Bengal crime news : అదృశ్యమైన మూడేళ్లకు సెప్టిక్ ట్యాంక్‌లో అస్థిపంజరమై కనిపించిన మహిళ..
Bengal crime news : పశ్చిమ్ బెంగాల్లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. 3ఏళ్ల క్రితం అదృశ్యమైన ఓ మహిళ అస్థిపంజరం.. సెప్టిక్ ట్యాంక్‌లో కనిపించింది. బాధితురాలి భర్తే.. ఆమెను హత్య చేసినట్టు తేలింది.
West Bengal crime news : పశ్చిమ్ బెంగాల్లో ఓ మహిళ అస్థిపంజరాన్ని సెప్టిక్ ట్యాంక్‌లో నుంచి బయటకు తీశారు పోలీసులు. 3ఏళ్ల క్రితం ఆ మహిళ అదృశ్యమవ్వడం గమనార్హం.
అసలేం జరిగిందంటే..
తుంపా మండల్ అనే మహిళకు కొన్నేళ్ల క్రితం భూమ్బాయ్ మండల్ అనే వ్యక్తితో పెళ్లి జరిగింది. కాగా.. 2020 మార్చ్‌లో ఆ మహిళ కనిపించకుండా పోయింది. ఆ సమయంలో దంపతులు.. దక్షిణ 24 పరగనాస్ జిల్లాలో నివాసముండేవారు.
కూతురు అదృశ్యమైన కొన్ని రోజులకు.. తుంపా మండల్ తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో ప్రాథమిక దర్యాప్తును 2020 ఏప్రిల్‌లో మహిళ భర్తను అరెస్ట్ చేశారు. కాగా.. మహిళ ఏమైంది? ఎక్కిడి కి వెళ్లింది? చనిపోయిందా? భర్తే చంపేశాడా? వంటి ప్రశ్నలకు పోలీసుల వద్ద సమాధానం లేదు. అందుకే భూమ్బాయ్ మండల్‌పై పెట్టిన కేసు నిలువలేదు. సాక్షాధారాలు లేని కారణంగా.. స్థానిక కోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసింది.
Man kills wife in West Bengal : కొంత కాలం తర్వాత.. తన బిడ్డ అదృశ్యమైన కేసుపై ఉన్నతాధికారులు దర్యాప్తు చేపట్టే విధంగా ఆదేశాలివ్వాలని కోల్‌కతా హైకోర్టును ఆశ్రయించాడు తుంపా తండ్రి. ఈ క్రమంలో.. సంబంధిత కేసును సీఐడీకి అప్పగించి, దర్యాప్తు చేపట్టాలని ఆదేశించింది కోల్‌కతా హైకోర్టు.
కోల్‌కతా హైకోర్టు ఆదేశాలతో ఈ నెలలో కేసును తమ ఆధీనంలోకి తీసుకున్న సీఐడీ.. మహిళ భర్తను విచారించింది. 10 రోజుల పాటు జరిగిన ఈ విచారణతో అసలు నిజం బయటపడింది.
భార్యను చంపి. సెప్టిక్ ట్యాంక్‌లో పడేసి..!
విచారణలో భాగంగా.. తన భార్యను తానే చంపినట్టు ఒప్పుకున్నాడు భూమ్బాయ్ మండల్. 2020 మార్చ్‌లో ఆమెను చంపి.. అప్పట్లో తాను నివాసమున్న ఇంటికి సమీపంలోని ఓ సెప్టిక్ ట్యాంక్‌లో మృతదేహాన్ని దాచిపెట్టినట్టు చెప్పాడు.
మండల్ ఇచ్చిన సమాచారంతో చర్యలు చేపట్టిన అధికారులు.. ఘటనాస్థలానికి వెళ్లి సెప్టిక్ ట్యాంక్‌ను పరిశీలించారు. సెప్టిక్ ట్యాంక్‌లో నుంచి మహిళ అస్థిపంజరం బయటకి వచ్చింది. అస్థిపంజరంతో పాటు కొన్ని ఆభరణాలు కూడా బయటకొచ్చాయి. వాటి ఆధారంగానే.. చనిపోయిన మహిళ తుంపా మండల్ అని రుజువైంది.
తుంపా మండల్‌ను నిందితుడు ఎందుకు చంపాడు? అన్న ప్రశ్నకు సమాధానం లభించలేదు. కాగా.. ఆమెకు వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతోనే మహిళను మండల్ చంపినట్టు తెలుస్తోంది. మహిళ నిద్రిస్తున్న వేళ.. దిండుతో ఆమెను ఉక్కిరిబిక్కిరి చేసి, ఊపిరాడనివ్వకుండా చేసి చంపినట్టు పోలీసులు తెలిపారు.
భూమ్బాయ్ మండల్‌ను అరెస్ట్ చేసినట్టు చెప్పిన అధికారులు.. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని హామీనిచ్చారు.
అత్తను చంపిన అల్లుడు..
Vijayawada crime news : దేశంలో నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఓ మహిళను ఆమె అల్లుడు అతి కిరాతకంగా చంపిన ఘటన తాజాగా ఆంధ్రప్రదేశ్ విజయవాడలో వెలుగులోకి వచ్చింది. నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.
కుటుంబ కలహాలతో అత్త నాగమణిని అల్లుడు రాజేష్ హత్య చేసినట్టు ప్రాథమిక సమాచారం ప్రకారం తెలుస్తోంది.మృతురాలు కుమార్తె తో వివాదం నేపథ్యంలో హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం