురువారం నగరంలో వర్షం కురిసిందని, ఇదే పరిస్థితులు ఇంకొన్ని రోజులు కొనసాగవచ్చని పేర్కొంది. శ్రీలంక-తమిళనాడు తీరం వెంబడి ఏర్పడిన అల్పపీడనం డిసెంబర్ 14 వరకు కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరిలోని కొన్ని ప్రాంతాల్లో గణనీయమైన వర్షాలకు దారితీస్తుంది వాతావరణ శాఖ తెలిపింది.
చిత్రదుర్గ, కోలార్, రామనగర సహా అర్బన్ బెంగళూరు, బెంగళూరు రూరల్, పరిసర జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. దక్షిణ కన్నడ, ఉడిపి వంటి కోస్తా జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. బెంగళూరులో ఉష్ణోగ్రతలు 18 డిగ్రీల నుంచి 30 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉందని, కోస్తా, ఇంటీరియర్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
డిసెంబర్ 18 వరకు బెంగళూరులో వర్షాలు..
డిసెంబర్ 13న కోస్తా కర్ణాటక, కొడగు, తుమకూరు, చిక్కమగళూరు, మైసూరు, హసన్, మాండ్య, చామరాజనగర్ జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
దక్షిణ ఇంటీరియర్ కర్ణాటకలోని మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఉత్తర ఇంటీరియర్ కర్ణాటకలో పొడి వాతావరణం కనిపించే అవకాశం ఉంది.
డిసెంబర్ 14
కర్ణాటకలో పొడి వాతావరణం నెలకొనే అవకాశం ఉంది. ఉత్తర ఇంటీరియర్ కర్ణాటకలో పొగమంచు ఎక్కువగా ఉంటుంది.
డిసెంబర్ 15
కర్ణాటకలో పొడి వాతావరణం నెలకొనే అవకాశం ఉంది. ఉత్తర ఇంటీరియర్ కర్ణాటకలో పొగమంచు ఎక్కువగా ఉంటుంది.
డిసెంబర్ 16:
కర్ణాటకలో పొడి వాతావరణం నెలకొనే అవకాశం ఉంది. ఉత్తర ఇంటీరియర్ కర్ణాటకలో చాలా చోట్ల లోతైన పొగమంచు ఉండొచ్చు.
డిసెంబర్ 17:
చిక్కబళ్లాపుర, రామనగర, బెంగళూరు రూరల్, బెంగళూరు అర్బన్, కోలార్, తుమకూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
కోస్తా కర్ణాటకలో కొన్ని చోట్ల, దక్షిణ ఇంటీరియర్ కర్ణాటకలోని మిగిలిన జిల్లాల్లో చాలా చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
కొప్పల్, గదగ్, ధార్వాడ్, హవేరి, రాయచూర్ జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర ఇంటీరియర్ కర్ణాటకలోని మిగిలిన జిల్లాల్లో పొడి వాతావరణం నెలకొనే అవకాశం ఉంది.
18 డిసెంబర్:
కోస్తా కర్ణాటకలో చాలా చోట్ల, ఇంటీరియర్ కర్ణాటకలో కొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఐఎండీ అలర్ట్స్..
తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్: డిసెంబర్ 17న భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. డిసెంబర్ 13, 16, 18 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది.
కేరళ: డిసెంబర్ 13న అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయి. డిసెంబర్ 17, 18 తేదీల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
కోస్తాంధ్ర, రాయలసీమ: డిసెంబర్ 17, 18 తేదీల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక: డిసెంబర్ 17న అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
లక్షద్వీప్: డిసెంబర్ 13న అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
అండమాన్ నికోబార్ దీవులు: డిసెంబర్ 13 నుంచి 15 వరకు అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
సంబంధిత కథనం