Darshan judicial custody: నటుడు దర్శన్ జ్యుడీషియల్ కస్టడీ మరోసారి పొడిగింపు; ఇతర నిందితులది కూడా..-bengaluru court extends judicial custody of darshan other accused till jul 18 ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Darshan Judicial Custody: నటుడు దర్శన్ జ్యుడీషియల్ కస్టడీ మరోసారి పొడిగింపు; ఇతర నిందితులది కూడా..

Darshan judicial custody: నటుడు దర్శన్ జ్యుడీషియల్ కస్టడీ మరోసారి పొడిగింపు; ఇతర నిందితులది కూడా..

HT Telugu Desk HT Telugu
Jul 05, 2024 07:51 PM IST

అభిమాని రేణుకాస్వామిని హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కన్నడ స్టార్ హీరో దర్శన్ జ్యూడీషియల్ కస్టడీని బెంగళూరులోని కోర్టు మరోసారి పొడిగించింది. షాక్, అంతర్గత రక్తస్రావం కారణంగా రేణుకాస్వామి మృతి చెందినట్లు పోస్టుమార్టం రిపోర్టులో తేలింది.

కన్నడ స్టార్ హీరో దర్శన్
కన్నడ స్టార్ హీరో దర్శన్ (ANI)

రేణుకస్వామి హత్య కేసులో నిందితులుగా ఉన్న కన్నడ నటుడు దర్శన్ తూగుదీప, అతని స్నేహితురాలు పవిత్ర గౌడ, ఇతర నిందితుల జ్యుడీషియల్ కస్టడీని బెంగళూరు కోర్టు ఈ నెల 18 వరకు పొడిగించింది. దర్శన్, పవిత్రతో సహా మొత్తం 17 మంది నిందితులను బెంగళూరు, తుమకూరు జైళ్ల నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు.

yearly horoscope entry point

అశ్లీల సందేశాలు పంపాడని

నటుడు, స్టార్ హీరో దర్శన్ అభిమాని అయిన 33 ఏళ్ల రేణుకస్వామి, దర్శన్ తో సహజీవనం చేస్తున్న పవిత్ర గౌడకు అశ్లీల సందేశాలు పంపాడని, అది దర్శన్ కు కోపం తెప్పించిందని, ఇది అతని హత్యకు దారితీసిందని పోలీసు వర్గాలు తెలిపాయి. జూన్ 9న సుమనహళ్లిలోని ఓ అపార్ట్ మెంట్ పక్కనే ఉన్న వర్షపునీటి కాలువ వద్ద రేణుకాస్వామి మృతదేహం లభ్యమైంది.

అభిమానులతో కలిసి..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హీరో దర్శన్ నిన్ను కలవాలనుకుంటున్నాడని చెప్పి రేణుకాస్వామిని దర్శన్ అభిమాన సంఘం నాయకుడైన రాఘవేంద్ర ఆర్ఆర్ నగర్లోని ఓ షెడ్డుకు తీసుకొచ్చాడు. అక్కడే ఆయనను బంధించి చిత్రహింసలకు గురిచేసి, హత్య చేశారు. చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి షాక్, రక్తస్రావం కారణంగా మృతి చెందినట్లు పోస్టుమార్టం రిపోర్టులో తేలింది.

ఏ 1 పవిత్ర గౌడ

రేణుకాస్వామి హత్యలో ప్రధాన నిందితురాలు (A1) గా పవిత్ర గౌడ పేరును పోలీసులు ఎఫ్ఐఆర్ లో చేర్చారు. ఆమెనే దర్శన్ సహా ఇతర నిందితులను రెచ్చగొట్టిందని, వారితో కలిసి కుట్ర పన్నిందని పోలీసు వర్గాలు తెలిపాయి. అంతేకాదు, రేణుకాస్వామిని హత్య చేసిన నేరంలో ఆమె స్వయంగా పాల్గొన్నట్లు దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు.

Whats_app_banner
జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.