Road rage: రోడ్డుపై స్వల్ప ఘర్షణ; ఆ తరువాత బైకర్ ను కారుతో ఢీ కొట్టి చంపిన దారుణం-bengaluru biker killed in another road rage incident second one in a week ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Road Rage: రోడ్డుపై స్వల్ప ఘర్షణ; ఆ తరువాత బైకర్ ను కారుతో ఢీ కొట్టి చంపిన దారుణం

Road rage: రోడ్డుపై స్వల్ప ఘర్షణ; ఆ తరువాత బైకర్ ను కారుతో ఢీ కొట్టి చంపిన దారుణం

HT Telugu Desk HT Telugu
Aug 22, 2024 02:51 PM IST

రహదారిపై బైక్, కారు ఢీకొనడంతో ఘర్షణ జరిగింది. ఆ తరువాత, రోడ్డు పై వెళ్తున్న ఆ బైకర్ ను కారులోని వ్యక్తులు చేజ్ చేసి, వెనుక నుంచి కారుతో వేగంగా ఢీకొట్టి, ఆ బైకర్ మృతికి కారణమయ్యారు. బెంగళూరులోని విద్యారణ్యపుర ప్రాంతంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు.

రోడ్డుపై స్వల్ప ఘర్షణ; బైకర్ ను కారుతో ఢీ కొట్టి చంపిన దారుణం
రోడ్డుపై స్వల్ప ఘర్షణ; బైకర్ ను కారుతో ఢీ కొట్టి చంపిన దారుణం

బెంగళూరులో బుధవారం రాత్రి జరిగిన రోడ్ రేజ్ ఘటనలో ఓ బైకర్ మృతి చెందాడు. విద్యారణ్యపుర ప్రాంతంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి బెంగళూరు పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు.

ఢీకొనడంతో ఘర్షణ

ట్రాఫిక్ లో ఉండగా రెండు వాహనాలు ఢీకొనడంతో బైకర్, కారు డ్రైవర్ మధ్య స్వల్ప ఘర్షణ చోటుచేసుకుంది. వాగ్వాదం తీవ్రరూపం దాల్చడంతో కారు బైక్ ను వెంబడించి వెనుక నుంచి ఢీకొట్టింది. బైకర్ తీవ్ర గాయాలపాలై మృతి చెందాడు. నిందితుల్లో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసి, ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన సీసీటీవీ ఫుటేజీలో రాత్రి సమయంలో కారు అతివేగంతో బైక్ ను వెంబడించిన దృశ్యాలు కనిపించాయి.

బెంగళూరు రోడ్డు ప్రమాదాలు

ఇటీవలి కాలంలో బెంగళూరులో రోడ్లపై ప్రయాణ సమయంలో జరిగే స్వల్ప ప్రమాదాల వల్ల ఒకరిపై ఒకరు దాడి చేసుకునే రోడ్ రేజ్ ఘటనలు పెరిగాయి. అలాంటి ఘటనలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, అత్యవసర పరిస్థితుల్లో 112కు డయల్ చేయాలని పోలీసులు ఇప్పటికే ప్రయాణికులను హెచ్చరించారు. ఇటీవల ఒక జంట ప్రయాణిస్తున్న కారుపై బౌన్సర్ దాడి చేసిన భయానక రోడ్డు రేజ్ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. కారు అద్దాలు పగులగొట్టి సర్జాపూర్ రోడ్డులో ఆ బౌన్సర్ బీభత్సం సృష్టించాడు.ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే కారుపై దాడి చేసిన బౌన్సర్ ను బెల్లందూర్ పోలీసులు అరెస్టు చేశారు.

కఠిన చర్యలు తీసుకోవాలి..

ఇప్పటికైనా పోలీసులు కఠిన చర్యలు తీసుకుని ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని, పెట్రోలింగ్ పెంచాలని ప్రజలు కోరుతున్నారు. ప్రయాణికులకు ఇబ్బంది కలిగించే ఎలాంటి రోడ్డు ప్రమాదాలనైనా సహించేది లేదని బెంగళూరు పోలీసులు తెలిపారు. రోడ్ రేజ్ చివరకు సంకెళ్లతో ముగుస్తుందని అని బెంగళూరు (bengaluru) పోలీసులు ఎక్స్ పోస్ట్ లో పేర్కొన్నారు.