Private videos: గర్ల్ ఫ్రెండ్ ప్రైవేట్ వీడియోలు తీసి బ్లాక్ మెయిల్; రూ. 2.5 కోట్లు వసూలు
Private videos: తన గర్ల్ ఫ్రెండ్ ప్రైవేటు వీడియోలు రికార్డు చేసి, అనంతరం ఆమెను బ్లాక్ మెయిల్ చేసిన ఒక వ్యక్తి, ఆమె నుంచి సుమారు రూ. 2.5 కోట్లు కాజేశాడు. ఆ యువతి ఫిర్యాదుపై పోలీసులు ఆ యువకుడిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన బెంగళూరులో జరిగింది.
Private videos: బెంగళూరుకు చెందిన 20 ఏళ్ల యువతిని ఆమె ప్రియుడు ఆమె తనతో సన్నిహితంగా ఉన్న సమయంలో తీసిన ఇంటిమేట్ వీడియోలతో బ్లాక్ మెయిల్ చేయడంతో ఆమె అతడికి రూ.2.5 కోట్లు ఇచ్చింది. ఆ యువకుడు పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి ఆమెను నమ్మించి, ఆమె నుంచి డబ్బు, నగలు, ఖరీదైన గడియారాలు తీసుకున్నాడు. లగ్జరీ కారు కూడా ఇవ్వాలని ప్రియుడు ఆమెపై ఒత్తిడి తెచ్చాడు.
బోర్డింగ్ స్కూల్ ఫ్రెండ్ షిప్
నిందితుడిని మోహన్ కుమార్ గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. బోర్డింగ్ స్కూల్ రోజుల్లో బాధితురాలికి మోహన్ కుమార్ తో పరిచయం ఏర్పడింది. పాఠశాల తరువాత వారి మధ్య సంబంధాలు తెగిపోయాయి. కానీ, బెంగళూరులో ఇటీవల మోహన్ ఆమెతో మళ్లీ కాంటాక్ట్ లోకి వచ్చాడు. వారు చాలా సంవత్సరాల తరువాత తిరిగి కలుసుకున్నారు. శృంగార సంబంధాన్ని తిరిగి ప్రారంభించారు. ఆ యువతిని పెళ్లి చేసుకుంటానని కుమార్ హామీ ఇచ్చాడు. వారిద్దరూ సన్నిహితంగా కలిసి ఉన్న సమయంలో ఆ ప్రైవేట్ మూమెంట్స్ ను మోహన్ రికార్డు చేశాడు. ఆ వీడియోలు తన వ్యక్తిగత ఉపయోగం కోసమేనని ఆమెకు హామీ ఇచ్చాడు.
బ్లాక్ మెయిల్, దోపిడీ
ఆ తరువాత ఆ ఇంటిమేట్ వీడియోలను సోషల్ మీడియా (social media) ఖాతాలలో పోస్ట్ చేస్తానని మోహన్ కుమార్ ఆమెను బెదిరించడం ప్రారంభించాడు. ఆలా చేయకుండా ఉండాలంటే, తన బ్యాంక్ ఖాతాకు పెద్ద మొత్తాలలో డబ్బు బదిలీ చేయాలని డిమాండ్ చేశాడు. భయపడిపోయిన ఆ యువతి పలు దఫాలుగా అతడి అకౌంట్లలోకి డబ్బు జమ చేసింది. మొత్తంగా బాధితురాలు తన అమ్మమ్మ బ్యాంకు ఖాతా నుంచి రూ.1.25 కోట్లు అతడికి బదిలీ చేసింది. అంతేకాదు, పలుమార్లు రూ.1.32 కోట్ల మేరకు నగదును కూడా ఇచ్చింది. మోహన్ కుమార్ దురాశ డబ్బుతో ఆగలేదు. ఖరీదైన నగలు, గడియారాలు, హైఎండ్ కారును ఇవ్వాలని ఆ యువతిని బలవంతం చేశాడు.
పోలీసులకు ఫిర్యాదు
నెలల తరబడి మోహన్ కుమార్ బ్లాక్ మెయిల్ ను భరించిన ఆ మహిళ ఎట్టకేలకు ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. దీంతో మోహన్ కుమార్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఇది పక్కా ప్రణాళికతో చేసిన నేరమని బెంగళూరు (bengaluru news) పోలీస్ కమిషనర్ బి.దయానంద్ ధ్రువీకరించారు. కుమార్ వసూలు చేసిన రూ.2.57 కోట్లలో ఇప్పటికే రూ.80 లక్షలు రికవరీ అయ్యాయి.
టాపిక్