Bomb threat news : ఒక్క రోజులో 50, 14 రోజుల్లో 350 విమానాలకు బాంబు బెదిరింపులు.. అసలేం జరుగుతోంది?-bengaluru ayodhya akasa flight among 50 airlines get hoax bomb threat today ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Bomb Threat News : ఒక్క రోజులో 50, 14 రోజుల్లో 350 విమానాలకు బాంబు బెదిరింపులు.. అసలేం జరుగుతోంది?

Bomb threat news : ఒక్క రోజులో 50, 14 రోజుల్లో 350 విమానాలకు బాంబు బెదిరింపులు.. అసలేం జరుగుతోంది?

Sharath Chitturi HT Telugu
Oct 27, 2024 06:50 PM IST

Bomb threat today : ఆదివారం భారతీయ విమానయాన సంస్థలకు చెందిన 50 విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి! మొత్తం మీద కేవలం 14 రోజుల్లో ఈ తరహా ఘటనలు 350 చోటుచేసుకున్నాయి.

14 రోజుల్లో 350 విమానాలకు బాంబు బెదిరింపులు..
14 రోజుల్లో 350 విమానాలకు బాంబు బెదిరింపులు.. (PTI)

దేశంలో విమానాలకు బాంబు బెదిరింపులు కొనసాగుతున్నాయి! ఆదివారం సైతం 50 బాంబు బెదిరింపులు వచ్చాయి. మొత్తం మీద 14 రోజుల్లో 350 విమానాలకు ఈ తరహా బెదిరింపులు రావడం గమనార్హం! ఇలాంటి బెదిరింపులు విపరీతంగా పెరగడం విమానయాన భద్రతపై ఆందోళన కలిగిస్తోంది.

బెంగళూరు-అయోధ్య ఆకాశ విమానానికి బాంబు బెదిరింపు..

తాజాగా ఆదివారం వచ్చిన బాంబు బెదిరింపు కాల్స్​లో బెంగళూరు టు అయోధ్య ఆకాశ ఎయిర్​లైన్స్​కి చెందిన విమానం కూడా ఉంది. 173 మంది ప్రయాణికులతో బయలుదేరిన విమానాన్ని అత్యవసర భద్రతా ప్రోటోకాల్స్ మధ్య అయోధ్యలో సురక్షితంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ల్యాండ్ అయిన వెంటనే అధికారులు విమానం, అందులో ఉన్నవారిని క్షుణ్ణంగా పరిశీలించారు.

అవసరమైన అన్ని తనిఖీలు పూర్తయ్యాయని, అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదని అయోధ్యలోని మహర్షి వాల్మీకి విమానాశ్రయ డైరెక్టర్ వినోద్ కుమార్ ధృవీకరించారు.

బెంగళూరు నుంచి అయోధ్య వెళ్తున్న ఆకాశ విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. తనిఖీలు విజయవంతంగా నిర్వహించాము. అనుమానాస్పదంగా ఏం కనిపించలేదు. ఆ కాల్ ఫేక్ అని తెలుస్తోంది. విమానంలో 173 మంది ప్రయాణికులు ఉన్నారు,” అని ఎయిర్​పోర్టు డైరెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు.

గత 14 రోజుల్లో భారత విమానయాన సంస్థలు నడుపుతున్న 350 విమానాలకు నకిలీ బాంబు బెదిరింపులు వచ్చాయని అధికారులు వెల్లడించారు. వీటిలో ఎక్కువ బెదిరింపులు సోషల్ మీడియా ప్లాట్​ఫామ్స్​ నుంచే వచ్చాయని వివరించారు.

ఆదివారం తమ 15 విమానాలకు భద్రతా హెచ్చరికలు జారీ చేశామని, అయితే క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత అన్ని విమానాలను ఆపరేషన్లకు అనుమతించామని అకాశా ఎయిర్ నివేదించింది.

ఇండిగోకు చెందిన 18 విమానాలకు బాంబు బెదిరింపు హెచ్చరికలు రాగా, విస్తారాకు 17 విమానాలకు ఇలాంటి బెదిరింపులు వచ్చాయి.

ఈ నెల ప్రారంభంలో దుబాయ్ నుంచి జైపూర్ వెళ్తున్న ఎయిరిండియా ఎక్స్​ప్రెస్​ విమానానికి (ఐఎక్స్-196) కూడా ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చింది.

ప్రభుత్వ స్పందన, శాసనపరమైన చర్యలు..

ఈ బెదిరింపులకు ప్రతిస్పందనగా, ఐటీ మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా ప్లాట్​ఫామ్స్​ని తగిన శ్రద్ధా బాధ్యతలకు కట్టుబడి ఉండాలని ఆదేశించింది. ఐటీ నిబంధనల కింద సూచించిన కఠినమైన కాలవ్యవధిలో వారు ఏదైనా తప్పుడు సమాచార ప్రాప్యతను వెంటనే తొలగించాలి లేదా నిలిపివేయాలి స్పష్టం చేసింది.

విమానయాన సంస్థలను లక్ష్యంగా చేసుకుని పెరుగుతున్న నకిలీ బాంబు బెదిరింపుల బెడదను ఎదుర్కోవటానికి పౌర విమానయాన మంత్రిత్వ శాఖ చట్టపరమైన చర్యలను కూడా పరిశీలిస్తోంది. భద్రతా ప్రోటోకాల్స్​ని పెంచడం, ఇటువంటి విచ్ఛిన్నకర ప్రవర్తనలను నిరోధించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది.

అధికారులు ఈ బెదిరింపులను పరిష్కరించడం కొనసాగిస్తున్నందున, ప్రయాణీకులు, సిబ్బంది భద్రత భారతీయ విమానయానానికి మొదటి ప్రాధాన్యతగా ఉంది.

బాంబు బెదిరింపు వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది?

మిడ్ ఎయిర్ ఫ్లైట్​కు బాంబు బెదిరింపు వస్తే వెంటనే ఎయిర్ పోర్టులో బాంబ్ థ్రెట్ అసెస్​మెంట్ కమిటీ (బీటీఏసీ) సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ బాంబు బెదిరింపు తీవ్రతను, అది వచ్చిన సోర్స్​ని అంచనా వేసిన తర్వాత తదుపరి కార్యాచరణను బీటీఏసీ నిర్ణయిస్తుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Whats_app_banner

సంబంధిత కథనం