భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) లో అప్రెంటిస్ పోస్ట్ (Apprentice posts) లకు నోటిఫికేషన్ వెలువడింది. దక్షిణాది రాష్ట్రాలకు చెందిన, ఇంజినీరింగ్ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్ట్ లకు అర్హులు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు జూన్ 21, జూన్ 22 తేదీల్లో నేరుగా ‘వాక్ ఇన్ ఇంటర్వ్యూ (walk in interview)’ కి హాజరు కావచ్చు. ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన సమగ్ర నోటిఫికేషన్ బీఈఎల్ అధికారిక వెబ్ సైట్ bel-india.in. లో అందుబాటులో ఉంది.
ఇంజినీరింగ్ పూర్తి చేసిన దక్షిణాది రాష్ట్రాల అభ్యర్థులకు మాత్రమే ఈ నోటిఫికేషన్ వర్తిస్తుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, కర్నాటక, పాండిచ్చేరి ల స్థానికత కలిగిన, గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఇంజినీరింగ్ పూర్తి చేసిన వారు ఈ అప్రెంటిస్ పోస్ట్ లకు అర్హులు. ఈ అప్రెంటిస్ షిప్ ఒక సంవత్సరం పాటు ఉంటుంది. 25 సంవత్సరాల లోపు వయస్సున్న అభ్యర్థులు మాత్రమే ఈ పోస్ట్ లకు అర్హులు.
రాత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా ఈ అప్రెంటిస్ పోస్ట్ లకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ముందుగా, ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు జూన్ 21, 22 తేదీల్లో బెంగళూరులోని జలహళ్లి లో ఉన్న బీఈఎల్ హోంగిరన సెంటర్ ఫర్ లెర్నింగ్ అండ్ డెవలప్ మెంట్ కు వాక్ ఇన్ ఇంటర్వ్యూకి వెళ్లాలి. అభ్యర్థులు తమతో పాటు ఒరిజినల్ సర్టిఫికెట్లను, ఒక సెట్ సర్టిఫికెట్ల ఫొటో కాపీలను తీసుకువెళ్లాలి. ఏయే సర్టిఫికెట్స్ తీసుకువెళ్లాలనేది నోటిఫికేషన్ లో స్పష్టంగా ఉంది. వాక్ ఇన్ ఇంటర్వ్యూ కి వెళ్లిన అభ్యర్థులకు ఒక రాత పరీక్ష నిర్వహిస్తారు.