ఏరో ఇండియా 2025 నేపథ్యంలో బెంగళూరు విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు అంతరాయం-bengaluru airport announces flight disruptions ahead of aero india 2025 show ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  ఏరో ఇండియా 2025 నేపథ్యంలో బెంగళూరు విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు అంతరాయం

ఏరో ఇండియా 2025 నేపథ్యంలో బెంగళూరు విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు అంతరాయం

HT Telugu Desk HT Telugu

Aero India 2025 show: ఆసియాలో అతిపెద్ద ఏరోస్పేస్, రక్షణ రంగ ప్రదర్శన అయిన ఏరో ఇండియా షో ఫిబ్రవరి 10 నుండి 14 వరకు యెలహంకలోని వైమానిక దళ స్టేషన్‌లో జరుగనుంది. ఈ నేపథ్యంలో విమాన రాకపోకలకు సంబంధించి పలు అంతరాయాలు ఉండనున్నాయి. దీనికి సంబంధించి ఎయిర్‌పోర్ట్ చేసిన సూచనలు ఇక్కడ తెలుసుకోవచ్చు.

కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం

ఫిబ్రవరి 10 నుండి 14 వరకు బెంగళూరులో జరగనున్న ఏరో ఇండియా 15వ ప్రదర్శన నేపథ్యంలో ఫిబ్రవరి 5 నుండి 14 వరకు వాయుమార్గ నియంత్రణ కారణంగా కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం విమానాల రాకపోకలకు సంబంధించి పలు సూచనలు ప్రకటించింది.

ప్రయాణికులు వాయుమార్గ మూసివేత సమయాలను, విమానయాన సంస్థలు తెలియజేసిన విమాన షెడ్యూల్‌ అప్‌డేట్ చేసుకోవాలని కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (BLR) సూచించింది.

"ఫిబ్రవరి 5 నుండి 14 వరకు ఏరో ఇండియా ప్రదర్శన కారణంగా, BLR విమానాశ్రయం ద్వారా ప్రయాణించే ప్రయాణికులు వాయుమార్గ మూసివేత సమయాలను, విమానయాన సంస్థలు తెలియజేసిన విమాన షెడ్యూల్‌ అప్‌డేట్ చేసుకోవాలి. దయచేసి విమానాశ్రయానికి చేరుకునే ముందు మీ ప్రయాణ సమయాన్ని అందుకు తగ్గట్టుగా ప్లాన్ చేయండి. మీ ఓపికకు మేం కృతజ్ఞతలు తెలుపుతున్నాం" అని ఆ పోస్ట్‌లో ఉంది.

థీమ్ ఇదే

"ది రన్‌వే టు ఏ బిలియన్ ఆపర్చునిటీస్" అనే థీమ్‌తో ఈ కార్యక్రమం ఉంటుందని రక్షణ శాఖ పేర్కొంది. గ్లోబల్ భాగస్వామ్యాలను పెంపొందించడం, స్వదేశీకరణను ప్రోత్సహించడం, గ్లోబల్ ఏరోస్పేస్ వాల్యూ చైన్‌లో కొత్త మార్గాలను అన్వేషించడాన్ని లక్ష్యంగా చేసుకుంది.

ఈ కార్యక్రమం మొదటి మూడు రోజులు ఫిబ్రవరి 10, 11, 12 తేదీల్లో వ్యాపార ఒప్పందాల కోసం కేటాయించారు. భారతీయ, విదేశీ కంపెనీలు పరస్పర సహకారానికి ఇది వేదికగా మారుతుంది.

చివరి రెండు రోజులు ఫిబ్రవరి 13, 14 ప్రజల సందర్శనార్థం ఉంటుంది. అద్భుతమైన వాయు ప్రదర్శన, అధునాతన సాంకేతికతల ప్రదర్శన ఆకట్టుకుంటాయి.

(ANI ఇన్‌పుట్స్‌తో)

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.