Bengaluru Rape Case : యువతిపై ఆటోడ్రైవర్ అత్యాచారం.. స్నేహితులు వచ్చి చూసేసరికి..!-bengaluru auto driver raped women in midnight and sos button saved her life ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Bengaluru Rape Case : యువతిపై ఆటోడ్రైవర్ అత్యాచారం.. స్నేహితులు వచ్చి చూసేసరికి..!

Bengaluru Rape Case : యువతిపై ఆటోడ్రైవర్ అత్యాచారం.. స్నేహితులు వచ్చి చూసేసరికి..!

Anand Sai HT Telugu
Aug 18, 2024 02:49 PM IST

Bengaluru Rape Case : కోల్‌కతా వైద్యురాలిపై అత్యాచారం హత్య ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఇలాంటి అత్యాచార ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా బెంగళూరులో యువతిని ఓ ఆటో డ్రైవర్ అత్యాచారం చేశాడు. యువతి SOS బటన్ నొక్కడంతో ఆమె ప్రాణాలు నిలిచాయి.

యువతిపై అత్యాచారం
యువతిపై అత్యాచారం (HT Telugu)

బెంగళూరులో అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ యువతి బెంగళూరులోని కోరమంగళలో అర్ధరాత్రి పబ్‌ను వదిలి ద్విచక్రవాహనంలో ఇంటికి వెళుతోంది. ఈ సమయంలో వాహనం ప్రమాదం జరగడంతో యువతి వాహనాన్ని వదిలి ఆటోలో ప్రయాణించింది. ఇంతలో ఆటో డ్రైవర్ యువతి పరిస్థితిని చూసి ఆమెను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడ అత్యాచారం చేసినట్లుగా తెలుస్తోంది. యువతి ప్రస్తుతం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. బాధితురాలి స్నేహితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే..

బాధితురాలు బెంగళూరులో డిగ్రీ చివరి సంవత్సరం చదువుతోంది. ఆగస్టు 17న స్నేహితులతో కలిసి పార్టీకి వెళ్లింది. పార్టీ ముగించుకుని వెళుతుండగా స్నేహితుడి కారు ఆటోను తాకింది. ఫోరమ్ మాల్ సమీపంలోని ఈ ఘటన జరిగింది. దీంతో ఆటో డ్రైవర్, బాధితురాలి స్నేహితుడి మధ్య గొడవ జరిగింది. ఆపై యువతి బైక్‌పై వెళ్లింది. మార్గమధ్యంలో కింద పడటంతో ఆటో ఎక్కింది. ఆమె పరిస్థితిని చూసిన ఆటోడ్రైవర్ ఎవరూ లేని ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. యువతి ఫోన్‌లో తన తండ్రి, స్నేహితుడి నంబర్లు ఎమర్జెన్సీ నంబర్లుగా ఉండటంతో SOS బటన్ నొక్కింది.

అర్ధరాత్రి 1 గంట ప్రాంతంలో అత్యాచారయత్నం జరిగింది. బాధితురాలి ఫోన్ నుండి అత్యవసర కాల్, లొకేషన్ అందింది. స్నేహితుడు తిరిగి కాల్ చేసినా రిసీవ్ చేసుకోలేదు. దీంతో లొకేషన్ ఆధారంగా స్నేహితులు ఘటన జరిగిన ప్రదేశానికి వెళ్లారు. స్నేహితులు వచ్చేసరికి బాధితురాలి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. హోసూర్ సర్వీస్ రోడ్ సమీపంలోని బాండ్వి వద్ద షోరూం వెనుక ఉన్న లారీ పార్కింగ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. యువతి లారీ వెనుక వివస్త్రగా పడి ఉంది. ఆమె శరీరంపై వస్త్రం కప్పారు.

ఇంతలో ఓ గుర్తుతెలియని వ్యక్తి ప్యాంటు వేసుకుని నిలబడి ఉన్నాడు. స్నేహితులు అతన్ని పట్టుకోవడానికి వెళ్లగా, అక్కడి నుండి పారిపోయాడు. సంఘటన గురించి అడగగా గుర్తు తెలియని నిందితుడు తనపై అత్యాచారానికి ప్రయత్నించాడని యువతి చెప్పింది.

కోల్‌కతాలో వైద్య విద్యార్థినిపై దారుణంగా దాడి చేసి అత్యాచారం చేసి, హత్య చేసిన ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థి హత్యను ఖండిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. చిన్న పిల్లలు, యువతులు, మహిళలు, యువకులు సహా లక్షలాది మంది చీకట్లో కొవ్వొత్తులు పట్టుకుని మహిళల భద్రత కోసం నిరసనలు తెలుపుతున్నారు. అయితే ఇంతలోనే బెంగళూరులో దారుణం జరిగింది.